Jump to content

పొమ్మన్నారు, పోతున్నారు. 9500 కోట్ల పెట్టుబడులు. ~4500 డైరెక్ట్ జాబ్స్


southyx

Recommended Posts

316961396_3294676927512608_1144928436314

 

ఏపీ 9500 కోట్ల పెట్టుబడులు కోల్పోయింది .చిత్తూరు జిల్లా వేల ఉద్యోగాలు కోల్పోయింది. ఈ విషయం మీద రాయలసీమ మేధావుల సంఘాలు కానీ, విద్యార్ధి సంఘాలు కానీ నోరు మెదుపుతాయా?

 

 

 

Link to comment
Share on other sites

పొగబెట్టి పంపేశారు..!

‘అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ పోవడం కాదు.. ప్రభుత్వమే పొమ్మంటోంది’ అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ వేధింపులతో అమరరాజా సంస్థ వేరే రాష్ట్రానికి తరలిపోనుందంటూ వచ్చిన వార్తలపై గతంలో ఆయన స్పందనిది.

Published : 03 Dec 2022 04:49 IST
 
 
 
 
 
 

ప్రభుత్వ వేధింపులతో పక్క రాష్ట్రానికి వెళ్లిన అమరరాజా
తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
ఈనాడు - అమరావతి

021222ap-main1a.jpg

‘అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ పోవడం కాదు.. ప్రభుత్వమే పొమ్మంటోంది’ అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ వేధింపులతో అమరరాజా సంస్థ వేరే రాష్ట్రానికి తరలిపోనుందంటూ వచ్చిన వార్తలపై గతంలో ఆయన స్పందనిది. ‘అమరరాజా తరలిపోయేలా ప్రభుత్వం ఒత్తిడి తేవట్లేదు.. వారే లాభాల కోసం వెళ్లిపోతున్నారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఒక భారీ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటే... దాన్ని ఆపేందుకు ప్రయత్నించాల్సిన కీలక స్థానాల్లోని వ్యక్తుల బాధ్యతారాహిత్యానికి వీరి వ్యాఖ్యలే అద్దం పడతాయి. ఏ పరిశ్రమైనా నిబంధనల ప్రకారం పనిచేసేలా కచ్చితంగా చూడాల్సిందే. లోపాలుంటే సరిదిద్దుకునే అవకాశమిచ్చి, కొనసాగేలా చూడాలే తప్ప బయటకు పంపేయాలని చూడటం ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శనం.

వైకాపా ప్రభుత్వ వేధింపులతో తరలిపోయిన పరిశ్రమల్లో మరొకటి చేరింది. పరిశ్రమలు పెడతామని ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వాలు వారికి ఎర్ర తివాచీలతో స్వాగతం పలుకుతాయి. వారికి ఇవ్వగలిగినన్ని రాయితీలిస్తాయి. కానీ వైకాపా ప్రభుత్వం తీరే వేరు..! కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించడం మాట అటుంచి.. ఉన్నవాటిని కాపాడుకోవడంపైనా శ్రద్ధ పెట్టదీ సర్కారు! పైగా, అవి గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన పరిశ్రమలు గానీ, ప్రత్యర్థి పార్టీకి చెందినవారివి గానీ అయితే... వెంటాడి మరీ వేధిస్తుంది!

ఆంధ్రా పొమ్మంది.. తెలంగాణ రమ్మంది

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌కి చెందిన కంపెనీ అన్న ఏకైక కారణంతో, రాజకీయ కక్ష సాధింపుతో అమరరాజా సంస్థపై జగన్‌ ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు పాల్పడింది. దాంతో ఆ సంస్థ చిత్తూరు జిల్లాలో తమ పరిశ్రమ విస్తరణ ఆలోచనను విరమించుకుంది. ఒక దశలో తమిళనాడుకు తరలించాలని ఆలోచించింది. అమరరాజా సంస్థ విస్తరణ ఆలోచన గురించి తెలిసి... తెలంగాణ ప్రభుత్వం వారికి సాదరస్వాగతం పలికింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడం, పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో అత్యాధునిక లిథియం అయాన్‌ బ్యాటరీల పరిశోధన, తయారీ యూనిట్‌ను తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అమరరాజా ముందుకొచ్చింది. వచ్చే పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దేశంలో బ్యాటరీల తయారీ రంగంలో అమరరాజా ప్రముఖ స్థానంలో ఉంది. అలాంటి సంస్థ ఏకంగా రూ.9,500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటుకు ముందుకొస్తే... వెంటాడి వేధించి తరిమికొట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుంది.

అమరరాజా తరలిపోతే నష్టపోయేదెవరు?

అమరరాజా తరలిపోవడం వల్ల నష్టం ఎవరికి? అమరరాజాకు ఏమీ నష్టం లేదు. ఏ పెట్టుబడిదారైనా... పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన వనరులు, వసతులు, సానుకూలంగా స్పందించే ప్రభుత్వం ఉన్నాయో లేవో చూసుకుంటారు. తెలంగాణ నుంచి పూర్తి సహకారం ఉంది కాబట్టి... వారికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అమరరాజాను తరిమికొట్టేవరకూ నిద్రపోని వైకాపా నాయకులకు, మంత్రులకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమూ లేదు. నష్టపోయిందల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే. వెనుకబడిన రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో గల అమరరాజా ఫ్యాక్టరీల్లో 20వేల మంది ప్రత్యక్షంగా, 50వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆ సంస్థ మరో రూ.9,500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమను అక్కడే ఏర్పాటుచేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఉపాధి దొరికేది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరేది. పలు అనుబంధ పరిశ్రమలూ వచ్చేవి. రాబోయే కాలమంతా లిథియం అయాన్‌ బ్యాటరీలదే. ఆ రంగంలో ఇప్పటికే ముందంజలో ఉన్న అమరరాజా... ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ పరిశ్రమను ఏర్పాటుచేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించేది. తెలంగాణలో ‘అమరరాజా గిగా కారిడార్‌’ను ఏర్పాటుచేస్తామని, దానిలో భాగంగా హైదరాబాద్‌లో దేశంలోనే మొదటి, అత్యాధునిక ఎనర్జీ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

ఆదినుంచి వేధింపులే

గల్లా జయదేవ్‌ తెదేపా ఎంపీ అన్న ఒకే ఒక్క కారణంతో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న అక్కసుతో... ఆయన కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్‌ సంస్థపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపునకు తెగబడింది. ముప్పేట దాడికి పాల్పడింది.

* అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన 253.6 ఎకరాల భూముల్ని 2020 జూన్‌ 30న వెనక్కి తీసేసుకుంది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లోని నూనెగండ్లపల్లి, 108-మహారాజా కొత్తపల్లి గ్రామాల్లో అమరరాజా కంపెనీకి 2009లో 483.27 ఎకరాల్ని ఏపీఐఐసీ కేటాయించింది. భూములు తీసుకుని పదేళ్లు అవుతున్నా ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకురాలేదని, 253.6 ఎకరాల్ని ఖాళీగా ఉంచేసిందని సాకుగా చూపించి, ఆ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని, ఒప్పందంలో పేర్కొన్నదానికంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించామని కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.

* తర్వాత ప్రభుత్వం అమరరాజా బ్యాటరీస్‌పై పడింది. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా అమరరాజా బ్యాటరీ కంపెనీల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని పీసీబీ పేర్కొంది. ఉద్యోగుల రక్తంలోనూ నిర్దేశిత పరిమితికి మంచి సీసం ఉనట్టు పరీక్షల్లో తేలిందని చెప్పింది.

* చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న అమరరాజా బ్యాటరీ తయారీ యూనిట్లు పర్యావరణ అనుమతులు, నిర్వహణ షరతులు ఉల్లంఘించినందున వాటిని మూసేయాలని ఆదేశించింది.

*  2021 మే 1న అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమకు ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వ ఉత్తర్వులపై అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో... కోర్టు స్టే ఇచ్చింది.

* ఆ తర్వాత కూడా తరచూ పీసీబీ తనిఖీల పేరుతో వేధింపులు కొనసాగిస్తోంది.

లోపాలు సరిదిద్దుకునేలా చేయాలే తప్ప తరిమికొట్టడమేంటి?

ఏ పరిశ్రమకైనా భూములు కేటాయించినప్పుడు ఏపీఐఐసీ కొన్ని నిబంధనలు పెడుతుంది. ఆ పరిశ్రమను పీసీబీ నిబంధనల ప్రకారం నడపాలి. పరిశ్రమలు వాటిని పాటించేలా చేయాల్సిన బాధ్యతా ప్రభుత్వంపై ఉంది. కానీ ఆ నిబంధనల సాకుతో కేవలం విపక్షాల వారి పరిశ్రమలపై కక్షసాధింపునకు పాల్పడటం, ఏకంగా వాటిని మూసివేయించాలని చూడటం వల్ల వాటిలో పనిచేస్తున్న వేలమంది కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. పరిశ్రమలో లోపాలుంటే... వాటిని సరిదిద్దుకోవాలని చెప్పి, ఆ పరిశ్రమ అక్కడే కొనసాగేలా చేయాలే తప్ప, రాష్ట్రం నుంచే పంపించేయాలనుకోవడం, పెట్టుబడులు తరలిపోయేలా చేయడం వివేకం కాదు.


తమిళనాడులోనూ పెట్టుబడులు..!

అమరరాజా సంస్థ తెలంగాణతో పాటు, తమిళనాడులోను, ఉత్తర భారతదేశంలోని మరో రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమరరాజా యాజమాన్యాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆహ్వానించారు. చర్చలూ జరిగాయి. ఆ సంస్థ భవిష్యత్తులో తమిళనాడులోనూ పరిశ్రమను ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Link to comment
Share on other sites

తెలంగాణకు అమరరాజా

ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.

Published : 03 Dec 2022 03:44 IST
 
 
 
 
 
 

లిథియం అయాన్‌ బ్యాటరీల గిగా కర్మాగారం, పరిశోధన కేంద్రం ఏర్పాటు
రూ.9,500 కోట్ల పెట్టుబడి.. 4,500 మందికి ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
అన్ని విధాలా అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్‌
తెలంగాణ పెట్టుబడులకు  అనుకూలం: గల్లా జయదేవ్‌

021222gh-main1a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా తెలంగాణలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్‌ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి పారిశ్రామిక పార్కులో రూ.9,500 కోట్ల పెట్టుబడులతో దీనిని స్థాపించి, ప్రత్యక్షంగా 4,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ సంస్థ తరఫున ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) గల్లా జయదేవ్‌, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, అమరరాజా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య గౌరినేనిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామని, రెండేళ్లలో మొదటి దశ పూర్తిచేసి ఉత్పత్తులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌ వెల్లడించారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ విభాగం సంచాలకుడు సుజయ్‌ కారంపురి, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, అమరరాజా విద్యుత్‌ విభాగం అధ్యక్షుడు సముద్రాల విజయానంద్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్తూరు బయట తొలి కర్మాగారమిదే

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గల్లా జయదేవ్‌ మాట్లాడారు. ‘‘ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 37 సంవత్సరాలుగా అమరరాజా పరిశ్రమలు నడుస్తున్నాయి. దాని బయట ఏర్పాటుచేయబోయే మొదటి పరిశ్రమ గిగా కారిడార్‌ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. పెట్టుబడులకు తెలంగాణ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతం. ఈ రాష్ట్రంతో ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. మా కార్పొరేటు కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. ఈ సర్కార్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. గత ఏడాది రూపొందించుకున్న ‘ఎనర్జీ అండ్‌ మొబిలిటీ’ రోడ్‌ మ్యాప్‌నకు అనుగుణంగానే తాజా ముందడుగు వేశాం. ఎనర్జీ అండ్‌ మొబిలిటీలో భవిష్యత్‌ సాంకేతికతల కోసం ఆర్‌అండ్‌డి, ఇంక్యుబేషన్‌, టెస్టింగ్‌, తయారీలతో కూడిన గిగా కారిడార్‌తో పటిష్ఠ భారతీయ పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టమ్‌)ను అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష.

ఇక్కడి యువతకు ఉపాధి

నూతన సాంకేతికతతో ఏర్పాటుకాబోయే బ్యాటరీల తయారీ యూనిట్‌ అందరి ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాం. పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా వెంటనే నిర్మాణ పనులు చేపడతాం. తద్వారా కర్మాగార సమీపంలోని గ్రామీణులతోపాటు రెండు, మూడో తరగతి పట్టణాల్లో వలసలను నివారించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తాం.

ఇతర సంస్థలకూ ఉపయోగకరం

శంషాబాద్‌ వద్ద ఏర్పాటయ్యే సాంకేతిక కేంద్రం మెటీరియల్‌ రీసెర్చ్‌, ప్రొటోటైపింగ్‌, ప్రొడక్ట్‌ లైఫ్‌ సైకిల్‌ అనాలిసిస్‌, ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ డిమాన్‌స్ట్రేషన్‌ కోసం అధునాతన ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులను కలిగిఉంటుంది. విద్యుత్‌, వాహన రంగాల్లోని సంస్థలకు పలు రకాల సదుపాయాలను అందిస్తుంది. ఇప్పటికే అమరరాజా ఇ-హబ్‌ను ఏర్పాటుచేసింది. ఆసక్తి ఉన్న ఇతర సంస్థలతో కలసి ఇది పని చేస్తుంది. గత నెల 3న అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటుచేసి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం.

చిత్తూరులోని పరిశ్రమలు యథాతథం

తెలంగాణలో కొత్త పరిశ్రమ ప్రారంభించినా...ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మా పరిశ్రమలు యథాతథంగా కొనసాగుతాయి. ఏపీతో పారిశ్రామిక అనుబంధం కొనసాగుతుంది. అక్కడ ఉన్న అమరరాజా పరిశ్రమల వద్ద ఎలాంటి కాలుష్య సమస్యల్లేవు. పరిశ్రమలు నిర్వహిస్తున్న స్థలంలోనే ఎప్పటి నుంచో మా కుటుంబం నివసిస్తోంది. అక్కడ కాలుష్యం ఉంటే మా కుటుంబంపైనే ఆ ప్రభావం పడేది. పరిశ్రమల వద్ద కాలుష్య సమస్యలు లేకుండా మేము ముందే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం’’ అని జయదేవ్‌ తెలిపారు.

ఎనిమిదేళ్ల కృషి ఫలించింది: మంత్రి కేటీఆర్‌

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, తమ ఎనిమిదేళ్ల కృషి ఇప్పటికి ఫలించిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన గల్లా జయదేవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అమరరాజాకు గొప్ప చరిత్ర ఉంది. జయదేవ్‌ నాకు సన్నిహితుడు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇక్కడ పరిశ్రమను స్థాపించాలని కోరుతున్నా. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇప్పటికే తెలంగాణ విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం తెచ్చింది. ఈ రంగంలో భారీ పెట్టుబడులను సమీకరిస్తోంది.  ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అభివృద్ధికి, గామీణ ప్రాంత యువతకు ఉపాధికి ఊతమివ్వడంతోపాటు దేశంలో ఈవీ విప్లవానికి నాంది పలుకుతుందని’’ కేటీఆర్‌ అన్నారు.


కేటీఆర్‌ కోరిక మేరకే

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్‌ గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఇప్పటికి ఆ ప్రయత్నం ఫలించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి గిరాకీ ఉంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలను విశ్లేషించాం. ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఒప్పందం అమరరాజాకు కీలక ముందడుగు.


అత్యాధునిక సాంకేతికతతో కర్మాగారం

021222gh-main1b.jpg

తెలంగాణలో నెలకొల్పబోయే పరిశ్రమ 16 జీడబ్ల్యూహెచ్‌ లిథియం సెల్‌, 5 జీడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ యూనిట్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. దానికి అనుబంధంగా ఆధునిక అభివృద్ధి, పరిశోధన కేంద్రం ఉంటుంది. శంషాబాద్‌ వద్ద రూ.800 కోట్లతో సాంకేతిక కేంద్రాన్నీ ఏర్పాటుచేస్తాం. అందులో 800 మందికి ఉపాధి కల్పిస్తాం.

- గల్లా జయదేవ్‌, సీఎండీ, అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌


ఈవీ తయారీ హబ్‌గా రాష్ట్రం

దేశంలోనే తొలి లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని తెలంగాణలో నెలకొల్పడం జయదేవ్‌ దార్శనికతకు నిదర్శనం. ఈ పరిశ్రమ పెట్టుబడుల పరంగానేగాక అత్యాధునిక సెల్‌ సాంకేతికతలోనూ దేశంలో మొదటిది. తెలంగాణ ఈవీ తయారీ హబ్‌గా మారేందుకు అమరరాజా కర్మాగారం దోహద పడుతుంది.

- మంత్రి కేటీఆర్‌


 

 

Link to comment
Share on other sites

11 minutes ago, southyx said:

ఎనిమిదేళ్ల కృషి ఫలించింది: మంత్రి కేటీఆర్‌

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, తమ ఎనిమిదేళ్ల కృషి ఇప్పటికి ఫలించిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన గల్లా జయదేవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘అమరరాజాకు గొప్ప చరిత్ర ఉంది. జయదేవ్‌ నాకు సన్నిహితుడు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇక్కడ పరిశ్రమను స్థాపించాలని కోరుతున్నా. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఇప్పటికే తెలంగాణ విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం తెచ్చింది. ఈ రంగంలో భారీ పెట్టుబడులను సమీకరిస్తోంది.  ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అభివృద్ధికి, గామీణ ప్రాంత యువతకు ఉపాధికి ఊతమివ్వడంతోపాటు దేశంలో ఈవీ విప్లవానికి నాంది పలుకుతుందని’’ కేటీఆర్‌ అన్నారు.


కేటీఆర్‌ కోరిక మేరకే

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్‌ గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఇప్పటికి ఆ ప్రయత్నం ఫలించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి గిరాకీ ఉంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలను విశ్లేషించాం. ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఒప్పందం అమరరాజాకు కీలక ముందడుగు

Adendi...Jaggadu ellakodithe kada TG ki poinam ani pulkeyulu septunte Galla endi inko laaga septunadu ?

Oh my sinthakayala vijay...party cadre ki material ichetapudu kastha verify chesukovali kada...adu oka elimudra gadu, eedu inko elimudra...saripoinaru..!!!

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

Adendi...Jaggadu ellakodithe kada TG ki poinam ani pulkeyulu septunte Galla endi inko laaga septunadu ?

Oh my sinthakayala vijay...party cadre ki material ichetapudu kastha verify chesukovali kada...adu oka elimudra gadu, eedu inko elimudra...saripoinaru..!!!

317465559_448127567488083_33999562972549

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

Adendi...Jaggadu ellakodithe kada TG ki poinam ani pulkeyulu septunte Galla endi inko laaga septunadu ?

Oh my sinthakayala vijay...party cadre ki material ichetapudu kastha verify chesukovali kada...adu oka elimudra gadu, eedu inko elimudra...saripoinaru..!!!

బ్యాటరీలు కంపెనీ నుండి కాలుష్యం వస్తుంది
సిమెంట్ ఫ్యాక్టరీ నుండి ఆక్సిజన్ వస్తుంది
నమ్మండ్రా 😂 పులి చెప్పింది…
Link to comment
Share on other sites

11 hours ago, Android_Halwa said:

Adendi...Jaggadu ellakodithe kada TG ki poinam ani pulkeyulu septunte Galla endi inko laaga septunadu ?

Oh my sinthakayala vijay...party cadre ki material ichetapudu kastha verify chesukovali kada...adu oka elimudra gadu, eedu inko elimudra...saripoinaru..!!!

317988729_448246117476228_50073989119050

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...