Jump to content

మేము కూడా చింతిస్తున్నాం…

dasari4kntr

Recommended Posts

1 minute ago, sri_india said:

emi matladuthunav ...no one told me but looks like you are @Anbe_Shivam who scammed many people earlier in this DB .... I just sense something from your posts ..... just confirming anthy avunoo kadhoo ani 

Who are we to judge who spaming or scaming.

E db emana real life edo ganta vachama sodi share chesama dobesama ante..

If someone beliefs all these ids are real life characters you cant help those dumbos.

I even heard some db lovers god save them.

Link to comment
Share on other sites

34 minutes ago, JustChill_Mama said:

Dasari bro … chathura, vipula ani inka evo untayi kadha … alage velugu , namasthe telangana, sakshi,Jyothi la Annitiki pampi chudandi. 

email address vunte..share cheeyyi..

Link to comment
Share on other sites

33 minutes ago, DuvvaAbbulu said:

Can you post story here 

హిస్టరీ మాస్టర్ 

జీవితం లో మనం ఎంతో మందిని చూస్తాం...పరిచయం పెంచుకుంటాం...కొంత మందిని ఎక్కవ కాలం గుర్తుపెట్టుకుంటాం, మరికొంతమందిని జీవితాంతం. 

అలాగే మరికొందరిని వాళ్ళ మనస్తత్వం నచ్చకపోతే వీలైతే అంత తొందరగా మరిచిపోతాం… 

మరిచిపోయిన వాళ్ల గురుంచి ఎలాంటి చింతా లేదు ఎందుకంటే వాళ్ళు మన జీవితంపైన ఎలాంటి ప్రభావం చూపించలేదు... కానీ మనం గుర్తుపెట్టుకున్న ఆ కొంత మందికి మనం ఎంతో కొంత గౌరవం, గుర్తింపు ఇస్తున్నాం అనేగా…!!

ఇలా నా జీవితం లో గుర్తుపెట్టుకున్న కొంత మందిలో ఒకరు మా హిస్టరీ మాస్టర్ వెంకట్రావు.

అది నేను 10వ తరగతి చదువుతున్న రోజులు. మాది ఒక చిన్న టౌన్, అందులో ఒక తెలుగు మీడియం బడి.

చదవడం ఒక పెద్ద బాధ్యత లా భావించి, అది నా బుఱ్ఱకి ఎక్కినా ఎక్కకపోయినా బట్టి పట్టేసి కాలం వెళ్లబుచ్చుతున్న రోజులు. క్లుప్తంగా చెప్పాలంటే చదవు విలువ తెలియని రోజులు. 

ప్రతి సబ్జెక్టు ఒక పజిల్...ఇది ఇలానే ఎందుకుంది? ఇంకోలా ఎందుకు లేదు? అని ప్రశ్నలు అడిగితే మొట్టికాయలు వేసే మాస్టర్లు … గణితం లో సూత్రాలు బట్టి పట్టడం… తెలుగులో సందులు సమాసాల తో కుస్తీ ...ఇంగ్లీష్ లో గ్రామర్ గోల … ఇంక సైన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు…పీడనం, అయస్కాంతం, సజాతి విజాతి ధ్రువాలు, లఘు దర్పణం, దీర్ఘ దర్పణం లాంటి వాడుకభాష లో లేని, అర్ధం కానీ పదాల గోల…

చివరగా సోషల్ (సాంఘీక శాస్త్రం)...ఇది ఏమి సైన్స్ కి తీసిపోలేదు …శీతోష్ణమండలం, ఉదక మండలం, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ రాజు ఎంత కప్పం కట్టించుకున్నాడు లాంటి విషయాలతో పూర్తిగా నిడిపోయుండేది… 

దానిని అప్పటివరకూ ఉన్న మాస్టర్లు , ఇది ఇంతే … ఇలానే ఉంటుంది … ఇలానే పరీక్షల్లో రాస్తే మార్కులు పడతాయి అని చెప్పే బాపతు … 

అలా కాలం గడుపుతున్న ఆ 10వ తరగతి రోజుల్లో…అప్పటివరకు ఉన్న సోషల్ మాస్టర్ మానివేయడం తో … కొత్తగా వచ్చాడు మా వెంకట్రావు మాస్టర్… 

కొంచెం పొట్టిగా  అప్పుడప్పుడే వస్తున్న బట్టతలతో  ఇస్త్రీ చేసిన షర్ట్, ప్యాంటూ  జేబులో ఒక పెన్ను … జేబు పైన చిన్న సుత్తి కొడవలి బ్యాడ్జి..

చేతిలో...గుండ్రంగా గొట్టంలా చుట్టేసిన ఒక తెలుగు పుస్తకం…(అది ఎప్పుడూ మా తరగతికి సంబంధించిన పుస్తకం అయితే కాదు …)

ఆయనది అదే ఆహార్యం, నా 10 వ తరగతి చదువు అయిపోయేంత వరకు… 

వెంకట్రావు మాస్టర్ …మిగతా అందరి మాస్టర్స్ లాగ కాదు… టెక్స్ట్ బుక్  లో ఉన్నది ఉన్నట్టు బిగ్గరగా చదువుకుంటూ పోయే రకం అసలే కాదు ...ఎప్పుడు క్లాసుకి వచ్చినా మా దగ్గరే టెక్స్ట్ బుక్ తీసుకుని ... ఇండెక్స్ పేజీ చూసుకుని… ఆ రోజేం చెప్పాలో ఆ పాఠం మొదలుపెట్టేవాడు. 

అది కూడా బ్లాక్ బోర్డు దగ్గర చెప్పేవాడు కాదు ...తన కూర్చిని తరగతి మధ్యలోకి తీసుకొచ్చి కూర్చుని…మా అందరిని తన చుట్టూ గుమికూడేలా చేసి … పాఠం మొదలు పెట్టే వాడు..

తన కున్న ఒక అలవాటు… రెండు చేతులు పిడికిలి బిగించి చూపుడు వేలు మధ్య వేళ్ళని మాత్రమే తెరిచి(పిస్తోలు ని తలపించేటట్లు) …హావభావాలతో చేతులు ఊపుతూ పాఠం చెప్పడం.. 

అది పాఠం లా చెప్పకుండా …ఒక కథలా చెప్పేవాడు … 

అలా చెప్పిన వాటిలో చాలా ఉన్నాయి… హరప్పా జీవనం, గుప్తుల రాజ్యం, ఢిల్లీ సుల్తానులు, శ్రీ కృష్ణ దేవరాయలి వైభోగం, భారతదేశ స్వాతంత్ర్య సమరం, పారిశ్రామిక విప్లవం, ఇంగ్లీష్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, మొదటి ప్రపంచ యుద్ధం...వగైరా వగైరా 

ఆ మొదటి ప్రపంచ యుద్ధం పాఠం చెప్పిన విధానం...ఇప్పటికి పాతిక ఏండ్లు అయినా...ఇప్పటికి గుర్తుంది నాకు…

సిలబస్ లో ఉన్న పాఠాలే కాక...చరిత్రలో జరిగిన ఎన్నో విషయాలని , కథలని  పిట్టకథలు గా చెప్పేవాడు … 

అలా వెంకట్రావు మాస్టర్..వచ్చినప్పటి నుండి.. సోషల్ క్లాస్ అంటే అందులోను హిస్టరీ పాఠం అంటే, ఒక సినిమా చూసే దానికన్నా ఎక్కువ  ఉత్సాహం ఇచ్చేవి…

కొన్ని రోజులు గడిచాక…

మా ఇల్లు కొత్తగా కట్టబడుతున్న చోటికి ఒక నాలుగిళ్లు అవతలి  వెంకట్రావు మాస్టర్ కుటుంబం అద్దెకి ఉంటున్నారు అని తెలిసింది… 

కొత్తగా కట్టే మా ఇంటి సిమెంట్ స్తంబాలకి రోజు నీళ్లు పట్టడం, అలాగే ఇంటి ముందు పోసిన ఇసుకా ఇటుక ని కూడా చెల్లాచెదురు కానివ్వకుండా వాటి పైన పాత బస్తాలు పరచడం నా పని...

ఒక రోజు… మా కొత్తగా కట్టే ఇంటి సిమెంట్ స్తంబాలకి నీళ్లు పడుతుండగా,  ఇద్దరు పిల్లలు అన్నాచెల్లెళ్ళు  ఇంటి ముందు పోసిఉన్న ఇసుకలో ఆడుతున్నారు … 

వాళ్ల వయస్సు ఆరు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు… 

ముందు..ఇసుకలో ఆడవద్దని మందలించాను...తర్వాతా వాళ్ళ వివరాలు అడిగితే అప్పుడు తెలిసింది వాళ్ళు వెంకట్రావు మాస్టర్ పిల్లలని…

మాస్టారు పైన ఉన్న అభిమానం తో ఆ రోజు నుంచి వాళ్ళని పెద్దగా ఏమి అనకుండా ఆడుకోమని అనేవాడిని…

ఒక రోజు ఎర్రటి ఎండ మిట్ట మధ్యాహ్నం లో ఆ పిల్లలు ఆడుకోవడం చూసాను … 

దెగ్గరికి వెళ్ళి … “ఇంత ఎండలో ఆటలేంట్రా...ఇంటికి వెళ్ళండి”...అని మందలించాను…

దానికి ఆ పిల్లలు, “నాన్న పిన్నీ గొడవ పడుతున్నారు...ఇంటికి కాసపే ఆగి వెళతాం..” అని చెప్పారు… 

“పిన్నీ …?” … మరి “మీ అమ్మ …?” అని అడిగాను… 

“మా అమ్మ చనిపోయింది…మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు…” అని బదులిచ్చారు ఆ పిల్లలు… 

“ఏమైనా తిన్నారా …?” అని అడిగాను … 

దానికి లేదు అన్నట్టు తల ఊపారు… 

పక్కన ఉన్న షాప్ లో రెండు biscuit ప్యాకెట్ల కొనిచ్చి నా దారిన నేను వెళ్ళిపోయాను...ఆ వయస్సులో అంతకన్నా నేను చేయగలిగింది ఏమీ లేక… 

కొన్ని నెలలు గడిచాక 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి, వెంకట్రావు మాస్టర్ కి గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా జాబ్ వచ్చి ఆయన మేము ఉన్న వీది నుండి  వెళ్ళిపోయాడు... 

మాస్టారు చెప్పిన విధానం తో హిస్టరీ సబ్జెక్టు పైన మోజు పెరిగి ఇంటర్ లో HEC గ్రూప్ లో జాయిన్ అవ్వాలని అనుకున్నా, కానీ నా ఇంట్లోవాళ్ళ ప్రోద్బలంతో MPC తీసుకుని పక్క ఊరు పారాయణ కాలేజీ లో జాయిన్ అయ్యాను … 

మరికొన్ని నెలలు గడిచాక ఒక రోజు…పారాయణ నుంచి సెలవులకి ఇంటికి వెళితే... నా 10వ  తరగతి స్నేహితుడు కనిపించి చెప్పాడు … 

వెంకట్రావు మాస్టర్ ఉరి వేసుకుని చనిపోయాడు అని…వాళ్ళ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయారని…

మొదట నమ్మలేదు, తర్వాత అది నిజం అని తెలుసుకున్నా. 

అప్పట్లో దూబగుంట సారాఉద్యమం లాంటి సాంఘీక ఉద్యమాల్లో మాతో ర్యాలీ జరిపించిన వ్యక్తి… 

స్వేచ్ఛ స్వాతంత్రం అని ఎన్నో చరిత్ర పాటలు చెప్పిన వ్యక్తి… 

ఎంతో మానసిక చైతన్యం ఉన్న వ్యక్తి…

మాకున్న టీచర్స్ అందరిలో ఓక హీరో లా ఉన్న వ్యక్తి … 

ఇలా చనిపోవడం నాకు ఆ చిన్న వయస్సులోనే ఎంతో భాద అనిపించింది … 

ఇప్పటికి పాతిక సంవత్సరాల తర్వాత కూడా ... నీకు నచ్చిన టీచర్ ఎవరూ అని నన్ను అడిగితే, నాకు ఠక్కున గుర్తు వచ్చే వ్యక్తి వెంకట్రావు మాస్టర్… ఎందరో పిల్లలకి చదువు చెప్పి వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచిన గురువు...అలా కుటుంబంలో అశాంతి తో  చనిపోవడం మనస్సుని కదిలించివేసింది... 

ఆ రోజు చివరిసారిగా మా హిస్టరీ మాస్టర్ వెంకట్రావు చెప్పిన చివరి పాఠం…ప్రతి మనిషికి బలాలు ఉన్నట్టే బలహీనతలు ఉంటాయి అని…మనకెంత జ్ఞానం, సంపద ఉన్నా...మనఃశాంతి కంటే ఏది ముఖ్యం కాదు అని… 
 
--- సమాప్తం ---

  • Like 1
  • Upvote 1
Link to comment
Share on other sites

47 minutes ago, dasari4kntr said:

Super bro

జేబు పైన చిన్న సుత్తి కొడవలి బ్యాడ్జి..

idhi vunte communist anukuntaru kada… adi story lo ekkada value add avvadam ledu kooda.. just my 2 cents 

Link to comment
Share on other sites

48 minutes ago, dasari4kntr said:

na telugu nipunyananiki chadavadaniki help tho koncham time pattindhi,

this is just ok can be better in many ways 

EENADU is right story ok kani mari eenadu range kadhu, I dont want put cream on my review. Hope this helps to cut some lot of unncessary stuff and sudden u turns in the story.

  • Thanks 1
Link to comment
Share on other sites

42 minutes ago, LadiesTailor said:

Super bro

జేబు పైన చిన్న సుత్తి కొడవలి బ్యాడ్జి..

idhi vunte communist anukuntaru kada… adi story lo ekkada value add avvadam ledu kooda.. just my 2 cents 

He is communist in real life..

last lo doobagunta saara vudyamam lines vunnayi…

  • Upvote 1
Link to comment
Share on other sites

24 minutes ago, TOM_BHAYYA said:

Inthaki endhuku masteru athmahatya chesukunnadu ankul?

23 minutes ago, Picheshwar said:

ee story prachuriste part 2 lo reveal chestam

Second marriage…always fighting…second wife didnt care first wife kids…

దెగ్గరికి వెళ్ళి … “ఇంత ఎండలో ఆటలేంట్రా...ఇంటికి వెళ్ళండి”...అని మందలించాను…

దానికి ఆ పిల్లలు, “నాన్న పిన్నీ గొడవ పడుతున్నారు...ఇంటికి కాసపే ఆగి వెళతాం..” అని చెప్పారు… 

“పిన్నీ …?” … మరి “మీ అమ్మ …?” అని అడిగాను… 

“మా అమ్మ చనిపోయింది…మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు…” అని బదులిచ్చారు ఆ పిల్లలు… 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...