Jump to content

Moon pie (part 1)


kalaa_pipaasi

Recommended Posts

 

బెడషీట్ కప్పుకుని నిద్ర మత్తు లో పడుకుని ఉన్న.ఉదయం 7:30 కావొస్తుంది.ఫోన్ రెండు సార్లు రింగ్ అయ్యింది.ఆ ఎవడు ఎత్తుతాడులే అని లిఫ్ట్ చేయలేదు.మళ్ళి రింగ్ అవుతుంది.వీడికేంటి ఇంత ఆవేశం వెంట వెంటనే ఫోన్ చేస్తున్నాడు అని తిట్టుకున్నా.సరే పోనీలే ఎవరైనా అర్జెంటు పని మీద ఫోన్ చేస్తున్నారేమో అని అనిపించింది. ఫోన్ లిఫ్ట్ చేశా, అవతల నుండి ఎవరో అమ్మాయి.హిందీ లో “ఆప్ కౌన్ హాయ్” అని నాకు కాల్ చేసి అడుగుతుంది.ఎదవ నస, చిరాకు దొబ్బిస్తున్నారు అని కసురుకుని ఫోన్ పెట్టేసా.కొంచం సేపటికి మళ్ళి ఫోన్ రింగ్ అవుతుంది.వేళా పాళ లేకుండా పొద్దునే ఫోన్స్ చేసి విసిగిస్తున్నావ్ అని తిట్టాలనిపించింది.
ఫోన్ లిఫ్ట్ చేయగానే హాయ్ సతీష్ అని అన్నది అవతలి అమ్మాయి.నా పేరు వినగానే  అప్పటిదాకా వొచ్చిన కోపం దెబ్బకి పోయింది.అవతల కాల్ చేసింది నేను తెల్సిన వాళ్ళే, ఆ టోన్ ఎక్కడో విన్నాను.తనకి నా పేరు ఎలా తెల్సా అని ఆలోచిస్తున్న.


“హాయ్ హౌ అర్ యు ఇట్స్ బీన్ లాంగ్ టైం” అని మాట్లాడుతుంది.డౌట్ లేదు, తెల్సిన అమ్మాయే,కానీ మనిషి గుర్తు రావడంలే.

"యా...ఐ అం డూయింగ్ గుడ్.హౌ అబౌట్ యు" అని అడిగా ఎదో ఫార్మాలిటీ కోసం.
"హే డోంట్ యూ రెమెంబెర్ మీ" అని అడిగింది ఆ అమ్మాయి 
"ఐ అం సారీ.ఐ కెన్నొట్ రికాలెక్టు యు"
"నేను అర్షి ని. మర్చిపోయావా నన్ను"
"ఓహ్ నువ్వా..నో నో నో గుర్తున్నావు.ఎన్నాళ్లకి ఫోన్ చేసావు ఎలా ఉన్నావ్ జంగిలి పిల్ల"
"నువ్వు పిచ్చ పోష్ ఉంటావ్ పిల్ల అని అనేవాడివి నన్ను..., నను జంగిలి అంటున్నవ్ ఇపుడు" 


ఆలా కొంచం సేపు మాట్లాడుకున్నాం.అర్షి, నేను కల్సి Ranbaxy కి పనిచేశాం. అర్షి భలే ఉంటది.కొంచం పొట్టి పిల్ల.తన నేటివ్ పూణే.మంచి ప్యాషన్ సెన్స్ ఉన్న అమ్మాయి.ఏ డ్రెస్ వేసిన సరే ఇట్టే సెట్ అవుతాది తనకి."మూన్ పై" అని తనకి నేను పెట్టుకున్న ముద్దు పేరు.ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి.

తనతో ఫోన్ మాట్లాడి పెట్టేయగానే ఒక తెలియని ఆనందం ఆవేశం నాలో.ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు.అసలు ఎందుకు ఆనంద పడాలి.ఆ పిల్లకి ఈ పాటికి పిల్లలు కూడా ఉన్నాల.తను ఊరికే ఆలా టైం పాస్ కి ఫోన్ చేసిందేమో.ఈ మాత్రం దానికే ఇంత సంతోషపడాలా.కానీ మనసు మాట వినడం లేదు.ఎవరికో ఒకళ్ళకి చెబితే కానీ కుదుట పడేలా లేను.

ఎవరికీ ఫోన్ చేయాలా అని ఆలోచిస్తున్న.వెంటనే ఆ రోజుల్లో అక్కడ పనిచేసేటప్పుడు పరిచయం అయిన నా ఫ్రెండ్ నేహా గుర్తొచ్చింది.అప్పట్లో మేమంతా అక్కడ కల్సి పనిచేసేవాళ్ళం.నేహాకి అర్షి గురించి, నా గురించి, నేను అర్షి కి సైట్ కొట్టిన విషయం,ఆఫీస్ లో గొడవ ఐన సంగతి, అన్ని తెల్సు నేహా కి.ఇవన్నీ ఎందుకు, అర్షికి మీ హైదరాబాద్ అబ్బాయి తోనే పెళ్లయింది అని తన పెళ్లి ఫొటోస్ నాకు పెట్టింది కూడా నేహానే.

తనకే  కాల్ చేసి చెప్పాలనిపించింది.అర్షి నను మర్చిపోలేదు, తను నాకు ఇప్పుడే కాల్ చేసింది అని డంకా కొట్టాలనిపించింది.ఫోన్లో నేహా నెంబర్ వెతికి డయల్ చేశా.నేహా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.టైం చూసుకున్న పొద్దున 8 అవుతుంది.అందరూ ఆఫీస్లకి రెడీ అయ్యే టైం లో ఇలా కాల్ చేసి పిచ్చాపాటి మాట్లాడితే తిడతారు అని లైట్ తీసుకున్న,ఇక చేసేది లేక.తనే మళ్ళి కాల్  చేస్తుంది ఫ్రీ అయ్యాక అనిపించింది.
 
అర్షి గుర్తొచ్చింది మళ్ళీ.మేరా చాంద్ కి తుక్డా అప్పుడు ఎంత అందంగా ఉండేది పాలరాతి బొమ్మలా...ఇపుడు ఎలా ఉందొ.తెగ సైట్ కొట్టేవాడిని ఒకప్పుడు.కొన్ని రోజులు నను అసహ్యించుకుంది.తర్వాత మెల్లగా దగ్గరైంది. ఇదంతా జరిగి 2 సంవత్సరాలు కావొస్తుంది. తన గురించి ఆలోచనలు,అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి.
 
  • Upvote 1
Link to comment
Share on other sites

  • kalaa_pipaasi changed the title to Moon pie (part 1)

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...