Jump to content

సారొస్తున్నారంటే అంతే! అరే నువ్వు తాడేపల్లిలో నే కూర్చో నెలకి ఒకసారి నువ్వు వచ్చుడు, ఉన్న రోడ్లు, చెట్లు నాశనం చేసుడు.


southyx

Recommended Posts

సారొస్తున్నారంటే అంతే!

నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రి ముందు ఎన్నో ఏళ్లుగా నీడనిస్తున్న చెట్టును పురపాలక సిబ్బంది నరికేసిన ఆనవాలు ఇది. ఈ చెట్టు రోడ్డుకు దూరంగా ఉంది.

Updated : 21 Nov 2022 03:23 IST
 
 
 
 
 
 

ముఖ్యమంత్రి పర్యటనకు నరసాపురంలో ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత
రహదారుల పొడవునా బారికేడ్లు
దుకాణాలను మూసివేయాలని అధికారుల ఆదేశాలు


201122ap-main3a.jpg

నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రి ముందు ఎన్నో ఏళ్లుగా నీడనిస్తున్న చెట్టును పురపాలక సిబ్బంది నరికేసిన ఆనవాలు ఇది. ఈ చెట్టు రోడ్డుకు దూరంగా ఉంది. ఇక్కడ విద్యుత్తు తీగలూ లేవు. అయినా నరికేశారు. సీఎం ప్రాంతీయ ఆసుపత్రిలో కొత్త భవనాన్ని అక్కడికి వెళ్లి కాకుండా మరెక్కడో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచే బటన్‌ నొక్కి ప్రారంభిస్తారు. కానీ కాన్వాయ్‌లో వెళ్తూ ఆసుపత్రిని చూడటానికి అడ్డుగా ఉంటుందని అధికారులు ఈ చెట్టు కొట్టేయించారు. ఆసుపత్రికి వచ్చే వారికి నీడ లేకుండా చేశారు.


ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాల అడ్డగింతలు, అనవసర నియంత్రణలు షరా మామూలైపోయాయి. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అవసరం ఉన్నా.. లేకున్నా పట్టణ పరిధిలోని చెట్లను నరికేశారు. అడిగితే అవి విద్యుత్తు తీగలకు, సీఎం కాన్వాయ్‌కు అడ్డుగా ఉన్నాయని అందుకే తొలగించామని చెబుతున్నారు. నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో నూతన భవనాలు, ఆర్టీసీ బస్టాండు ప్రారంభోత్సవాలు.. ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌ శంకుస్థాపనలను సీఎం సభా ప్రాంగణం నుంచే చేస్తారు. అయినా పెద్ద ఎత్తున కూలీల్ని పెట్టి హెలిప్యాడ్‌ మొదలు ప్రయాణ ప్రాంగణం వరకూ దారి పొడవునా భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే సమాధానం లేదు. నరసాపురం పట్టణంలోని థామస్‌ వంతెనవైపుగా సీఎం కాన్వాయ్‌ వెళ్లడం లేదు. అయినా అక్కడా చెట్ల కొమ్మలను నరికేశారు. మేదర్ల వంతెన, ట్యాక్సీ స్టాండ్‌ ఏరియాలోనూ పెద్ద ఎత్తున చెట్లు, కొమ్మలను తొలగించారు. సీఎం కాన్వాయ్‌ వచ్చే మార్గంలో డివైడర్‌కు రెండువైపులా ఉన్న చెట్ల కొమ్మలు నరికేసి ఫ్లెక్సీలు పెట్టారు.

201122ap-main3b.jpg

సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఎక్కడ లేని హడావుడి చేస్తున్నారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లోని చికెన్‌ దుకాణాలను బలవంతంగా మూయించారు. నరసాపురంలో దుకాణాలకు ఆదివారం సెలవు. సోమవారం సీఎం వెళ్లేవరకూ దుకాణాలను తెరవకూడదంటూ అధికారులు శనివారమే హుకుం జారీ చేశారు. తోపుడుబళ్ల నుంచి పెద్ద దుకాణాల వరకు అన్నింటినీ సోమవారం బంద్‌ చేయాల్సిందేనని అధికారులు చెప్పారని వ్యాపారులు వాపోతున్నారు.

201122ap-main3c.jpg


ఆక్వా వర్సిటీకి నేడు సీఎం శంకుస్థాపన

ఈనాడు, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలో బయల్దేరి 10.50కి నరసాపురం చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించి, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన, ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని పేర్కొంది.

Link to comment
Share on other sites

38 minutes ago, Pahelwan2 said:

Ee lucha ganlu unna roads nashanam cheyadaniki vastunara. Malli ippudu avi repair ani cheppi paisal thengali ade kada plan

Roads vese valla ki Pani create cheyyadam kooda thappena 

Link to comment
Share on other sites

ఇదేమి ఖర్మ!!
మీటింగ్ కు వచ్చిన ఆడవారి చున్నీలను కూడా తీయించిన బటన్ రెడ్డి..మరీ ఇంత పిరికితనం ఏంటి!! ఇలా చేసిన పోలీసుల మీద కేసులు పెట్టాలి..ఇలాంటి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలి!!
316291325_252542980667806_35671071148626
316675224_252543010667803_64235514399943
316101746_252543037334467_27489818533958
 
Link to comment
Share on other sites

ఎవరూ కనపడకుండా పరదాలు కట్టుకోటం .. పచ్చగా వుంటం చూడలేక చెట్లు నరికించటం .. యువతుల చున్నీలు తీయించటం ..
వీటన్నిటి బదులు .. గుర్రానికి కళ్లకి కట్టినట్టు .. ఇతను కూడా పక్కన ఏమీ కనపడకుండా గంతలు కట్టుకొని టిక్కు టిక్కు అని రావచ్చుగా ?
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...