Jump to content

జగన్‌.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్‌ 


psycopk

Recommended Posts

Chandrababu: జగన్‌.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్‌ 

28-03-2024 Thu 15:04 | Andhra
  • రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీయేకు ఓటు వేయాలన్న చంద్రబాబు
  • రాయలసీమను జగన్ సైకో రాజ్యంగా మార్చారని మండిపాటు
  • సీమలో 49 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఒరగబెట్టిందేముందని ప్రశ్న
 
Can Jagan answers to these 7 questions asks Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈరోజు చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. 

రోడ్ షో సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... 90 శాతం హామీలను నెరవేర్చానని జగన్ చెప్పుకుంటున్నారని... తాను అడిగే ఏడు ప్రశ్నలు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సీపీఎస్  రద్దు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కరెంటు ఛార్జాల తగ్గింపు, పోలవరం పూర్తి తదితర హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాయలసీమను తాము హార్టికల్చర్ హబ్ గా చేశామని... జగన్ వచ్చిన తర్వాత రాజకీయ హత్యలతో సైకో రాజ్యంగా మార్చేశారని దుయ్యబట్టారు. గోదావరి జలాలను రాయలసీమ వరకు తీసుకొచ్చే బాధ్యత తమదని చెప్పారు. రాయలసీమలోని 52 అసెంబ్లీ ఎన్నికల్లో 49 చోట్ల వైసీపీని గెలిపిస్తే... జగన్ ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 

అసమర్థుడు, అవినీతిపరుడైన జగన్ ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమయిందని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని చెప్పారు. రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఇసుకను దోపిడీ చేశారని... భనవ నిర్మాణ కార్మికుల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. మద్య నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని జగన్ చెప్పారని... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుగున్నాడని ప్రశ్నించారు. 

ఎన్నికలకు ముందు ఆత్మబంధువులా ముద్దులు పెట్టి, తలలు నిమిరి ఆస్కార్ లెవెల్లో నటించాడని... అధికారంలోకి వచ్చాక అసలైన రూపాన్ని చూపించాడని విమర్శించారు.

Link to comment
Share on other sites

 

Chandrababu: ఈ రోజు మళ్లీ హామీ ఇస్తున్నా... ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తాం: చంద్రబాబు 

28-03-2024 Thu 16:55 | Andhra
  • కొనసాగుతున్న ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర
  • అనంతపురం జిల్లాలో చంద్రబాబు సభ
  • హామీలను మరోసారి ప్రజలకు వివరించిన చంద్రబాబు
  • ఉత్తుత్తి బటన్ కాదు... నిజమైన బటన్ నొక్కుతానని ఉద్ఘాటన 
 
Chandrababu reiterates poll assurances in Anantapur Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రంలో ఆయన ప్రసంగిస్తూ... సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు. 

అభివృద్ధి చేస్తే సంపద వస్తుందని, అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుందని అన్నారు. అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది, ఇలా వడ్డీ కడుతూ అప్పులు చేస్తూ పోతే సుడిగుండంలో చిక్కుకుని మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయని చంద్రబాబు వివరించారు. 

"మీ అందరికీ ఒకటే చెబుతున్నా. నేను సంపద సృష్టిస్తా. ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతా. నిజమైన బటన్ నొక్కుతా. ఉత్తుత్తి బటన్ కాదు. అందుకే ఈ రోజు చెబుతున్నా... ఆడబిడ్డలూ మీరు గుర్తుపెట్టుకోండి... డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే... జ్ఞాపకం ఉందా తల్లీ మీకు? పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే, వంట గ్యాస్ ఇచ్చింది నేనే, మరుగుదొడ్లు కట్టించింది నేనే, ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్... జ్ఞాపకం ఉందా మీకు? 

ఈ రోజు మళ్లీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తాం. ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే రూ.3 వేలు, ముగ్గురుంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6 వేలు. ఇందులో ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు. మీ ఖాతాలోకి నేరుగా పంపిస్తా. నేనే ఫోన్ చేసి చెబుతాను మీకు. 

ఇక రెండో పథకం తల్లికి వందనం. బిడ్డలు తల్లిదండ్రులకు రుణపడి ఉంటారు. తండ్రి కంటే  తల్లికి ఎక్కువ రుణపడి ఉంటారు. నవమాసాలు మోసి కని పెంచేది తల్లి. తాను కడుపు మాడ్చుకుని అయినా బిడ్డ కోసం పాటుపడేది తల్లి. అందుకే తల్లికి వందనం పథకం కింద ఒక బిడ్డ ఉంటే రూ.15,000. ఇద్దరు బిడ్డలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు. ఇచ్చే బాధ్యత మాది. 

ఈ రోజు నేను ఆలోచించేది ఒకటే... ప్రజలే ఆస్తి. ప్రజలను సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రపంచంలో ఎక్కువగా సంపాదించే జాతి ఏదంటే... భారతీయులు. అందులో 30 శాతం మంది తెలుగువారే. అదే నాకు గర్వకారణం. అదే నేను వేసిన పునాది. దీపం పథకం తీసుకువచ్చింది నేనే. కానీ దుర్మార్గులు దీపం ఆర్పేశారు. మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపం వెలిగిస్తా. 

ఆర్టీసీ ఎర్ర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రైతును రాజును చేయడం నా ధ్యేయం. రైతులకు నీళ్లు ఇస్తే కాసుల వర్షం కురిపిస్తారు. గతంలో నేనిచ్చిన నీళ్లు, డ్రిప్ ఇరిగేషన్ ను ఉపయోగించుకున్న రైతులు మాకు మూడు కోట్లు, నాలుగు కోట్లు వచ్చాయని చెబుతుంటే నాకు కళ్లు తిరిగాయి. మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకువస్తాం. ప్రతి ఒక్క రైతుకు రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తాం. 

యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తాం. యువత ఆశలను ప్రోత్సహిస్తాం. ఏడాదికి 4 లక్షల చొప్పున యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు నేనిస్తాను. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి... తద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. డీఎస్సీ నిర్వహిస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకు రూ.3 వేల భృతి కూడా ఇస్తాం. 

ఇంటింటికీ సురక్షిత తాగు నీరు కల్పిస్తాం. బీసీ రక్షణ చట్టం తీసుకువస్తాం. పెన్షన్ దారులకు ఒకటే చెబుతున్నా... ఆ పెన్షన్లు తీసుకువచ్చింది ఎన్టీఆర్. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారు రూ.30 పెన్షన్ ఇచ్చారు. సమైక్యాంధ్ర సమయంలో నేనే రూ.75 చేశాను. 2014లో నేను ముఖ్యమంత్రిని అయ్యాక రూ.200గా ఉన్న పెన్షన్ ను రూ.2 వేలు చేశాను. అబద్ధాలకోరు చెబుతున్నాడు... ఆయనేదో పెంచాడంట. నోరు విప్పితే అది అబద్ధాల పుట్ట. మేం అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం పెంచుతాం" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 

 

Link to comment
Share on other sites

ok, only one question thatha,

can Baboru say 2014-2019 Rule thesukostha??

ala chesthae 23 seats badalu 123 sets vasthayi *u( mark my words

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...