Jump to content

గంగా శ‌వ‌వాహిని for Naked King Modi


paaparao

Recommended Posts

గంగా శ‌వ‌వాహిని
-ప‌రుల్ క‌క్క‌ర్ (గుజ‌రాతీ క‌వ‌యిత్రి)
భ‌య‌ప‌డ‌కు..ఆనంద‌ప‌డిపో..
ఒకే గొంతుతో శ‌వాలు మాట్లాడుతాయి
ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వాలు గంగాన‌దిలో ప్ర‌వ‌హించ‌డం చూశాం
ఓ రాజా..అడ‌వి అంతా బూడిద‌య్యింది,
ఆన‌వాళ్ళు లేవు, అంతా శ్మ‌శాన‌మైపోయింది,
ఓ రాజా..బ‌తికించే వాళ్ళు లేరు,
శ‌వాల‌ను మోసేవాళ్ళూ క‌నిపించ‌డం లేదు,
ధుఃఖితులు మాత్రం మిగిలారు
అంతా కోల్పోయి మిగిలాం
మాట‌లు లేక‌ బ‌రువెక్కిన మా హృద‌యాలు శోక‌గీతాలైనాయి
ప్ర‌తి ఇంటిలో మృత్యుదేవ‌త ఎగిసిప‌డుతూ తాండ‌వ‌మాడుతోంది
ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది
ఓ రాజా..క‌రిగిపోతున్న పొగ‌గొట్టాలు క‌దిలిపోతున్నాయి, వైర‌స్ మ‌మ్మ‌ల్ని క‌బ‌ళించేస్తోంది
ఓ రాజా.. మా గాజులు ప‌గిలిపోయాయి, భార‌మైన మా హృద‌యాలు ముక్క‌ల‌య్యాయి
అత‌ను ఫిడేలు వాయిస్తున్న‌ప్పుడు మా న‌గ‌రం కాలిపోతోంది
బిల్లా రంగాల బ‌రిసెలు ర‌క్త‌ద‌ప్పిక గొన్నాయి
ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది
ఓ రాజా..నీవు మెరిసిపోతున్న‌ట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు త‌ళుక్కుమ‌న‌డం లేదు
ఓ రాజా..ఈ న‌గ‌రమంతా చివ‌రిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి
ఇక‌ ప‌రిమితులు, మిన‌హాయింపులు లేవు నీ ద‌మ్ము చూపించు,
రా..బయిటికి రా.. గ‌ట్టిగా చెప్పు, పెద్ద‌గా అరువు,
దిగంబ‌ర రాజు అవిటివాడు, బ‌ల‌హీనుడు
ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండ‌లేన‌ని చెప్పు
కోపంతో ఊగిపోతున్న న‌గ‌రం మంట‌లు ఎగిసిప‌డుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి,
ఓ రాజా.. నీ రామ‌రాజ్యంలో శ‌వ‌గంగా ప్ర‌వాహాన్ని చూశావా?...
 
ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న కవిత !
Parul Kakkar అనే ఈ గుజరాతీ కవయిత్రి మీద భక్తుల దాడి మొదలైంది.ఏకంగా 28000 abusive కామెంట్లతో పాటు బూతులు 50 ఏళ్ళ తనపై రేప్ కు పాల్పడతామంటూ బెదిరింపులూ..గృహిణి అయిన పారుల్ కొన్నేళ్లుగా కవిత్వం రాస్తున్నారు.
అయితే ఇప్పుడు గుజరాత్ లోని ఒక శ్మశాన వాటికలో శవాల వేడికి కూలిపోయిన పైకప్పు , గంగానది లో తేలియాడుతున్న శవాలను చూసి మనస్తాపానికి గురైన పారుల్ 14 పంక్తుల కవిత రాశారు. " శబ్ వాహిని గంగా " పేరుతో రాసిన ఈ కవితలో " బట్టలు లేని రాజు " అని రాయడం భక్తులకు కోపం తెప్పించింది.ఆమెను దేశద్రోహి అనీ దాడులు చేస్తామని భయపెడ్తున్నారు.
ఈ కవిత ఆరు భాషల్లోకి అనువాదమై లక్షల షేర్ ల తో వైరల్ అవ్వడం వాళ్ళకు మింగుడుపడడం లేదు.పారుల్ ను అపర సరస్వతి అని కొనియాడిన rss పత్రిక ' సాధనా ' కూడా ఆమె కవిత్వం పై విమర్శలు గుప్పిస్తోంది. ఫెస్బుక్ నుండి ఆమె కవితను డిలీట్ చెయ్యమని మంత్రుల స్థాయినుండి ఫోన్లు వచ్చాయి.ఆమె పబ్లిక్ అకౌంట్ ను ప్రయివేట్ చేసుకున్నారు.అయితే గుజరాతీ రచయిత మండలి ఆమెకు అండగా ఉన్నారు.స్టాండ్ విత్ పారుల్ పేరుతో ట్వీట్ చేస్తున్నారు.
గంగా శ‌వ‌వాహిని
-ప‌రుల్ క‌క్క‌ర్ (గుజ‌రాతీ క‌వ‌యిత్రి)
 
 

BJP Furious as Top Gujarati Poet Blames 'Naked King' Modi for Corpses Floating in the Ganga

  • Like 1
Link to comment
Share on other sites

  • paaparao changed the title to గంగా శ‌వ‌వాహిని for Naked King Modi

UP, Bihar are the states where majority of the people go to kumbh mela... there are many people in those states that believe that it is good if they put the body in the Ganga river... it is more to do with the illiteracy of the people... than what Modi did.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...