Jump to content

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ?


kingmakers

Recommended Posts

[b][size=18pt]రాష్ట్ర విభజన సమస్యకు త్వరలో తెరపడ నుందా? రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధంగానే ఉందా? హైదరాబాద్‌పైనే సంశయిస్తోందా? హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని గా మారనుందా?.. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే తెరపైకి రాకతప్పదు.ఆదివారం జరిగిన ఉద్యోగుల జేఏసీ సమా వేశంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా లోతుగానే కనిపిస్తున్నాయి. ‘తెలంగాణ కచ్చితంగా వచ్చితీరు తుంది. అయితే హైదరాబాద్‌ మీదే కిరికిరి ఉంటుంద’ని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి.. రాష్ట్ర విభజన ప్రక్రియకు కేంద్రప్రభుత్వం సుముఖంగానే ఉందని, హైదరాబాద్‌ అంశంపైనే యుపీఏ సర్కారు తర్జనభర్జన పడుతోందన్న విషయం కేసీఆర్‌ చెప్పకనే చెప్పినట్టయింది.

అయితే.. కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఢి ల్లీలో సైతం హైదరాబాద్‌ను రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలన్న అంశానికే కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ వ్యాఖ్య లు దాదాపు అదేమాదిరిగా ఉండటంతో రాష్ట్ర విభజనపై కేసీఆర్‌ యుపీఏ చాలాకాలం నుంచి టచ్‌లోనే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.సాంకేతికంగా రెండు రాష్ట్రాలను విడగొట్టి నప్పటికీ, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటుచేయటం వల్ల రెండు ప్రాంతాల వారినీ సంతృప్తి పరచవచ్చన్న యోచన చాలాకాలం నుంచి కేంద్రం మదిలో మెదులుతూనే ఉంది. దానివల్ల అందరి మనోభావాలను సంతృప్తి పరిచినట్టవుతుం దని అంచనా వేస్తోంది.

హైదరాబాద్‌లో స్వతహాగా జన్మించిన తెలంగాణ వారి సంఖ్య అత్యల్పమని, ఇటు తెలంగాణ గానీ, అటు సీమాంధ్ర నుంచి గానీ వలస వచ్చిన వారే ఎక్కువగా ఉన్నందున స్థానిక సమస్య ఉత్పన్నం కాదని, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ప్రతి పాదనను ఆమోదిస్తారన్న ఆశాభావంతో కేంద్ర సర్కారు ఉంది. ఇవన్నీ కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసని ఢిల్లీ వర్గాలు తెలుసు.కాగా, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అంశంపై ఆంధ్ర-తెలంగాణ ప్రజలను మానసి కంగా సిద్ధం చేయడానికే కేసీఆర్‌ ఇలాంటి ప్రచారాన్ని లేవనెత్తినట్లు కనిపిస్తోంది.

ఇకపై కేసీఆర్‌ ప్రసంగించే వివిధ వేదికలపై హైదరాబాద్‌ రాజధానిపైనే కిరికిరి ఉందన్న తన వ్యాఖ్యలను కొనసాగించడం ద్వారా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయనున్నారన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవు తోంది.అయితే, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం గా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా ఢిల్లీలో జోరుగా జరుగుతోంది. రక్షణ నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, వరంగల్‌ను తెలంగాణ రాజధానిగా, విజయవాడను ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ప్రకటించే యోచన కూడా కేంద్రం మదిలో లేకపోలేదంటున్నారు.[/size][/b]

Link to comment
Share on other sites

[img]http://www.imageping.com/out.php/i62649_profilepic.gif[/img] [img width=128 height=128]http://www.imageping.com/out.php/i62649_profilepic.gif[/img][img width=128 height=128]http://www.imageping.com/out.php/i62649_profilepic.gif[/img]

Link to comment
Share on other sites

×
×
  • Create New...