Jump to content

ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో హీరో ఉదయ్ కిరణ్


BReBeL

Recommended Posts

Hero Udaykiran shifted to Mental Hospital

జైలులో ఉన్న ఫేస్ బుక్ సినిమా హీరో నండూరి ఉదయ్ కిరణ్ మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు పిచ్చాస్పత్రికి తరలించారు. తరచూ వివాదాల్లో నిలుస్తున్న హీరో ఉదయ్కిరణ్ మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో అతడిని వెంటనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. దీంతో అతడిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్ జైలులో విపరీత ప్రవర్తనతో తోటి ఖైదీలను కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది.

   సినిమా హీరో అయిన ఉదయ్ కిరణ్ తర్వాత డ్రగ్స్ కు బానిస అయ్యాడు. డ్రగ్స్ కు బానిస అయిన ఉదయ్ కిరణ్ కొద్ది రోజుల క్రితం ఓ పబ్ లో దాడి చేసి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలులో డ్రగ్స్ దొరక్కపోవడంతో అతడి మానసిక పరిస్థితి దారుణంగా మారింది. తోటి ఖైదీలు - జైలు అధికారులతోను విచిత్రంగా ప్రవర్తించాడు. జైలులో కూడా చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నట్టు సమాచారం.

బుధవారం కోర్టు విచారణకు హాజరైన ఉదయ్ కిరణ్ జడ్జి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. కాగా ఉదయ్ కిరణ్ పై హైదరాబాద్ తో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ - రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇక జూబ్లిహిల్స్ పోలీసులు ఇటీవల పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...