Jump to content

Daarunam papam


coffee

Recommended Posts

 News: తలవాకిట తలవాల్చిన తల్లి

అయినవాళ్లు లేక గడప మీదే శవం  
రెండ్రోజులకు గుర్తించిన స్థానికులు

TS News: తలవాకిట తలవాల్చిన తల్లి

గుర్రంపోడు, న్యూస్‌టుడే: అయినవాళ్లు అందరూ ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ అంగన్‌వాడీ టీచర్‌ చనిపోయి రెండ్రోజులైనా ఎవరూ గుర్తించని దయనీయ ఉదంతమిది. మృతదేహం చుట్టూ చీమలు పట్టిన హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాశంవారిగూడెం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. ఈ గ్రామానికి చెందిన పాశం రాజేశ్వరి(60).. భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా రెండేళ్ల క్రితం కొడుకు చనిపోయాడు. దీంతో పిల్లలతో కలిసి కోడలు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆడపిల్లలు పెళ్లిళ్లయి అత్తారిళ్లలో ఉంటున్నారు. రాజేశ్వరి ఒక్కరే గ్రామంలో ఉంటూ అంగన్‌వాడీ టీచరుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం స్థానికులతో మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత కనిపించలేదు. క్రిస్మస్‌ సెలవులు రావడం, ఆమె ఇల్లు కాలనీలో చివరన ఉండడంతో ఎవరూ అటువైపు తొంగిచూడలేదు. 50 గడపలు మాత్రమే ఉండే ఆ ఊళ్లో చాలామంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామం దాదాపుగా నిర్మానుష్యంగానే ఉండడంతో ఆమె గురించి ఆరా తీసేవారే లేకపోయారు. ఏ క్షణాన ఉప్పెనలా గుండెపోటు వచ్చిందో కానీ వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇంటి గుమ్మం మీదనే కుప్పకూలి చనిపోయింది. ఆదివారం ఉదయం అటు వెళ్లిన ఓ అబ్బాయి రాజేశ్వరి ఇంటి గడప మీద పడిపోయి ఉండడాన్ని గమనించి స్థానికులకు చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి నిర్జీవంగా పడి ఉన్న ఆమె చుట్టూ చీమలు పట్టి ఉన్నాయి. రెండు రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఆమె చనిపోయిన తీరును చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె గ్రామానికి చేసిన సేవలు గుర్తుచేసుకుని ఇలా దిక్కులేకుండా మృతిచెందడం బాధాకరమని వాపోయారు.

  • Sad 3
Link to comment
Share on other sites

49 minutes ago, Midnightsun said:

then blame planet earth.

david attenborough : humans are scum on this planet

What about daugters who never called in 2 days that too holidays time 🤦‍♂️

Link to comment
Share on other sites

1 minute ago, Murari_Murari said:

What about daugters who never called in 2 days that too holidays time 🤦‍♂️

Its hard to make a legal law between daughters/sons and parents relationship.

Make a contract that says daughters/sons should take care of old parents

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...