Jump to content

AP High Court: కోర్టు ధిక్కరణే!


Somedude

Recommended Posts

AP High Court: కోర్టు ధిక్కరణే!

 ఎంపీ రఘురామను రమేశ్‌ ఆసుపత్రికి పంపాలన్న ఆదేశాల్ని ఎందుకు పాటించలేదు?
 సీఐడీ అదనపు డీజీ, మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వోపై హైకోర్టు ఆగ్రహం
 సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభం
ap-main2a_112.jpg

ఈనాడు, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరు రమేశ్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాల్ని ఎందుకు విస్మరించారని సీఐడీ అదనపు డీజీ, మంగళగిరి సీఐడీ ఠాణా స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)లపై హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం ఉత్తర్వులంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది. వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడి ఉన్న ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు ఉత్తర్వులను తక్షణం అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయకపోవడం ఉల్లంఘనకు పాల్పడటమేనని మండిపడింది. సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌, మంగళగిరి సీఐడీ ఠాణా ఎస్‌హెచ్‌వోపై సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. మరోవైపు ఎంపీ వైద్య పరీక్షలను త్వరగా పూర్తిచేసిన మెడికల్‌ బోర్డు.. నివేదికను కోర్టుకు పంపడంలో జాప్యం చేయడంపై సందేహం వ్యక్తం చేసింది. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2గంటలకే పరీక్షలు పూర్తయితే సాయంత్రం 6.30కు తమకు నివేదిక చేరిందని గుర్తు చేసింది. ఈ జాప్యానికి కారణంపై వివరణ ఇవ్వాలని మెడికల్‌ బోర్డు ఛైర్మన్‌, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతికి నోటీసులిచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
హైకోర్టులో బుధవారం విచారణ సందర్భంగా.. ఎంపీ తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్‌.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినందువల్ల వేసవి సెలవుల తర్వాతకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎంపీకి రమేశ్‌ ఆసుపత్రిలోనూ వైద్యపరీక్షలు నిర్వహించాలంటూ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం అమలుచేయాలని తాము ఆదేశాలిచ్చామని, వాటిని ఎందుకు అమలు చేయలేదని అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డిని ప్రశ్నించింది. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. మేజిస్ట్రేట్‌ ఇచ్చింది చట్టవిరుద్ధమైన ఉత్తర్వులన్నారు. వాటిని అమలు చేయాలని హైకోర్టు ఆదేశించలేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్‌కు లేదన్నారు. ఉత్తర్వులు చట్టవిరుద్ధమా.. కాదా అనే విషయంలోకి తాము వెళ్లడం లేదని ధర్మాసనం తెలిపింది. తమ ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ఆదేశించినా.. ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించింది. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశామని ఏఏజీ తెలిపారు. చట్టవిరుద్ధం కాబట్టే అమలు చేయలేదన్నారు. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల ప్రకారం ఎంపీని రమేశ్‌ ఆసుపత్రికి తరలించాలంటూ 16వ తేదీన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాత్రి 11 గంటలకు తమకు అందాయన్నారు. మర్నాటి ఉదయం 10:30 నుంచి ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో నిలిచిపోయిందన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపీని హైదరాబాద్‌లోని సైనికాసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించాలని 17వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశిందని గుర్తు చేసింది. 16వ తేదీ రాత్రి తమ ఆదేశాల్ని అమలు చేయలేకపోతే 17వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సమయం ఉన్నా ఎందుకు అమలు చేయలేదని, ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని ఏఏజీని నిలదీసింది. బాధ్యులైన అధికారులపై సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. చెప్పాలనుకున్నది కౌంటర్‌ ద్వారా తెలపాలని పేర్కొంది. మీరు జారీ చేసింది చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు అని అదే బెంచ్‌ముందు చెప్పడమేంటని ప్రశ్నించింది. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీలుకు వెళ్లాలి తప్ప.. తమ ఉత్తర్వులు తప్పు అని చెప్పే అధికారం లేదని ఏఏజీకి స్పష్టం చేసింది. తామిచ్చిన ఆదేశాల్ని అమలు చేశారా.. లేదా అన్నదే ముఖ్యమని, దానికి సమాధానం కావాలంది.
ఏఏజీ బదులిస్తూ.. చట్టవిరుద్ధ ఉత్తర్వును అమలు చేయలేమన్నారు. రాత్రివేళ జైలు గేటు తెరవలేమన్నారు. ఆ సమయంలో జైలుకెళ్లి అమలుచేయాలని కోర్టు భావిస్తుందా? అని స్వరం పెద్దది చేస్తూ ప్రశ్నించారు. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల అమలు కోసం హైకోర్టును వేదికగా చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కేసులో ప్రత్యేక ఆసక్తి ఏమిటని ఆవేశంగా ప్రశ్నించారు.

ఏఏజీ తీరుపై తీవ్ర అసహనం
ధర్మాసనం స్పందిస్తూ.. తమకు ప్రత్యేక ఆసక్తి ఏమి లేదంది. దయచేసి నియంత్రణలో ఉండాలని ఏఏజీని కోరింది. అలా మాట్లాడొద్దని పేర్కొంది. కోర్టు ఆఫీసరుగా మీరు ఏమి ఆలోచిస్తున్నారని ప్రశ్నించింది. చెప్పింది ఇక చాలు అని ఏఏజీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు ఏఏజీ స్వరం పెద్దది చేసి వాదనలు చెప్పడాన్ని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో నమోదు చేసింది. తమ ఆదేశాల్ని రాత్రి సమయంలో అమలు చేయడానికి సాధ్యం కాకపోయినా మర్నాడైనా ఎందుకు అమలు చేయలేదని సూటిగా ప్రశ్నించింది. వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడి ఉన్న ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలుచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపింది. ఉత్తర్వులను అమలు చేయని అధికారులపై సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Link to comment
Share on other sites

Endhi vayya ee nuisance...aa raju gaaru edho youtube la videos chesthuntey ...dhaaniki ee hadaavidi endho...ee cases Endho...

Rule cheyandraaaa....prajalaki paniki ochey panulu cheyandra antey...24 hours ee courts chuttu and jails chuttu ney tiruguthundhi ee khula gajji thoka govt...

Ippudu emaindhi...ippudu inkaa ekkuva maatladathaaru ...em peekuthaaru...khula thoka ni pisukuntu koorchovaali

  • Upvote 2
Link to comment
Share on other sites

1 minute ago, Pavanonline said:

Wow, Court ichina orders unlawful ani government ye decide chesindi. Inka courts endukata? Balayya movies baga heart ki teeskunatunadu AAG.

AAG shortform ni hindi loki convert chesi nattu unaadu 

AAG (the "fire")

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, nallaberry said:

Mana db big neutral @kidney vachi dhenni khandinchali

Fud Crt chef ki SC lo muttakayalu ready aiythunnayi annamata @3$%

endho daridram AP fud crt chefs are getting out in a "Disturbing" way

Already okadani Retirement time lo "Distrubing Judgement" ani mingi intiki pampinchindhi..

inkodini papam Sikkim pampinchindhi

Link to comment
Share on other sites

9 minutes ago, Hydrockers said:

Lalitha ante jaggadu complaint chesina 6 judges lo okaru kada ?

Haha. Tuesday stories tho ready ayyava? Jaggadu complain chesina judge no kadho pakkana petti - ee points okay antava?

 

 

Link to comment
Share on other sites

dhaeniki Dhikkarana anta

1. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2గంటలకే పరీక్షలు పూర్తయితే సాయంత్రం 6.30కు తమకు నివేదిక చేరిందని గుర్తు చేసింది

Avunu Tests kaaganae Reports vasthaya?.. Akkada Sheem, Guv reports ae late aiythunnayyi.. After all eedhentha. Dora reports 24 Hrs late aiyyayi.. Guv reports 1/2 day late aiyyindhi.. Jayo L@litha Hosp lo vunnappudu HC ki 2 days delay chesi reports icharu. Mari chinna pillala laga vunnaru Fud crts chef.. Antha aathram vuntae vallanae tests chesukomanalae.

2. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీలుకు వెళ్లాలి తప్ప.. తమ ఉత్తర్వులు తప్పు అని చెప్పే అధికారం లేదని ఏఏజీకి స్పష్టం చేసింది.

Govt Already appeal chesindhi gaa.. yem kallu minginaya vallaki.. "dont argue just reply in notice" antae etla.. Midnight Orders vasthae.. ela implement cheyyalae ?. SC ii FC Chef ni mingaettattundhi.. Midnight Orders ela implement cheyyalae ani @3$% . Covid time lo tests 1 Hr lo kavalae, 2 Hrs lo release cheyyalae antae etla.. few Hrs delay aiythadhi, needs patience ani

ధర్మాసనం స్పందిస్తూ.. తమకు ప్రత్యేక ఆసక్తి ఏమి లేదంది. దయచేసి నియంత్రణలో ఉండాలని ఏఏజీని కోరింది.

Gudh# lo kaalinattunindhi.. R@mesh Hosp ki badhalu Military Hosp pampagaanae.. Antha Spl interest endhuko mari 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...