Jump to content

మరో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు 6.. గిరిజనులకు 4 చొప్పున పెంపు... మొత్తం 60కి చేరనున్న కోటా బీసీ, చెల్లప్ప కమిషన్ల నివేదికలకు తెలంగాణ మంత్రిమండలి ఆమోదం


JANASENA

Recommended Posts

రిజర్వేషన్‌ చట్టం ఆమోదానికి 16న శాసనసభ ప్రత్యేక సమావేశం 
బీసీలకూ రిజర్వేషన్లు పెంచుతాం 
బీసీ, ఎంబీసీలపై అధ్యయనం 
ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌కు నిర్దేశం 
ఈనాడు - హైదరాబాద్‌

విద్యా, ఉద్యోగ రంగాల్లో తెలంగాణలోని ముస్లింలకు ఆరు శాతం, గిరిజనులకు నాలుగు శాతం చొప్పున రిజర్వేషన్లు పెంచాలనే సిఫార్సులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీ, చెల్లప్ప కమిషన్ల నివేదికలను యథాతథంగా అమలు చేయాలని తీర్మానించింది. తెలంగాణ రిజర్వేషన్‌ చట్టం కోసం ఈ నెల 16న శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 15న మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రిమండలి సమావేశం నిర్వహించి.. రిజర్వేషన్ల అమలుపై తుది నిర్ణయం తీసుకోనుంది. 15న సాయంత్రం 4.30 గంటలకు శాసనసభ కార్యకలాపాల కమిటీ(బీఏసీ) సమావేశం జరపాలని సభాపతి మధుసూదనాచారిని మంత్రిమండలి కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో బుధవారం మంత్రిమండలి సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీలు, ఎంబీసీలు, సంచార జాతుల వారికి రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌ దృష్ట్యా వారి స్థితిగతులపై అధ్యయన బాధ్యతలను మంత్రిమండలి బీసీ కమిషన్‌కు అప్పగించింది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్లు ఉండగా.. పెంపుదలతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకుంటాయి.

మంత్రిమండలి భేటీలో ముందుగా రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చింది. బీసీ కమిషన్‌ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రిమండలికి వివరించారు. ‘‘ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసిన కమిషన్‌.. వారికి రిజర్వేషన్లు పెంచాలని నివేదిక ఇచ్చింది.. ప్రస్తుతం వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండగా... వారి సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం విద్యా ఉద్యోగ రంగాల్లో అదనంగా మరో ఆరు శాతం ఇవ్వాలని కమిషన్‌ సూచించింది.’’ అని చెప్పారు. చెల్లప్ప కమిషన్‌ నివేదిక సారాంశాన్ని వివరించారు. ‘‘తెలంగాణలో గిరిజన జనాభా 9.08 శాతం ఉంది. 0.92 శాతంగా ఉన్న వాల్మీకి బోయలు, కాయితీ లంబాడీలు గిరిజన లక్షణాలు కలిగి ఉన్నందున వారిని గిరిజనుల్లో చేర్చాలి. దీని ద్వారా గిరిజన జనాభా 10 శాతం అవుతుంది. వారందరికీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ కమిషన్‌ సూచించింది’’ అని సీఎం వివరించారు.

రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్‌ ఉందని.. ఎంబీసీలు, సంచార జాతులకు రిజర్వేషన్లు పెంపునకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని అని సీఎం చెప్పారు. రిజర్వేషన్ల పెంపుదల కోసం నిబంధనల మేరకు బీసీ కమిషన్‌ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. దీనికి సంబంధించి బీసీ కమిషన్‌కు నిర్దేశించిన మార్గదర్శకాలకు మంత్రిమండలి అనుమతి తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం 16.3 శాతం ఎస్సీలు ఉండగా 15 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని.. వారికి అదనంగా ఒక శాతం పెంచేందుకు సుముఖంగా ఉన్నామని పేర్కొంది.

రాష్ట్ర వారసత్వ కట్టడాల చట్టానికి ఆమోదం 
తెలంగాణలో రాష్ట్రస్థాయి వారసత్వ కట్టడాల పరిరక్షణ చట్టం ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న చట్టం కేవలం హైదరాబాద్‌కే పరిమితమైనందున దాని స్థానంలో రాష్ట్రస్థాయికి వర్తించేలా కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

* ఆదిలాబాద్‌ జిల్లాలోని సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రిమండలి తీర్మానించింది.

* డి.రాజేశ్వర్‌, ఫారుఖ్‌ హుస్సేన్‌లను గవర్నర్‌ కోటాలో మరోసారి నియమించేందుకు సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

జన్మ ధన్యమైందని సీఎం ఆనందం 
ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు నివేదికల ఆమోదం సందర్భంగా మంత్రులు హర్షధ్వానాలు చేశారు. సీఎం కేసీఆర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసమే సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని.. రిజర్వేషన్ల పెంపు ద్వారా బడుగు వర్గాలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికలోని కీలక అంశాలను ఆమోదించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని.. జన్మధన్యమైందని చెప్పారు. ముస్లింల కష్టాలు తీరతాయని, గిరిజనులకు ప్రయోజనం చేకూతుందన్నారు.

త్వరలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ల నియామకం 
త్వరలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్లను నియమిస్తామని సీఎం చెప్పారు. రిజర్వేషన్ల పెంపుదల ప్రతిపాదనలపై అధ్యయనం చేయాలని సీఎం మంత్రులకు సూచించారు. దీనిపై శాసనసభలో తమ వాదనను వినిపించాలన్నారు. శాసనసభలో దీనికి ఏకగ్రీవ ఆమోదం అనంతరం అఖిలపక్షంతో దిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి ఆమోదం కోసం కృషి చేస్తామని చెప్పారు. శాసనసభలో బిల్లు ఆమోదం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

ప్లీనరీ, వార్షికోత్సవ సభలపై ప్రత్యేక శ్రద్ధ 
ఈ నెల 21న జరిగే పార్టీ ప్లీనరీ, 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగే బహిరంగ సభపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం మంత్రులకు సూచించారు. మంత్రిమండలి సమావేశం అనంతరం ఆయన అధికారులను బయటికి పంపి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేయించినందుకు మంత్రులను, పార్టీ నేతలను, కార్యకర్తలను అభినందించారు. ఇదే రీతిలో ప్లీనరీ, వరంగల్‌ సభను బ్రహ్మాండంగా జరపాలని సూచించారు.

12hyd-general1b.jpg

 

Link to comment
Share on other sites

11 శాతం ఉన్న ముస్లింలకు ... 12 శాతం అంటున్న కె సి అర్ .... ఇది అయ్యేపనేనా? దీన్ని సాకుగ బి జె పి చొక్కాలు చించుకోవటం ... ఇదంతా ఒక ఎత్తుగడనా? ఇవన్ని వోట్ బ్యాంక్ రాజకీయాలా?

 

bl@stbl@stbl@st

bl@stbl@stbl@st

bl@stbl@stbl@st

Link to comment
Share on other sites

2 minutes ago, trent said:

ASSAM e inka india. developement motta lekunda china meda inka enni days depend avvalo needle ki kuda. hail gandhis 

Anduke kadaa bro manamandaram out of India. 

Link to comment
Share on other sites

Just now, trent said:

so manaki right ledu antava india gurinchi matladataniki @3$%

Ledu right undi. But I am saying that we are better off being outside India. Ivanni India lo common so manam entha matladina ground reality won't change. 

Link to comment
Share on other sites

Ee LK gaallu brathaka taaniki ...veella  families brathakataaniki....ruling lo undataaniki....em decisions theesuko  raaa... Chetha LK galllaa raaa...

All politicians meeru mee families mee parties brathakataaniki Ee reservation ni vaadukovatam aapandi...

Both CBN and KCR....idharu chootiye galley Ee topic lo....

Okadu kaapu antaadu inkodu turaka and etc antaadu...

Nijamaina development cheyandi raaa....

Link to comment
Share on other sites

16 minutes ago, KABALI said:

Ee LK gaallu brathaka taaniki ...veella  families brathakataaniki....ruling lo undataaniki....em decisions theesuko  raaa... Chetha LK galllaa raaa...

All politicians meeru mee families mee parties brathakataaniki Ee reservation ni vaadukovatam aapandi...

Both CBN and KCR....idharu chootiye galley Ee topic lo....

Okadu kaapu antaadu inkodu turaka and etc antaadu...

Nijamaina development cheyandi raaa....

 

Link to comment
Share on other sites

19 minutes ago, KABALI said:

Ee LK gaallu brathaka taaniki ...veella  families brathakataaniki....ruling lo undataaniki....em decisions theesuko  raaa... Chetha LK galllaa raaa...

All politicians meeru mee families mee parties brathakataaniki Ee reservation ni vaadukovatam aapandi...

Both CBN and KCR....idharu chootiye galley Ee topic lo....

Okadu kaapu antaadu inkodu turaka and etc antaadu...

Nijamaina development cheyandi raaa....

@gr33d

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...