Jump to content

సాహో కుంబ్లే.. ‘నీ ఘనతకు సలామ్’


JANASENA

Recommended Posts

7brk-114-photo-dkd1.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక ఇన్నింగ్స్‌లో ఒక బౌలర్‌ 5 వికెట్లు పడగొడితేనే బ్రహ్మాండం అనేస్తాం. అలాంటిది 6 కాదు.. 7 కాదు.. ఏకంగా పదికి పది వికెట్లు పడగొట్టి కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించాడు టీమిండియా ప్రస్తుత కోచ్‌, దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో 1999లో ఫిబ్రవరి 4-7 మధ్యన జరిగిన రెండో టెస్టులో జంబో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌ను భారత్‌ 212 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కుంబ్లే సాధించిన అరుదైన ఘనతకు మంగళవారానికి 18 ఏళ్లు పూర్తయ్యాయి.

ముందు నాలుగు 
దిల్లీ ఫిరోజ్‌షా కోట్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ దిగిన పాక్‌ను బౌలర్లు కట్టడి చేయడంతో 172 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి రోజే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఎస్‌.రమేశ్‌ (96), సౌరవ్‌ గంగూలీ (62 నాటౌట్‌), జవగళ్‌ శ్రీనాథ్‌ (49) రాణించడంతో 339 పరుగులు చేసింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ తొలుత బాగానే ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు సయీద్‌ అన్వర్‌ (69), షాహిద్‌ అఫ్రిది (41) కాసేపు బాగానే ఆడారు. ఆ తర్వాత మొదలైంది అసలు ఆట.

10/74 చరిత్ర 
పాక్‌ ఇద్దరు ఓపెనర్లు బాగా ఆడడంతో భారత్‌ 101 పరుగుల వరకు వికెట్‌ కోసం వేచి చూసింది. అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్న అఫ్రిదిని 24.2వ బంతికి కుంబ్లే బోల్తా కొట్టించాడు. తర్వాతి బంతికే ఐజాజ్‌ అహ్మద్‌ను ఎల్బీ రూపంలో డకౌట్‌ చేశాడు. మరో నాలుగు ఓవర్లకు ఇంజమాముల్‌ (6)ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత రెండు బంతులకే యూసఫ్‌ యుహానా (0)ను ఎల్బీ చేశాడు. కుంబ్లే వేసిన 36.1వ బంతికి మొయిన్‌ ఖాన్‌ (3) ఇచ్చిన క్యాచ్‌ను గంగూలీ ఒడిసిపట్టాడు. 38.3వ బంతికి సయీద్‌ అన్వర్‌ (69) లక్ష్మణ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సలీమ్‌ మాలిక్‌(15)ను 54.1వ బంతికి, ముస్తాక్‌ అహ్మద్‌ను 58.5వ బంతికి, సక్లైన్‌ ముస్తాక్‌ను 58.6వ బంతికి ఔట్‌ చేశాడు. 60.3 బంతికి వసీమ్‌ అక్రమ్‌ను క్యాచ్‌ రూపంలో పెవిలియన్‌ చేర్చాడు. కుంబ్లే దెబ్బకు పాక్‌ 207 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో కుంబ్లే తొలి ఇన్నింగ్స్‌లో 4/75, రెండో ఇన్నింగ్స్‌లో 10/74 అద్భుత గణాంకాలు నమోదు చేశాడు.

 

https://twitter.com/BarnesRoyston/status/828834751230394368/video/1

Link to comment
Share on other sites

  • Replies 62
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • aatadista

    20

  • tennisluvr

    13

  • ronitreddy

    12

  • Kool_SRG

    6

Popular Days

Top Posters In This Topic

2 minutes ago, Kontekurradu said:

aa series super series, asalu

Sachin 100 in chennai, India lost by 12 runs,i can't believe 

That too with severe back pain....One of the Best Innings in the Final Innings...India were something 60/5 ento Sachin & Mongia put a partnership sad we couldn't win lost after coming so close :(

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

LOL out of 10 only 3 were LBWs tell me which were wrong...

Nenu match mother ana babu

enduku crying

but ah 10 lo Afridi's and Ijaz are clear controversy decisions. Ijaz gadidi ayite eta ichado telvadu

Link to comment
Share on other sites

Just now, aatadista said:

Nenu match mother ana babu

enduku crying

but ah 10 lo Afridi's and Ijaz are clear controversy decisions. Ijaz gadidi ayite eta ichado telvadu

Ardhamkaala....

 

Crying evadu chesadu evi controversy anipinchayo adiga ante....

Link to comment
Share on other sites

16 minutes ago, argadorn said:

Neeku istamaina bowler evaru sami...kumble anni wickets theshadu ayina nachada...

Debasish Mohanthi or abhay Kuruvilla or dodda narasayya ganesh emo 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...