Jump to content

హైకోర్టు అసహనాన్ని చూసిన టీ సర్కార్


rrc_2015

Recommended Posts

వెనుకా ముందు చూసుకోకుండా హడావుడి నిర్ణయాలు తీసుకోవటం.. దానికి కిందామీదా పడటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరమైన చిక్కుల్ని పెద్దగా పట్టించుకోకపోవటం.. ఏం జరుగుతుందో చూద్దాం.. ముందైతే చెప్పింది చేయ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు అసహనం వ్యక్తం చేయటం తెలిసిందే.

తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితి మరోసారి తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఎదురైంది. ప్రభుత్వ  సలహాదారునికి క్యాబినెట్ హోదా ఇవ్వటంపై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వాయిదాల మీద ఆధారపడటం.. కౌంటర్ వేసేందుకు మరింత సమయం అడగటం హైకోర్టు అసహనానికి కారణమైంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయే దానికి భిన్నంగా అదరబాదరగా నిర్ణయాలు తీసుకోవటం.. వీటిని విభేదిస్తూ ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించటం తరచూ చోటు చేసుకుంటుంది.

ఇలాంటి అంశాలపై ఇప్పటికే హైకోర్టు నుంచి తెలంగాణ సర్కారు ఎదురుదెబ్బలు తింది. తాజాగా.. ప్రభుత్వ సలహాదారునకు క్యాబినెట్ హోదా కల్పించటం ఎందుకన్న కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో ఇచ్చిన సమయానికి మించి మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించటంతో.. కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా కాలయాపన ఎందుకు చేస్తారని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే దానికంటే.. ముందుస్తుగా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే ఇలాంటి తిప్పలు ఉండవు కదా..? అదే ఉంటే.. తెలంగాణ సర్కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముందన్న మాట వినిపిస్తోంది.

Link to comment
Share on other sites

×
×
  • Create New...