Jump to content

Revanth Reddy నేను మాటిస్తే ఎలా ఉంటుందో నీ మామకు తెలుసు... సిద్ధమా?: హరీశ్ రావు కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్

psycopk

Recommended Posts

Revanth Reddy నేను మాటిస్తే ఎలా ఉంటుందో నీ మామకు తెలుసు... సిద్ధమా?: హరీశ్ రావు కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ 

23-04-2024 Tue 16:53 | Telangana
  • పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? అని ప్రతి సవాల్
  • రైతుల రుణాలు మేం తీరుస్తాం... వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచన
  • బొట్టు పెట్టి ఓటు అడగాలని కాంగ్రెస్ కేడర్‌కు పిలుపు
  • పాలమూరు విషయంలో పరాయివాడు పరాయివాడేనని కేసీఆర్ నిరూపించాడని విమర్శ
  • కేసీఆర్ తాగుబోతు సంసారం... అప్పుల సంసారంగా చేస్తే రూ.26వేల కోట్ల కిస్తీలు కట్టానన్న ముఖ్యమంత్రి
 
Revanth Reddy accepts Harish Rao challenge

బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. అగస్ట్ 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని (బీఆర్ఎస్) రద్దు చేసుకుంటావా? నేను మాటిస్తే ఎలా ఉంటుందో నీకంటే నీ మామకు (కేసీఆర్)కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మంగళవారం కొడంగల్‌లో కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'హరీశ్ రావు నాకు సవాల్ విసిరారు. పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? అని అడిగారు. మరి నేను రుణమాఫీ చేస్తే నువ్వు నీ పార్టీని రద్దు చేసుకుంటావా? నా సవాల్‌ను స్వీకరించు. భూమితలకిందులైనా... కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉరేసుకొని సచ్చినా నేను రుణమాఫీ చేస్తా.. నా సవాల్‌ను స్వీకరిస్తావా?' అని ప్రతి సవాల్ విసిరారు.

బ్యాంకు అధికారులకు సూచన

తాము కచ్చితంగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొంతమంది బ్యాంకు అధికారులు రైతులను అప్పులు కట్టాలని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందని... అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతుల తరఫున మాది జిమ్మేదార్... మీ బ్యాంకుల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందన్నారు.

కేసీఆర్‌పై విమర్శలు

అధికారంలో ఉన్నప్పుడు వరి వేసుకోమని చెప్పి... ఆ తర్వాత వరి వేసుకుంటే ఉరి అన్న కేసీఆర్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో ఓటేద్దామా? అని ప్రశ్నించారు. అలాంటి వారిని నమ్మి ఓటు వేయవద్దని కోరారు. తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి కేంద్రాన్ని నిలదీసి నాడు వరి కొనుగోలు చేసేలా చేశామన్నారు.

బొట్టు పెట్టి ఓటు అడగండి

ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారని... తాను కొడంగల్ కుటుంబ సభ్యుడిని... మీరే నా బలగం కాబట్టి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50వేల మెజార్టీ ఇస్తేనే ఢిల్లీలో నేను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాబోయే ఇరవై రోజులు చాలా కీలకమన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడాలని కోరారు. అమ్మలక్కలు ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి మరీ మనకు ఓటు వేయాలని వారిని కోరాలని చెప్పారు. బొట్టు పెట్టి ఓటు అడగండి... పోలింగ్ బూత్‌కు రమ్మనండి అని సూచించారు. అందరి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు.

పరాయివాడు పరాయివాడేనని కేసీఆర్ నిరూపించాడు

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేల్, సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నాడని.. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏమీ చేయలేదని విమర్శించారు. తద్వారా పరాయివాడు పరాయివాడేనని నిరూపించాడన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలమూరు జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపించాడన్నారు. మనం వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు పాలమూరు జిల్లా అభివృద్ధి మన చేతుల్లో ఉందన్నారు.

రూ.26వేల కోట్ల కిస్తీలు కట్టాను

తాను అధికారం చేపట్టే నాటికి ఖజానా దివాలా తీసిందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. రూ.300 కోట్ల లోటు బడ్జెట్‌తో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. కేసీఆర్ తాగుబోతు సంసారం... అప్పుల సంసారంగా చేస్తే ఆయన చేసిన అప్పులకు ఈ నాలుగు నెలల్లో తాను రూ.26వేల కోట్ల కిస్తీ కట్టానని వాపోయారు. అయినా ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు ఇస్తున్నామని, పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నామని తెలిపారు.

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

lol.. maata meeda nilabadatam gurinchi verse cheppali.. ghmc lo TRS ki 100 seats vaste rajakiya sanyasam annadu.. taruvatha kathalu cheppadu.. 

Link to comment
Share on other sites

1 hour ago, jaathiratnalu2 said:

Nanadamuri Familyblo chichhubpettaru

Jaggadi family lo pettaru

Ippudu Revanth Saharan to Kchir Family lo chichhu pedutunnara pulkas antunna @Android_HaIwa

Topic ki related ga post cheyatam nerchuko… 

Link to comment
Share on other sites

5 minutes ago, psycopk said:

Topic ki related ga post cheyatam nerchuko… 

Asalu Ila nerchukundi Pachha brothers numchi 

Facts matladite kopam  enduku samara 

Link to comment
Share on other sites

5 minutes ago, jaathiratnalu2 said:

Asalu Ila nerchukundi Pachha brothers numchi 

Facts matladite kopam  enduku samara 

Advice icha istam Leka pote idiseyi.. kopam tho aaite response vere la untadi

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

Advice icha istam Leka pote idiseyi.. kopam tho aaite response vere la untadi

Ohh Got it . Thanks for advice 

Link to comment
Share on other sites

Kaksha undakudada metu chesina langa panulaki??

KCR: రేవంత్ రెడ్డికి నాపై ఆ కక్ష ఉంది... 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు: టీవీ 9 ఇంటర్వ్యూలో కేసీఆర్ 

23-04-2024 Tue 22:19 | Telangana
  • ఓటుకు నోటు కేసు తప్ప రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఏమి ఉంటుందన్న కేసీఆర్
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా
  • ప్రభుత్వం కూలిపోతుందంటే రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదన్న కేసీఆర్
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని మా వద్దకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారని వ్యాఖ్య
 
KCR says 25 mlas ready to join brs from congres

ఓటుకు నోటు కేసు తప్ప తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకేం కక్ష ఉంటుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 2015లో ఓటుకు నోటు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రేవంత్ కుట్ర చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని తెలిపారు. తనపై రేవంత్ రెడ్డికి అదే కక్ష ఉందన్నారు. మంగళవారం నాడు టీవీ9లో 'లైవ్ షో విత్ కేసీఆర్' కార్యక్రమంలో ఆయన ఓటుకు నోటు కేసు అంశంపై స్పందించారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఈసారి గెలిస్తే ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా తొలి ఇంటర్వ్యూను మీకే ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు భ్రమలో పడి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లు తమ రివ్యూలో తేలిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదన్నారు. బీఆర్ఎస్ 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి సున్నా నుంచి 1 స్థానాలు మాత్రమే వస్తాయన్నారు.

కడియం శ్రీహరి పార్టీ మారడంపై కూడా కేసీఆర్ స్పందించారు. కడియం శ్రీహరి తాను చచ్చి బీఆర్ఎస్‌ను బతికించారని వ్యాఖ్యానించారు. ఆయన ఖర్మ బాగాలేక కాంగ్రెస్‌లోకి వెళ్లారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని స్వేచ్ఛ... అధికారం పోయాక కడియం శ్రీహరికి గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మహా సముద్రమని... పిడికెడు మంది పోతే పోయేదేం లేదన్నారు. తాను రాజకీయ పార్టీతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపానని... అందుకే ఇక ఫక్తు రాజకీయాలు చేస్తామని 2014కు ముందే చెప్పామని గుర్తు చేశారు. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లలో కొంతమంది తనకు ఫోన్ చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బయట పలువురు చెబుతుంటే రేవంత్ రెడ్డి ఖండించడం లేదన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే చాలా అనిశ్చితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లలో కొంతమంది ఎమ్మెల్యేలు తమ నేతలను సంప్రదిస్తున్నారని తెలిపారు. 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నట్లు తమకు చెబుతున్నారన్నారు. మనమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని వాళ్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మా వాళ్లతో ఆ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. కానీ తాము మాత్రం ఆ విషయంపై ఇంకా చర్చించలేదన్నారు.

Link to comment
Share on other sites

KCR: ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిగా నాది కేవలం వ్యూహమే... నాకేమీ ఇంజినీరింగ్ భాష తెలియదు: టీవీ 9 ఇంటర్వ్యూలో కేసీఆర్ 

23-04-2024 Tue 21:22 | Telangana
  • కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కేసీఆర్ దేనని కాంగ్రెస్ నాయకులు చెప్పడం మూర్ఖత్వమేనని వ్యాఖ్య
  • సమైక్య పాలనలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదన్న కేసీఆర్
  • అసలు రేవంత్ రెడ్డిని లెక్కలోకే తీసుకోనన్న బీఆర్ఎస్ అధినేత
 
KCR key comments on kaleswaram project

తెలంగాణలో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రిగా తనది కేవలం వ్యూహం మాత్రమేనని... తనకు ఇంజినీరింగ్ భాష తెలియదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కేసీఆర్ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పడం మూర్ఖత్వమే అన్నారు. మంగళవారం టీవీ9లో 'లైవ్ షో విత్ కేసీఆర్' కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతూ... సమైక్య పాలనలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శించారు. మైనర్ ఇరిగేషన్ ధ్వంసమైందన్నారు.

భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయన్నారు. కానీ తాము వచ్చాక అన్నింటిని సరిదిద్దే ప్రయత్నం చేశామన్నారు. ఎత్తులో ఉన్న తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే దిక్కు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా వాడుకోవాలో తెలియని అసమర్థులు.. అర్భకులు కాంగ్రెస్ వాళ్లు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. మేడిగడ్డ మూడు పిల్లర్లలో ఒక బ్లాక్‌లోని ఇబ్బందిని కాంగ్రెస్ వారు పెద్దదిగా చూపిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో టన్నెల్స్, పంప్ హౌజ్‌లు అన్నీ బాగానే ఉన్నట్లు చెప్పారు.

పిల్లర్ కుంగినట్లు ఎన్నికలకు ముందే తెలుసునని... అందుకే బాగు చేయాలని అధికారులను కూడా ఆదేశించానన్నారు. కానీ ఇప్పుడు తనను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయించకపోయినా ఏం కాదన్నారు. కాళేశ్వరం కెపాసిటీ 16 టీఎంసీలేనని తెలిపారు. ఎండాకాలంలో రెండో పంటకు, సాగునీటికి కాళేశ్వరం కీలకమన్నారు.

రేవంత్ రెడ్డిని లెక్కలోకి తీసుకోను

ప్రస్తుతం తెలంగాణలో అంతా దేవుళ్ల మీద ఒట్లు... కేసీఆర్ మీద తిట్లు నడుస్తున్నాయని కేసీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తమ పార్టీలో కూడా కొన్నాళ్లు ఉన్నారని... కానీ ఆయన పాలనలో అహంకారం, అజ్ఞానపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెరిపేస్తామని ఆయన చెబుతున్నారని.. కానీ అది అసాధ్యమన్నారు. అలాంటి ఆలోచనే వికృతమైందన్నారు. అసలు రేవంత్ రెడ్డి తనపై చేసే దాడిని తాను లెక్కలోకే తీసుకోనని తెలిపారు. ఎవరికైనా రాజకీయంగా టైమ్ వస్తుందన్నారు.

ఉద్యమం సమయంలో తాను ఆంధ్రాకు వ్యతిరేకమని చాలామంది అనుకున్నారని... కానీ బీఆర్ఎస్ పాలనలో ఎవరూ బాధపడలేదని పేర్కొన్నారు. తెలంగాణ మీద.. వనరుల మీద.. ఉద్యోగాల మీద తెలంగాణ వారికే అవకాశం ఉండాలని మాత్రమే అనుకున్నామని... అది సాధించామన్నారు. కానీ వికృతమైన వ్యతిరేక భావనతో తాము మనుషుల మధ్య గోడ కట్టలేదన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...