Jump to content

రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలు


Slayer

Recommended Posts

Sports bike nundi padipoyadu antaa , and overspeed

 

 సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్‌ ఉన్నా, ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు.

బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా?అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు. సాయితేజ్‌కు బైక్‌ రైడింగ్‌ ఇష్టం. షూటింగ్‌ లేని సమయంలో తన బైక్‌ లేదా స్నేహితుల బైక్‌ తీసుకుని సరదాగా రైడింగ్‌కు వెళ్లటం అలవాటు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా బైక్‌పై వెళ్లిన సాయిధరమ్‌ తేజ్‌ కేబుల్‌ బ్రిడ్జ్‌ సమీపంలోకి రాగానే  వేగాన్ని నియంత్రించలేక కింద పడిపోయారు. మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని వివరించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...