Jump to content

Andhra Dongala Updates..


mukunda1

Recommended Posts

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mukunda1

    9

  • afrnds

    7

  • ZuniorVentiyar

    3

  • pythonic

    2

Popular Days

Top Posters In This Topic

 

ఫైళ్లు కూడా మార్చేస్తున్నారు
Updated : 12/19/2014 3:33:38 AM
Views : 109
-సచివాలయంలో ఆంధ్రా అధికారుల చేతివాటం
-తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల జాబితాలో కడప అధికారి పేరు
-నీటిపారుదలశాఖలో ఫైల్ మార్చేసిన ఆంధ్రా అధికారి
-చివరిక్షణంలో గుర్తించిన మంత్రి పేషీ సిబ్బంది

హైదరాబాద్, డిసెంబర్ 18 (టీ మీడియా):సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ ఆంధ్రా అధికారుల మాయలు రాష్ర్టాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఉద్యోగుల విభజన ఆలస్యమవుతున్న కారణంగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రా ఉద్యోగులు, అధికారులు తెలంగాణ సొమ్మును తమ సొంత రాష్ర్టానికి వీలైనంత ఎక్కువ దోచిపెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మిషన్ కాకతీయ ప్రాజెక్టు కోసం రిటైర్డ్ ఇంజినీర్ల నియామక జాబితాలో దొంగచాటుగా ఆంధ్రా అధికారి పేరును కూడా చేర్చిన ఉదంతం తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా అధికారుల వ్యవహారశైలిని మరోసారి వేలెత్తి చూపింది.

ఫైళ్లలో ఆంధ్రా జిమ్మిక్కులు: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. 46 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకంలో ఇంజినీర్ల కొరతను అధిగమించేందుకు రాష్ర్టానికి చెందిన రిటైర్డ్ ఇంజినీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని నిర్ణయించింది. 

దీంతో నీటిపారుదలశాఖ అధికారులు 115 మంది తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లను గుర్తించారు. నెలకు రూ. 25 వేల చొప్పున వేతనంతో మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణ కోసం వీరిని నియమించేందుకు ఫైల్ సిద్ధం చేసి సచివాలయానికి పంపారు. ఇక్కడే అంతా తారుమారైంది. నిజానికి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. ఫైళ్ల తయారీ, ఉత్తర్వుల జారీలో వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో నీటిపారుదలశాఖ నుంచి వచ్చిన ఫైల్‌లో తెలంగాణ ఇంజినీర్ల పేర్లతోపాటు ఆంధ్రా అధికారుల పేర్లను చేర్చేలా వ్యూహం పన్నారు. 

తెలంగాణ ఇంజినీర్ల ఫైల్‌లో కడప అధికారి పేరు 
నీటిపారుదలశాఖ నుంచి సచివాలయానికి చేరిన ఫైల్‌లో 11 పేరాలున్నాయి. కానీ సచివాలయంలోని నీటిపారుదలశాఖలో పనిచేసే ఓ డిప్యూటీ సెక్రటరీస్థాయి అధికారి తన ఆంధ్రాభిమానాన్ని చాటుకొంటూ కడపకు చెందిన రిటైర్డ్ డీఈ పేరును కూడా ఫైల్‌లో చేర్చారు. 11 పేరాలున్న ఫైల్‌లో 12వ పేరాను చేర్చి కడప అధికారి పేరుతో ఫైల్‌ను నీటిపారుదలశాఖ మంత్రి పేషీకి పంపారు. అయితే, ఆంధ్రా అధికారి మాయను మంత్రి పేషీలో అధికారులు గుర్తించి మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన కూడా ఆశ్చర్యపోయారు.

వెంటనే సదరు ఆంధ్రా అధికారిని పిలిపించి నిలదీయటంతో ఏవో సాకులు చెప్పి తప్పించుకోజూసినట్టు సమాచారం. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళి ఫైల్‌ను పూర్తిగా చదువాలని సూచించినట్టు సమాచారం. ఈ ఘటనతో ఉలిక్కిపడిన నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు మళ్లీ ఇలాంటివి జరుగకుండా పకడ్బంధీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోసాలను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ప్రత్యేకంగా ఒక డీఈని నియమించుకున్నారు. నీటిపారుదలశాఖ నుంచి వెళ్ళే ప్రతి ఫైల్ కాపీని సదరు డీఈ పరిశీలనకు పంపించే ఏర్పాట్లు చేశారు. నీటిపారుదలశాఖలోనే కాకుండా చాలాచోట్ల ఇలాంటి మోసాలు జరుగూనే ఉన్నాయని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. అన్నిశాఖల్లో నిఘా పెట్టాలంటే ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేయాల్సి రావొచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

 

proof flzzzz

Link to comment
Share on other sites

ఈ నేపథ్యంలో ఇక్కడి భూముల పరిస్థితిపై దృష్టి సారించినపుడు సీమాంధ్ర పాలనలో ఇక్కడ అడ్డగోలుగా జరిగిన భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు కేవలం 30-40 కిలో మీటర్ల దూరంలో పర్యాటక ప్రాంతంగా ఉండడంతో సీమాంధ్ర రియల్టర్లు ఇక్కడ అడ్డగోలుగా లేఅవుట్లు వేశారు. సర్కారు దన్నుతో అసైన్డ్ భూములనుంచి సర్కారు భూముల దాకా కనిపించిన ప్రతి ఎకరాన్ని కబ్జా పెట్టారు. అటవీభూములు మింగేశారు.

Link to comment
Share on other sites

×
×
  • Create New...