Jump to content

సీఎం ఎంతో అనుభవం, ముందుచూపున్న నాయకుడు


All_is_well

Recommended Posts

సర్కారుతో కొట్లాడే ఉద్దేశం లేదు

‘‘కువిమర్శలకు, కోర్టు కేసులకు నేను భయపడేదాన్ని కాదు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు. నా బాధ్యతలు, విధులను సమర్థంగా నిర్వర్తిస్తూ  తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా’’ అని గవర్నర్‌ తమిళిసై చెప్పారు.

సీఎం అనుభవజ్ఞుడైన నేత
ఆయనను చూసి ఎంతో నేర్చుకున్నా
కువిమర్శలకు భయపడను
ప్రొటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు: గవర్నర్‌ తమిళిసై
నాలుగేళ్ల పదవీకాలంపై కాఫీటేబుల్‌ బుక్‌ విడుదల

సర్కారుతో కొట్లాడే ఉద్దేశం లేదు

ఈనాడు, హైదరాబాద్‌ : ‘‘కువిమర్శలకు, కోర్టు కేసులకు నేను భయపడేదాన్ని కాదు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు. నా బాధ్యతలు, విధులను సమర్థంగా నిర్వర్తిస్తూ  తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా’’ అని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. తనకు ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం గానీ.. కొట్లాడాలన్న ఆలోచన గానీ లేదని అన్నారు. గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా తెలంగాణ ప్రజల సేవలో అయిదో ఏడాది ఆరంభం పేరిట శుక్రవారం రాజ్‌భవన్‌లో కాఫీ టేబుల్‌బుక్‌ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఇప్పటి వరకు 15 శాతమే సేవలందించానని, ఇంకా ఎంతో చేయాల్సి ఉన్నా రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులున్నాయని అన్నారు. ‘‘సీఎం కేసీఆర్‌ ఎంతో అనుభవం, ముందుచూపున్న నాయకుడు. నాలుగేళ్లుగా ఆయనను చూసి చాలా నేర్చుకున్నా. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య ఎలాంటి సమన్వయలోపం లేదు. కేసీఆర్‌ ఆహ్వానం మేరకే నేను సచివాలయానికి వెళ్లా’’ అని వివరించారు. ‘‘తెలంగాణలో నేను ప్రజలను కలిస్తే రాజకీయం చేస్తున్నానని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ పుదుచ్చేరిలో ప్రతి నెల 15న ప్రజలను కలుస్తున్నా. అక్కడి అధికారులు అందుకు పూర్తిగా సహకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే రాజకీయ విమర్శలను పట్టించుకోను’’ అని అన్నారు.

బిల్లులపై గుడ్డిగా సంతకాలు చేయలేను

‘‘నేను ప్రభుత్వంతో పోరాడడం లేదు. మా మధ్య అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయి. నా వద్దకు వచ్చిన ఏ బిల్లుపైనా గుడ్డిగా సంతకం చేయలేను. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కొన్ని బిల్లుల్లో లోపాలు ఉన్నందునే వాటిని ప్రభుత్వం వద్దకు పంపించా. ఆర్టీసీ బిల్లు విషయంలోనూ అనవసర రాద్ధాంతం చేశారు. కార్మికుల లబ్ధికోసమే నేను కొన్ని ప్రతిపాదనలు చేశా. అది గురువారం మళ్లీ నావద్దకు వచ్చింది. పరిశీలించి నిర్ణయం తీసుకుంటా. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవుల కోసం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గవర్నర్‌ కోటా రాజకీయ పరమైనది కాదు. సేవ, సాంస్కృతిక తదితర రంగాలకు నిర్దేశించింది. అయితే వారు ఏ కేటగిరీలోకి వస్తారనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో వారి నియామకాన్ని ఆమోదించలేదు. అలాగే కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుండాలి. ప్రధాని వచ్చినప్పుడు సీఎం రాకపోవడం సరైంది కాదు. వైద్య కళాశాలల విషయంలోనూ  కొంత వివాదం ఉంది. కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్రం నిర్ణీత గడువులోగా ఇవ్వలేదు. తెలంగాణ మెడికల్‌ హబ్‌గా పేరొందినా ఈ రంగంలో వెనకబాటు ఉంది. ఉస్మానియా ఆసుపత్రి దీనస్థితే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు ప్రగతిఫలాలు అందడం లేదు. వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్యం మెరుగుపడాలి.

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు తగవు

రాజకీయ లబ్ధికోసం తమిళనాడుకు చెందిన కొందరు నేతలు సనాతన ధర్మాన్ని కించపరిచేలా చేస్తున్న వ్యాఖ్యలు తగవు. ఒక వర్గంపై వివక్ష చూపవద్దు. జమిలి ఎన్నికలను నేను పూర్తిగా సమర్థిస్తాను. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందాలి. దీనిపై అందరూ ఏకాభిప్రాయానికి రావాలి. ఈ అంశంపై కొందరు అకస్మాత్తుగా మాట్లాడుతున్నారు’’ అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. కార్యక్రమంలో పుదుచ్చేరి సీఎస్‌ రాజీవ్‌ వర్మ, గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి సురేంద్రమోహన్‌, సలహాదారులు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతి ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘విద్యలో సామాజిక-ఆర్థిక అసమానతలను పరిష్కరించడం: జాతీయ విద్యా విధానం పాత్ర-2020’పై ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాస రచన పోటీల్లో విజేతలకు ఆమె పురస్కారాలను అందజేశారు.

గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

 

తెలంగాణలోని గిరిజన యువత నైపుణ్యశిక్షణ ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లోని గ్రామీణ సాంకేతిక పార్కును శుక్రవారం ఆమె సందర్శించారు. రాజ్‌భవన్‌ ఆధ్వర్యంలో కాగితం ప్లేట్లు, కప్పుల తయారీపై శిక్షణ పొందుతున్న ఆదిలాబాద్‌, భదాద్రికొత్తగూడెం జిల్లాలకు చెందిన 26 మంది యువకులతో మాట్లాడారు. వచ్చే నెల రెండో తేదీ నాటికి శిక్షణ పూర్తవుతుందని ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...