Jump to content

టీవీ 5 నుంచి ఆర్ఆర్ఆర్ అకౌంట్ కు 10 ల‌క్ష‌ల యూరోలు!


Hydrockers

Recommended Posts

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు పై న‌మోదైన కేసుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో సంచ‌ల‌న అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. టీవీ 5 బాస్ నుంచి ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఏకంగా 10 ల‌క్ష‌ల యూరోలు ట్రాన్స్ ఫ‌ర్ అయ్యాయ‌ని పేర్కొన‌డంతో పాటు, ర‌ఘురామ‌కృష్ణం రాజు - తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు- ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ల మ‌ధ్య‌న జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ గురించి కూడా ఏపీ ప్ర‌భుత్వం త‌న అఫిడ‌విట్ లో పేర్కొంది.

ర‌ఘురామ‌కృష్ణంరాజును అరెస్టు చేసిన స‌మ‌యంలో ఆయ‌న ఫోన్ ను స్వాధీనం చేసుకుని, సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం... అఫిడ‌విట్ లో సంచ‌ల‌న అంశాల‌ను ప్ర‌స్తావించిన‌ట్టుగా తెలుస్తోంది.  ఒక ప‌థ‌కం ప్ర‌కారం ఏపీ ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లే పనిని ర‌ఘురామ‌కృష్ణం రాజు, చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న అనుకూల మీడియా జాయింటుగా నిర్వ‌హించిన‌ట్టుగా ఏపీ ప్ర‌భుత్వం త‌న అఫిడ‌విట్ లో పేర్కొంది. ఈ విష‌యంలో వారి మ‌ధ్య‌న ఆర్థిక లావాదేవీలు కూడా జ‌రిగిన‌ట్టుగా వివ‌రించింది. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ ఎంపీ ఇమేజ్ తో ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతున్నందుకు టీవీ ఫైవ్ య‌జ‌మాని నాయుడు నుంచి ఏకంగా ప‌ది ల‌క్ష‌ల యూరోలు కూడా ఆర్ఆర్ఆర్ అకౌంట్ కు జ‌మ అయిన‌ట్టుగా ప్ర‌భుత్వం త‌న పిటిష‌న్లో పేర్కొంది. అలాగే ర‌ఘురామ‌కృష్ణంరాజు ప్రెస్ మీట్ నిర్వ‌హించిన ప్ర‌తిసారీ ఆయ‌న‌ను అభినందిస్తూ.. చంద్ర‌బాబు, టీవీ ఫైవ్, ఏబీఎన్ వ‌ర్గాల నుంచి వాట్సాప్ మెసేజ్ లు వెళ్లిన వైనాన్ని కూడా ఏపీ ప్ర‌భుత్వం త‌న పిటిష‌న్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

ఒక వ్యూహం ప్ర‌కారం.. ఇదంతా జ‌రిగింద‌ని, ర‌ఘురామ‌కు ఇన్ పుట్స్ ను అందిస్తూ, ఆ త‌ర్వాత ఆయ‌న వీడియోలకు వ‌చ్చిన వ్యూస్ ను సైతం ప్ర‌స్తావించి అభినందించిన‌ట్టుగా అఫిడ‌విట్లో పేర్కొన్నారు. 

దర్యాప్తు సమయంలో రఘురామ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్‌ను పరిశీలించి రూపొందించిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, ఆయన సెల్‌ ఫోన్‌ నుంచి వచ్చిన మొత్తం వివరాలను కోర్టు ముందు ఉంచింది ఏపీ ప్రభుత్వం. 

సింహ‌మే సింగిల్ గా వ‌స్తుంది, మీ దారి ర‌హ‌దారి, సింహం కూర్చున్న‌దే సింహాస‌నం.. వంటి సినిమా డైలాగుల‌తో పాటు, యూట్యూబ్ లో ర‌ఘురామ వీడియోల‌కు ప‌ది వేల వ్యూస్ కు పైగా వ‌చ్చిన‌ప్పుడు టీడీపీ వ‌ర్గాల నుంచి ర‌ఘురామ‌కు అభినంద‌న‌లు వెళ్లాయ‌ట‌. 

ఈ కేసులో ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలను పరిశీలిస్తే.. పిటిషనర్లు (ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ5) ఒక వర్గం ప్రజలను మరో వర్గంపైకి రెచ్చగొట్టే కుట్రలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేలా కుట్ర పన్నాయని.. ఈ కుట్ర‌లో ర‌ఘురామ‌కృష్ణంరాజు భాగ‌స్వామి అయ్యాడ‌ని ఏపీ ప్ర‌భుత్వ అఫిడ‌విట్ లో పేర్కొన్నారు. ఈ గుట్టునంతా ర‌ఘురామ‌కృష్ణంరాజు  ఫోన్ విప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Just now, RedThupaki said:

Bluee  media gospell pracharam?

Pinkk media gorrela pracharaam?

Govt court ki affidavit iste inga blue media pracharam em undi le 

Let's see what's gonna happen 

Link to comment
Share on other sites

 

 

  • టీడీపీతో, ఆ చానళ్లతో కుమ్మక్కు
  • మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర
  • హింసకు కారణమైన రఘురామ ప్రసంగాలు
  • జగన్‌ సర్కారు ఆరోపణలుసుప్రీంకోర్టులో అఫిడవిట్‌
  • బార్‌ అండ్‌ బెంచ్‌  వెబ్‌సైట్‌లో కథన
 
 

న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు బరితెగించింది. ఎదుటివారిపై బురద జల్లడమే తమ విధానమని మరోసారి రుజువు చేసుకుంది. తమ పార్టీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు.. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’, ‘టీవీ 5’ చానళ్లతో, టీడీపీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని ఆరోపిస్తూ సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ కుట్రలో భాగంగా టీవీ చానళ్లకు, రఘురామరాజుకు నడుమ డబ్బు లావాదేవీలు కూడా జరిగాయని ఆరోపించింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తమ పార్టీ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక చర్యలపై చానళ్లపైనా రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తమపై పెట్టిన కేసు అక్రమమంటూ రెండు చానళ్లూ రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం వేర్వేరుగా సుప్రీంను ఆశ్రయించాయి. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్లపై మే 31న విచారణ జరిపి.. ఈ కేసులో మీడియాపై దుందుడుకు చర్యలు వద్దని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

 

ఈ కేసులో కౌం టర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన ఏపీ సర్కారు.. అం దులో పలు ఆరోపణలు చేసింది. ఒక సందర్భంలో రఘురామ రాజుకు టీవీ5 చైర్మన్‌ పదిలక్షల యూ రోలు (దాదాపు రూ.8.8 కోట్లు) బదిలీ చేసినట్లు తెలుస్తోందని.. అందుకు బదులుగా (క్విడ్‌ ప్రో కో).. రఘురామ రాజు తన పదవిని ఆయా న్యూస్‌ చానళ్లకు సంబంధించిన వ్యక్తుల ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో వాక్స్వాతంత్ర్యాన్ని తాము పవిత్రమైనదిగానే భావిస్తామని, పత్రికలకు ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర ఉందని.. అయితే, వాటిని ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను, విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి అనుమతించలేమని తెలిపింది. మీడియా సంస్థలు ప్రజలకు ట్రస్టీల్లాంటివని.. అవి ప్రజల ప్రయోజనాల కోసమే తమ వేదికలను ఉపయోగించుకోవాలి తప్ప మరో రకంగా కాదని పేర్కొంది. రఘురామకృష్ణ రాజు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలను ముందుగానే ఒక పథకం ప్రకారం తయారు చేసి ప్రసారం చేశారని.. న్యూస్‌ చానల్స్‌, టీడీపీ సభ్యులు, రఘురామకృష్ణ రాజు వివరంగా చర్చించుకున్న తర్వాతనే ఈ ప్రసారాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఆయన ప్రసంగాలు క్షేత్రస్థాయిలో హింసకు కూడా దారితీశాయని తెలిపింది, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దీని వెనుక ఉన్నట్టు ఆరోపించింది. రఘురామ రాజు, చంద్రబాబు, లోకేశ్‌ మధ్య ఫోన్లలో జరిగిన సంభాషణలు, వారు షేర్‌ చేసుకున్న డాక్యుమెంట్లు.. ప్రజాస్వామికంగా ఎన్నికైన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రను వెల్లడిస్తున్నాయని జగన్‌ సర్కార్‌ తమ అఫిడవిట్‌లో ఆరోపించింది.

 

 

దర్యాప్తు సమయంలో రఘురామ కృష్ణ రాజు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ ఫోన్‌ను పరిశీలించి రూపొందించిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు, ఆయన సెల్‌ ఫోన్‌ నుంచి వచ్చిన మొత్తం ఎలకా్ట్రనిక్‌ వివరాలను కోర్టు ముందు ఉంచినట్టు తెలిపింది. రఘురామకృష్ణం రాజు ప్రెస్‌ మీట్ల తర్వాత మీడియా వ్యక్తులనుంచి ఆయనకు ప్రశంసలు వచ్చాయని ఆరోపించిన జగన్‌ ప్రభుత్వం.. అందులో కొన్నింటిని అఫిడవిట్‌లో ఉటంకించింది. ‘‘వావ్‌.. మీరు మంచి పంచ్‌ ఇచ్చారు’’, ‘‘సింహం ఒంటరిగా వస్తుంది.. పం దులు గుంపులుగా వస్తాయి’’, ‘‘మీ సమాధానాలతో సోషల్‌ మీడియాలో ఉద్రేకం చెలరేగింది’’, ‘‘మీ దారి రహదారి’’, ‘‘మీరు పార్టీకి పెద్ద బొక్క పెడుతున్నారు’’, ‘‘సింహం కూర్చున్నదే సింహాసనం’’, ‘‘మీ ఇంటర్వ్యూ సూపర్‌ హిట్‌’’, ‘‘మళ్లీ ఇవాళ సూపర్‌హిట్‌ అయ్యింది. యూట్యూబ్‌ స్ట్రీమ్‌ 10వేలు దాటింది’’.. అంటూ చానళ్లు రఘురామ రాజును ప్రశంసించాయని ఆరోపించింది. రఘురామకృష్ణం రాజు పార్లమెంటు సభ్యుడు అయి ఉండీ.. ఉద్దేశపూర్వకంగా, తన అధికారాన్ని దుర్వినియోగపరిచి వివిధ వర్గాల ప్రజల మధ్య, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకతను ఉసిగొలిపేలా వ్యవహరించారని.. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికలపై, మీడియా చానళ్ల ద్వారా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని అఫిడవిట్‌లో ఆరోపించింది.

 

 

 

రఘురామరాజు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లను చానళ్లు తమ విధిలో భాగంగా మాత్రమే చేయలేదని.. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం చేశాయని, వివిధ సామాజిక వర్గాల మధ్య శత్రుత్వాన్ని, ప్రభుత్వం పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టి, హింసకు ప్రేరేపించే కుట్రకు పాల్పడ్డాయని ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలను పరిశీలిస్తే.. పిటిషనర్లు (ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ5) ఒక వర్గం ప్రజలను మరో వర్గంపైకి రెచ్చగొట్టే కుట్రలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేలా కుట్ర పన్నాయని ఆరోపించింది.

Link to comment
Share on other sites

48 minutes ago, Hydrockers said:

@NiranjanGaaru endayya idhi

It's paytm pake story. Even if that transaction is real, it is real business transaction. Raju gaaru tv5 owner ki current ammadu. It's not quid pro scam like jalaganna. 

Link to comment
Share on other sites

papam AP public...

nimmagadda tarvata opposition leader ae karuvainadu anukune time lo RRR devudi laaga dorikindu..

ipudu ie donka kuda edo kadulutunatu vundi..

next opposition evaru aitaro sudali 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...