Jump to content

Swathi Muthyam Trailer out


Telugumoviereviews

Recommended Posts

Swathimuthyam-trailer-out.webp

గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'స్వాతి ముత్యం'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో చిత్ర ట్రైలర్ విడుదల వేడుక జరిగింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

"నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు" అంటూ వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో అలా సరదాగా సాగిపోతుండగా వారికి ఊహించని సమస్య వస్తుంది. కాసేపట్లో పెళ్లి.. ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి?, దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Swathi mutyam movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...