Jump to content

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకుంటున్నారా ??? ఐతే తస్మాత్ జాగ్రత్త!


afacc123

Recommended Posts

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకుంటున్నారా ??? ఐతే తస్మాత్ జాగ్రత్త!

ఈ మధ్యకాలంలో సమాజంలో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము. అదేమిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ పెళ్ళిరోజు వేడుకలు  ఇది ఎంత తప్పో మీకు తెలుసా ..?

హైందవ గ్రంథాల ప్రకారము ఇది తప్పు!

ఔను ఈ విధంగా అర్ధరాత్రి వేడుక ఎంత తప్పో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

ఈ మధ్య కాలంలో నేటి సమాజంలో ఎవరిదైనా పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.

కానీ హైందవ గ్రంథాలు రాత్రి 12 గంటల సమయంను "నిషిద్ధ" కాలంగా అభివర్ణించాయి.

ఔను మధ్య రాత్రి 12 గంటల నుంచి వేకువ ఝాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారం "నిషిద్ధ ఘడియలు".

అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయంలో జరిగే సంబరాలు మనం నిషిద్ధ కాలంలో జరుపుకొంటున్నాము. కానీ హైందవ గ్రంథల ప్రకారం ఈ నిషిద్ధ సమయంలో మానవ నేత్రాలకు కనబడని ఎన్నో దుష్ట శక్తులు, దయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్తుంటాయి. ఈ  నిషిద్ధ సమయంలో వాటి శక్తులు కూడా పెరుగుతాయి.

మనం జీవించే ఈ భూమండలంలో అలాంటి శక్తులు చాలానే ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు, కానీ వాటి వల్ల మానవ జీవితాలకు ఎన్నో భయానక మరియు చెడు ఫలితాలు గోచరిస్తాయి. వీటి చెడు  ప్రభావములచే మానవ జీవితం అపసవ్య మార్గoలో పయనించును.

ఈ నిషిద్ధ కాలంలో జరుపుకొనే వేడుకల వల్ల ఈ దుష్టశక్తులు మన ఆయువుని హరిస్తాయి. అంతేగాక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి, దురదృష్టం ఇంటి తలుపు తడుతుంది. కేవలం ఒక సంవత్సరంలో 4 పండుగలు. అవి దీపావళి, నవరాత్రులు, జన్మాష్టమి మరియు శివరాత్రి రోజులలో మాత్రమే ఈ నిషిద్ధ కాలం పుణ్య ఫలితాలను ఇస్తుంది, అది ఎందుచేతనంటే ఈ సమయాలలో నిషిద్ధ కాలం, మహా నిషిద్ధ కాలంగా గోచరించబడుతుంది.

పైన తెలిపిన నాలుగు పండుగలు మినహా అన్ని రోజులు నిషిద్ధ కాలములే.. 

హైందవ గ్రంధాల ప్రకారం సూర్యోదయం తోనే రోజు మొదలౌతుంది. అంతే గాక ఎందరో ఋషులు మరియు మునులు / సన్యాసులు ప్రకారం సూర్యోదయం పుణ్యకాలం.

ఈ సమయంలో వాతావరణం చాలా శుద్ధిగా, ప్రతికూలతలు లేనిదై ఉండును. హైందవ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాత మాత్రమే పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మధ్య రాత్రిలో "రజో" మరియు "తమో" గుణాలు వాతావరణంలో మెండుగా ఉండి, ఆ సమయంలో తెలియజేయు అభినందనలు శుభ ఫలాలు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చును. ఏదిఏమైనా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కేకులు కోయడం మన సంప్రదాయం కాదు.

మన హిందూ ధర్మం ఏంతో శాస్త్రీయతతో కూడుకున్నది. కావున హిందూ ధర్మాలలో పొందుపరిచిన మార్గాలనే మనం ఎంచుకొందాం/ఆచరణలో పెడదాం..

ఈ వ్యాసాన్ని/ సారాన్ని ప్రతి హైందవునితో పంచుకోగలరు.🌹💐🌺

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, grogu said:

ciabatta bread buttered and toasted along with bull's eye ... ekkuva tintunnana battusSc_hidingsofanuvvu em tinnav battu S%Hi

 

varsham padindi intlo snacks senaga gugillu Nalla Senaga Guggillu Telugu Recipe-నల్ల సెనగ గుగ్గిళ్ళు | Maatamanti

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...