Jump to content

Jagan anna ni nammukunte aduku tinatame


psycopk

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌పై ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనం.. ఉచితాలకు కోత పెట్టకుంటే శ్రీలంక పరిస్థితేనని హెచ్చరిక! 

19-04-2022 Tue 07:38
  • కరోనా కంటే రెండేళ్ల ముందు నుంచే దిగజారిన పరిస్థితులు
  • మేలుకోకుంటే మరింత దారుణ పరిస్థితులు
  • సొంత ఆదాయం తగ్గిపోవడంతో అప్పులపైనే బతుకీడుస్తున్నాయి
  • మిగతా రాష్ట్రాల కంటే పంజాబ్ పరిస్థితి మరింత దారుణం
  • ఏపీ సంక్షోభం అంచున ఉందన్న మాజీ సీఎస్ ఎల్వీ ప్రసాద్
Why Punjab Bihar Rajasthan Andhra UP must learn from Sri Lanka

ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో అప్పుల కుప్పలు పెరిగిపోయి దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రముఖ మీడియా హౌస్ ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికైనా మేలుకోవాలని, లేదంటే పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రాసుకొచ్చింది. నిజానికి కరోనా కంటే రెండేళ్ల ముందు నుంచే అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారడం మొదలైందని పేర్కొంది. 

తమ సొంత ఆదాయం తగ్గిపోవడంతో రాష్ట్రాలు అప్పులపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ సెంటర్ డిస్కం ఎస్యూరెన్స్ యోజన కూడా ఈ పరిస్థితులకు మరో కారణమని వివరించింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని ఇతర అంశాలు కూడా వాటి ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణమయ్యాయని తెలిపింది. నిజానికి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కంటే వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదలే ఎక్కువగా ఉందని ‘కాగ్’ నివేదికలు కూడా చెబుతున్నాయి. ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాలు వాటిని తీర్చలేకపోతున్నాయని తెలిపింది. 

ఇటీవల ఎన్నికలు జరిగిన పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రకటించారని, ప్రస్తుత అప్పులకు అవికూడా తోడైతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని పేర్కొంది. పంజాబ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందని, గత నాలుగేళ్లలో పంజాబ్ రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల రేటు 9 శాతంగా ఉంటే వడ్డీ చెల్లింపు రేటు 3 శాతం పెరిగిందని, జీఎస్‌డీపీలో 53 శాతం అప్పులు చేసిన పంజాబ్ పరిస్థితి దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే దారుణంగా ఉందని రాసుకొచ్చింది. 

యూపీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంటే, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అప్పులు మరీ దారుణంగా ఉన్నాయి. ఏపీలో 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పు రూ. 3.89 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ. 40 వేల కోట్లు ఎక్కువ. ఏపీ జీఎస్‌డీపీలో అప్పు 32.4 శాతానికి చేరుకుంది. ఏపీకి ఉన్న మొత్తం చెల్లింపుల భారం రూ.7.76 లక్షల కోట్లు కూడా లెక్కల్లోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో మన భారాల వాటా 76 శాతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ లెక్కన చూసుకుంటే పంజాబ్ కంటే ఏపీలోనే పరిస్థితులు దారుణంగా ఉన్నట్టు స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులపై కనుక కేంద్రం ఆంక్షలు విధిస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకమైంది. అలాగే, మూడు సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు. కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, ప్రభుత్వ ఉద్యోగులకూ పెద్ద మొత్తంలో బకాయిలు పడింది. అయితే, ఈ భారం ఎంత అనే విషయంలో స్పష్టమైన లెక్కలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక, ఏపీ ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సంక్షోభం అంచున ఉందని పేర్కొన్నారు. మరోవైపు, ఆర్థిక నిపుణులు కూడా ఏపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ది ప్రింట్’ తన కథనంలో అధికారిక లెక్కలనే పరిగణనలోకి తీసుకుందని, నిజానికి రాష్ట్రంలో అంతకుమించిన దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

కరోనా కంటే రెండేళ్ల ముందు నుంచే దిగజారిన పరిస్థితులు

Jayaho CBN..! 
 

Daridraniki punadi raayi vesina visionary ani chepochu

Link to comment
Share on other sites

1 hour ago, Lovecrusader said:

 

K.L.N Prasadకు సంబంధించిన ఆంధ్రజ్యోతి పత్రికను అతను చనిపోయాక.... కాంగ్రెస్స్ కు అనుకూలంగా ఒక్క పత్రిక కూడా లేదని ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకోలని కాంగ్రెస్స్ పెద్దలు ప్రయత్నిస్తుండగా...... అక్కడే బ్రోకర్ పని చేసే బాధకృష్ణ (అంతకు ముందు నుండే K.L.N. ప్రసాద్ కు బుతుకిట్టు ఆర్థికంగా నష్టాలు వచ్చేలా కిట్టు లూప్ హోల్స్ క్రియేట్ చేశాడు ) చంద్రంతాతకు రామోజీరావుకు అసలు విషయం చేరవేశాడు.

 

దాంతో "మనది కానీ టీడీపి పార్టీకి, మన పేపర్ కు మరో పేపర్ opposit గా ఉండటం ముప్పు" అని గ్రహించి ముందుగా K.L.N. ప్రసాద్ యెక్క పిల్లల ఆర్థిక మూలాలను, బంధుల ఆస్తులను చంద్రంతాత, రామోజీరావు కుట్రలతో దెబ్బ కొట్టి, రెండో పేపర్ కూడా 'వారిది కానీ టీడీపి పార్టీకే' అనుకూలంగా ఉండాలని అక్కడే బ్రోకర్ గా ఉండే బాధకృషను ఎడిటర్ చేశారు.

 

4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలుగా జర్నలిజం జర్నలిజంగా కాకుండా యెల్లో మీడియాగా ఎల్లో జర్నలిజంగా మారడం వల్లనే, ఉదయం వార్త లాంటి ఎన్నో మీడియాను తమకు అనుకూలంగా లేకపోవడంతో తొక్కేయడం వల్ల సాక్షి అనే మీడియా పుట్టింది.

 

ఒకప్పుడు చంద్రం తాత అతని మీడియా వల్ల ఇతర పేపర్లు నడపలేక సాయత్రం పేపర్లు అని వచ్చేవి. వాటిని కూడా తొక్కేయడంతో.... చంద్రం తాత టైంలో అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్ దగ్గర నుండి కర పత్రాలు కొన్ని బుక్స్ వచ్చేవి.

 

జయలలిత గారు Jaya TV, కరుణానిధి కలుమొని TV అని ఓపెన్ గా పార్టీ ఛానల్ గా చెప్పి మీడియా run చేసుకుంటున్నారు. అలాగే సాక్షి TV కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో వేసుకొని న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారు. కానీ Yellow Media ETV, point.5Tv BAN Tv మాత్రం చాలా సంవత్సరాలుగా న్యూట్రల్ ముసుగులో జనాలను మోసం చేస్తూ న్యూస్ చేస్తున్నారు.

 

చివరిగా....

 

యెల్లో మీడియా పుట్టిన తరువాతే బ్లూ మీడియా పుట్టింది. మీడియా మీడియా గా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చింది కాదు.

 

గతంలో మన ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తలు కొన్ని examples మాత్రమే:

 

NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని,

 

NTR టాంక్ బండ్ పై ఉన్న తెలుగువారి విగ్రహాలను తొలగిస్తున్నారు తద్వారా తెలుగుభాషను నాశనం చేస్తున్నాడని,

 

రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని,

 

లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో "కిచెన్ కేబినెట్" నడుస్తోందని,

 

పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని,

 

త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని,

 

NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని,

 

హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని ఇష్టం లేదని,

 

రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పుతోందని ఇప్పటికే రాష్ట్రం బీహార్ లా మారుతోందని.

 

రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని..........,

ఇలాంటి న్యూస్ కొన్ని నెలలు సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి.

 

NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.

Note: అందుకే బాలకృష్ణ భయపడి చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు సరెండర్ అయ్యాడు.!..

Corona kanna 2 years mundu unnadi mana munda ne taata.. santam nakesaru ga pacha cartel.. bramavathi peru chepi sand ani neru chettu ani janmabhoomi commity lu ani call money sex racquet ani abbo naa bootho naa bhavishyat 5 years 

Link to comment
Share on other sites

30 minutes ago, Vaampire said:

I am surprised. How did eenadu editor missed cutting first bullet point. Generally they dont miss.

Eenadu editor sare.. maree eyanu chudu..heading chadivi kaneesam content ni kuda chudakunda post vesaadu chudu..

Link to comment
Share on other sites

7 minutes ago, megadheera said:

Eenadu editor sare.. maree eyanu chudu..heading chadivi kaneesam content ni kuda chudakunda post vesaadu chudu..

Yaa.. 

 

actually eenadu did a big favor to me. Ee db lo enno sarlu cheppa. Both cbn & jagga are m *** assssholes who screwed up big time ani. This article proved the same. Offcourse accidentally 

Link to comment
Share on other sites

32 minutes ago, Vaampire said:

Yaa.. 

 

actually eenadu did a big favor to me. Ee db lo enno sarlu cheppa. Both cbn & jagga are m *** assssholes who screwed up big time ani. This article proved the same. Offcourse accidentally 

is it bcoz cbn gave freebies?

Link to comment
Share on other sites

54 minutes ago, kdapparao said:

Corona kanna 2 years mundu unnadi mana munda ne taata.. santam nakesaru ga pacha cartel.. bramavathi peru chepi sand ani neru chettu ani janmabhoomi commity lu ani call money sex racquet ani abbo naa bootho naa bhavishyat 5 years 

Vachinavara munda? Mari aa munda lk gaadu atla chesadane theesi denginaru.. ee jagga munda kallu denginaya malli enduku janala panchipeduthundu chuthiya hallelujah gaadu? Blue media aapeyyu koncham choodatam

Link to comment
Share on other sites

17 minutes ago, futureofandhra said:

is it bcoz cbn gave freebies?

Adhi nuvvey cheppali. Ap financial gaa M kudavadam 2018 loney start ayindi ani ee article lo undi. Nee drustilo cbn baaga develop chesadu kada. How did it happen then?

Link to comment
Share on other sites

29 minutes ago, Vaampire said:

Adhi nuvvey cheppali. Ap financial gaa M kudavadam 2018 loney start ayindi ani ee article lo undi. Nee drustilo cbn baaga develop chesadu kada. How did it happen then?

he did give freebies at the same ttime he did development too

he did not do destruction 

thats the diff betwen jaggad n cbn 

public voted to jaggad to correct cbn mistakes instead he is disaster

  • Haha 2
Link to comment
Share on other sites

30 minutes ago, futureofandhra said:

he did give freebies at the same ttime he did development too

he did not do destruction 

thats the diff betwen jaggad n cbn 

public voted to jaggad to correct cbn mistakes instead he is disaster

As per ur logic  if Jagan win next election....Jagan chesindi correct annate kada nee point.:)

Lekha malla evm tamperring....dabbulu petti votelu konnaru antaava...

CBN malla CM avvadam kalla....he did most destruction ever by saying he will build the capital from scratch which given golden chance to hyd to grow..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...