Jump to content

లివ్-ఇన్ రిలేషన్ నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదన్న హైకోర్టు


RoadRomeo

Recommended Posts

18 మే 2021, 19:15 IST
ప్రేమ జంట

ఫొటో సోర్స్,GETTY IMAGES

లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న ఒక జంట తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసింది.

అయితే, లివ్-ఇన్ సంబంధాలు నైతికంగా, సామాజికంగా అంగీకారం కాదని వ్యాఖ్యానిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు వారి పిటిషన్ కొట్టి వేసింది.

సహజీవనంలో ఉన్నవారికి ఎలాంటి రక్షణ అందించలేమని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ గత వారం తీర్పు ఇచ్చారు.

ఈ జంట తరపున వాదిస్తున్న లాయర్ జేఎస్ ఠాకూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని బీబీసీకి తెలిపారు.

పంజాబ్‌కు చెందిన ఒక 19 ఏళ్ల యువతి, 22 ఏళ్ల యువకుడు లివ్-ఇన్ సంబంధంలో కొనసాగుతున్నారు.

తమకు రక్షణ కల్పించే దిశగా పంజాబ్ పోలీసులకు, తర్న్ తరన్ జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హై కోర్టులో పిటిషన్ వేశారు.

ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్న జంటలు, తమకు రక్షణ కల్పించాలంటూ స్థానిక కోర్టుల్లోనూ పంజాబ్, హర్యానా హై కోర్టులోనూ పిటీషన్ దాఖలు చేసుకోవడం తరచూ జరిగే విషయమే.

కోర్టులు కూడా ఇలాంటి జంటలకు ఉదారంగా రక్షణ కల్పించే ఏర్పాటు చేస్తాయి.

అయితే, ఇటీవల కాలంలో లివ్-ఇన్‌లో ఉంటున్న జంటలు కూడా రక్షణ కల్పించమంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నాయి.

ప్రస్తుత కేసులో ఆ అమ్మాయి సొంత ఊరు ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాగా, వీరిప్పుడు పంజాబ్‌లోని లుథియానాలో స్థిరపడ్డారు. ఆ అబ్బాయి పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లా నివాసి.

తామిద్దరం మేజర్లమని, గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటామని వారిద్దరూ కోర్టుకు తెలిపారు.

వీరిద్దరూ కూడా అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ అబ్బాయి వేరే కులానికి చెందినవాడు కావడంతో వీరి ప్రేమను బంధువులు అంగీకరించట్లేదని పిటిషన్లో రాశారు.

ఇరు వైపు కుటుంబాలూ వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయారు.

వారి ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ సమస్యల కారణంగానే ప్రస్తుతం పెళ్లి చేసుకోలేకపోతున్నారని, భవిష్యత్తులో వివాహం చేసుకునే ఆలోచన ఉందని వారిద్దరూ చెబుతున్నారు.

వీరికి భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందన్న సంగతి జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు.

అయితే, ప్రస్తుతం వారిద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టి, లివ్-ఇన్ సంబంధంలో ఉన్నవారికి రక్షణ కల్పించలేమని, ఇలాంటి సహజీవనాలు నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కావని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

thank god there is no court involvement on live-IN. 

pelli lenappudu pellam ledu

Pellam lenappdu divorce ledu alimony ledu

policulaki lanchalu levu

lawyers ki caselu levu

court system Ki feesulu levu.

inni lenappudu why would any system encourage livein. 

pray that they don't get control on livein. humanity ki melu chesina vaaru avtaaru. 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...