Jump to content

వర్తమానంలో బతుకుతూ గతం నుంచి మంచి చెడూ నేర్చుకొంటూ భవిష్యత్తుని మరింత మెరుగ్గా మలుచుకోగలనని నమ్మకంతో బతకటమే మనిషి జీవితం


JackSeal

Recommended Posts

వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా జీవితం లేదు. భవిష్యత్తులో ఎప్పుడూ బతకలేము. గతంలో బతక్కూడదు.

నేడు దేశం గతంలో బతుకుతుంది..బలవంతంగా గతంలోకి నెట్టేయబడుతుంది. గత కొన్నేళ్లుగా దేశంలో ఒక సర్కస్ మొదలైంది. అన్నేళ్ళ క్రితం అలా జరిగింది కాబట్టి ఇప్పుడు అలానే జరగాలి అంటూ చేసే ప్రతి అడ్డమైన పనికి సనాతన ధర్మం అనో, మత రక్షణ అనో, మరొకటో అప్పటికప్పుడు ఆ సర్కస్ కి పేరు పెడుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గత 14 రోజులుగా హైదరాబాద్ లో జరిగిన సర్కస్. ఈసారి దాని పేరు సమానత్వం. వెయ్యేళ్ల క్రితమే సమానత్వం బోధించిన ఒకాయన పేరుతో వందల కోట్లతో బంగారపు విగ్రహం చేపించారు. ఆ రాయికి రోజూ పూజలు, యజ్ఞాలు, యాగాలు!!

రోజూ సమానత్వం మీద లెక్చర్లు. ఇస్తున్నది ఎవరూ...సరిగ్గా నెల క్రితం మనిషి కోడిని తింటే కోడి బుద్ధులు, మేకను తింటే మేక బుద్ధులు, పందిని తింటే పంది బుద్ధులు వస్తాయని ప్రవచనాలు పలికిన ఒక బాబా!

ఇక ఆ విగ్రహం తయారయింది ఎక్కడ..ప్రతి రోజూ మన భూమి మీద అంగుళం అంగుళం చొచ్చుకు వస్తూ, మన చుట్టుపక్కల దేశాలన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకొని ఇండియాని దిగ్బంధనం చేస్తున్న చైనాలో. Make In India ఏమై పోయిందో!

ఇక అక్కడ సమానత్వం గురుంచి వల్లె వేసేది... స్కూలు పిల్లలు వేసుకునే బట్టల పేరుతో చిన్న వయసులోనే వారి మెదళ్ళలో విషం నింపుతూ ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకునే స్ధాయికి తెచ్చిన నాయకులు!

ఒకరి స్వేచ్ఛకు మరొకరు భంగం వాటిల్లనంత వరకూ, ఒక మనిషి మరో మనిషికి అపకారం చెయ్యకుండా తన బతుకు తాను బతుకుతున్నంత వరకూ సాటి మనిషి ఏమి తింటే మనకెందుకు, ఏమి వేసుకుంటే మనకెందుకు అనే కనీస ఇంగితజ్ఞానం లేని మనుషులు సమానత్వం పేరుతో ఎత్తైన రాతి విగ్రహాలు పెట్టి, మళ్ళీ ఈ సమాజాన్ని రాతియుగంలోకి తీసుకెళ్లే ప్రయత్నం. తాను చదువుతున్న స్కూలులో తన తోటి విద్యార్థి వేరే దుస్తులు వేసుకొస్తేనే సహించలేని విద్యార్థులను, తాను బతుకుతున్న సమాజంలో తోటి మనిషి వేరే ఆహారం తింటే సహించలేని పౌరులను తయారు చేస్తూ దానికి ఆ రామానుజుల్ని అడ్డం పెట్టుకొని ఆడుతున్న ఒక గొప్ప సర్కస్.

పొరపాటున కూడా సైన్స్ మ్యూజియంలు, జూలు, స్టేడియం లు, పార్కులు, math వంటి వాటి మీద శ్రద్ద పెట్టకండి. దేశం చుట్టూ రాతి గోడలు కట్టండి. గోడకు అటుపక్క ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియనివ్వకండి. పెట్టండి.. పెట్టండి..రాతి విగ్రహాలు. ఇంకా చాలా మంది ఉన్నారు, వెయ్యేళ్ల క్రితం, కొన్ని వేల ఏళ్ల క్రితం. తీసుకెళ్లండి.. తీసుకెళ్లండి.. భారతీయుల్ని రాతియుగంలోకి, వెయ్యేళ్ల క్రితంలోకి, కొన్ని వేల ఏళ్ల క్రితంలోకి!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...