Jump to content

సీమాంధ్రుల ఓట్లడిగే హక్కు కోల్పోయిన టీఆర్‌ఎస్‌


rajurocking50

Recommended Posts

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఓట్లను అడిగే హక్కును టీఆర్‌ఎస్‌ కోల్పోయిందని అంటున్నారు. ఈ పరిణామం అంతిమంగా టీడీపీకి మేలు చేకూర్చనుందని, ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా ఉన్నా సీమాంధ్రులు ఇకపై ఆ పార్టీ కార్యకర్తలుగా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇందుకు కారణం.. కృష్ణా జలాలపై వాటానేనని చెబుతున్నారు.

                                                 కృష్ణా బోర్డు సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు కృష్ణా జలాలపై చర్చ జరిగింది. దాంతో భవిష్యత్తు అవసరాల కోసం హైదరాబాద్‌కు దాదాపు 20 టీఎంసీలు కావాలని తెలంగాణ అధికారులు కోరారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో అత్యధికులు సీమాంధ్రులేనని, వారందరికీ మంచినీళ్లు సరఫరా చేయాలని, ఆ మంచినీళ్లను సీమాంధ్ర కోటా నుంచే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అంగీకరించారు. హైదరాబాద్‌కు అవసరమైన దాదాపు 20 టీఎంసీలను ఉమ్మడి కోటా మరీ ముఖ్యంగా సీమాంధ్ర కోటా నుంచే ఇవ్వాలని నిర్ణయించారు.

                        హైదరాబాద్‌లో తమ నుంచి పన్నులు వసూలు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తమకు మంచినీళ్లు కూడా సరఫరా చేయదా అనే అభిప్రాయం సీమాంధ్రుల్లో ఏర్పడుతోంది. తమకు మంచినీళ్లను కూడా ఏపీ ప్రభుత్వమే ఇవ్వాలనేంత ద్వేషం తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడిందనే వ్యతిరేక భావం కూడా వారిలో ఏర్పడుతోంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం అంగీకరించకపోతే తమకు మంచినీళ్లు సరఫరా చేయరా అనే ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కాకుండా మరొక ప్రభుత్వం ఉండి ఉంటే.. ఆ ప్రభుత్వం మంచినీటి వాటాకు ఒప్పుకోకపోయి ఉంటే ఏమిటనే ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామం రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుందని వివరిస్తున్నారు.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...