Jump to content

హైదరాబాద్ నుంచి ఆంధ్రా పోలీసుల రీకాల్


athletics

Recommended Posts

హైదరాబాద్: ఆంధ్రా పోలీసులు తమ తప్పు తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి 400 మంది ఏపీ పోలీసులను ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ రాముడు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు సమాచారం అందించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులందరికి విచారణ నిమిత్తం ఏసీబీ నోటీసులు జారీ చేస్తుంది. గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ సీఎం బాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీలు సీఎం రమేశ్, గరికపాటి రాంమోహన్ రావు, వేం నరేందర్‌రెడ్డి తదితరులకు తెలంగాణ పోలీసుల నుంచి అరెస్టు భయం పట్టుకుంది. ఈ అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు సెక్షన్ 8 సాకుతో హైదరాబాద్ నగరంలో తమ సొంత ఇళ్లు, కార్యాలయాల వద్ద ఏపీ పోలీసు బలగాలను మోహరించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో భూభాగమైన హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల భద్రత చట్టప్రకారం చెల్లదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఏపీ డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Link to comment
Share on other sites

ayina evvadu vayya bob ki advisor, notice tesukoka pote, acb vadu velli malli enko case pedutadu, appudu court issue chestadi notice, adi kuda tesu koka pote warrant itchi lopala tosataru..

 

notice tesukoni daniki high court lo leka manchi legal opnion tesukovachu kada...aa release ayina audio la kuda vedu enta react kavalisina matter eldu

Link to comment
Share on other sites

×
×
  • Create New...