Jump to content

సీమాంధ్ర ఉద్యమానికి చంద్రబాబు సంఘీభావం


eela

Recommended Posts

గుంటూరు, సెప్టెంబర్ 1 : సీమాంధ్రలో జరుగుతోన్న సమైక్యాంధ్ర ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు కోట్ల మంది రోడ్ల పైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే తాను హైదరాబాద్‌లో కూర్చుని చూస్తూ ఉండలేక , సమస్యలు తెలుసుకొనేందుకు వచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించమని తాను లేఖ ఇచ్చిన విషయం వాస్తవమని చెప్పారు.

తెలంగాణపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను చంద్రబాబు తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. ఎవరూ ఓడిపోకుండా అందరూ గెలవడమే నిజమైన విజయమని బౌద్ధుడు చెప్పిన సూక్తిని పొందుపరిచారు. అలానే వాస్తవాలను ఎదుర్కోని పక్షంలో అవి ప్రతీకారం తీర్చుకొంటాయని పటేల్ అన్న మాటలను చేర్చారు. ఆ ప్రకారం కేంద్రం ముందుకు పోవాల్సి ఉండగా కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్లు సీడబ్ల్యూసీ ప్రకటనలోనే టీఆర్ఎస్ ఎలా తమలో విలీనం అవుతుందో కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ సీమాంధ్ర ప్రజలను రోడ్ల మీదకు రమ్మని పిలుపునివ్వలేదు. అయినాసరే అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చారు. కాంగ్రెస్ మీ కష్టాలేమిటని ఎప్పుడూ అడగలేదన్నారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయాలను తమ పార్టీ ఎంపీలు లోక్‌సభలో ఎండగట్టారని చెప్పారు. తెలుగుజాతితో పెట్టుకొంటే శృంగభంగమే తప్ప, ఏమీ చేయలేరని హెచ్చరించారు. ఆ రోజు ఎన్‌టీఆర్‌తో పెట్టుకొని ఇందిరాగాంధీ ఏమయ్యారో అందరికి తెలుసని, ఈ రోజున సోనియాకు కూడా అదే గతి పడుతుందని స్పష్టం చేశారు.
మీకు న్యాయం జరగాలి. పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. వారికి ఉపాధి అవకాశాలు మెరుగపడాలి. అప్పటివరకు మీతోనే అండగా ఉంటానని భరోసా కల్పించారు. తాను చేస్తోన్న ధర్మ పోరాటానికి అండగా నిలబడాలని, రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి శంకరగిరి మాన్యాలు పట్టించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రధానంగా తాము అధికారంలో ఉన్నప్పుడు ర్రాష్టాన్ని విభజిస్తామంటే ఒప్పుకోలేదని, అద్వానీ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నదని తెలుసుకొని విభజన వద్దన్నారని, అలానే తాను ర్రాష్టాన్ని సమైక్యంగానే ఉంచాలని చెప్పి అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పాయ్‌తో ఆ నిర్ణయాన్ని అమలు చేయించానని చేసిన ప్రకటనకు ప్రజల నుంచి విశేషంగా స్పందన లభించింది.

Link to comment
Share on other sites

[quote name='PeddaBabu' timestamp='1378063971' post='1304192221']
anthe seperate state ki cbn opposing ani anukovala?
[/quote]

Neku ela anipisthe ala anuko [img]http://1.bp.blogspot.com/-Dori_Fn2hgE/UaYmtb6U2EI/AAAAAAAAGdI/_bkJAHWT1cs/s1600/brahmi44.gif[/img]

Link to comment
Share on other sites

[b]తెలంగాణాని ప్రారంబించింది రాజశేఖర్ రెడ్డి, ముగించింది కాంగ్రెస్ పార్టీ - చంద్రబాబు నాయుడు.[/b]

Link to comment
Share on other sites

×
×
  • Create New...