Jump to content

vikram's mallanna film story-line...


Pioneer

Recommended Posts

విక్రమ్ మల్లన్న(కందసామి) చిత్రంపైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. అందులోనూ చాలా కాలం విక్రమ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమాలో విక్రమ్ రకరకాల గెటప్ లలో కనపడనున్నారు. ఇక సుశీగణేషన్ దర్శకత్వంలో కలై పులి థాను నిర్మిస్తున్న ఈ చిత్ర కథ కూడా ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విక్రమ్ పాత్ర అందరినీ ఆదుకునే రాభిన్ హుడ్ తరహాలో వెళ్తుందని తెలుస్తోంది. అలాగే కథ ప్రకారం జనం తమ కష్టాలని, భాధలని చీటీలపై రాసి ఓ ప్రముఖ దేవాలయం వద్ద నున్న మర్రిచెట్టుకి వేళ్ళాడ తీస్తారుట.

వాటిని చదివే విక్రమ్ తన దైన శైలిలో పరిష్కరస్తూ వారి దృష్టిలో దేవుడిలా ఎదుగుతాడుట. వారంతా దైవం మల్లన్నే ఈ పనులన్నీ చేసాడని భావిస్తూంటారుట. ఇక ఈ సినిమా పూర్తి హాలివుడ్ స్టైల్స్ తో నిండి ఉంటుందిట. అంతేగాక ఈ చిత్రంలో విక్రమ్ లేడీ గెటప్ లో కూడా కనపడి కనువిందు చేయనున్నాడు. ఇక శ్రియ అతన్ని మొదట అడ్డుకున్న తర్వాత అతనికి సహరిస్తూ గ్లామర్ కురిపిస్తూంటుందిట. అంటే 'అపరిచితుడు' లో ఇంటర్ నెట్ కు బదులు ఇక్కడ మర్రిచెట్టు వస్తుందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విక్రమ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం హాలీవుడ్ తరహాలో ఇండియన్ జేమ్స్ బాండ్ లా మల్లన్న కనపడతాడుట.

అపరిచితుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విక్రమ్ మరోసారి మల్లన్నగా రానున్నాడు. చిత్ర విశేషాలు గురించి బుధవారం పాత్రికేయులతో మాట్లాడుతూ...ఇండియన్ జేమ్స్ బాండ్ ఉంటే ఎలా ఉంటుందో ఊహిస్తే...ఖచ్చితంగా అలాగే ఉంటుందన్నారు. విక్రమ్ ఈ కథ గురించి మాట్లాడుతూ..కథ ముఖ్యంగా భగవంతుని సందర్శించే భక్తులు ఏమేం కోరతారో...వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నం మల్లన్న చేస్తుంటాడు. భక్తులు కోర్కెలు ఎలా మల్లన్న ఎలా నెరవేర్చాడన్నది వెండితెరపై చూస్తేనే బావుంటందని నవ్వుతూ సమాధానమిచ్చారు.

తాను 12 గెటప్పుల్లో కనిపిస్తారన్న ప్రశ్నకు..విక్రమ్ సమాధానమిస్తూ...ఓ ఐదారు పాత్రలలో తాను నటించినట్లు తెలిపారు. ముఖ్యంగా తాను వేసిన అమ్మాయి పాత్రకు మెగాస్టార్ చిరంజీవి వద్దనుంచి పొగడ్తలు వచ్చాయని చెప్పారు. కాగా ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఏకాంబరం సినిమాటోగ్రాఫర్. అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు థాను. #~`

Link to comment
Share on other sites

×
×
  • Create New...