Jump to content

కొత్త ‘మెట్రో’ అమలు చాలా కష్టం

TampaChinnodu

Recommended Posts

కొత్త ‘మెట్రో’ అమలు చాలా కష్టం 
ప్రైవేటు భాగస్వాములు ముందుకురారు 
విజయవాడలో లైట్‌మెట్రోకి వెళ్లడం అవివేకం 
విశాఖ మెట్రో మరింత ఆలస్యమయ్యే అవకాశం 
హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే 
అందుకే ఎల్‌అండ్‌టీ వాయిదా వేస్తూ పోతోంది 
‘ఈనాడు’తో మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ 
ఈనాడు - దిల్లీ

17state2a.jpgకేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త మెట్రో విధానం కింద కొత్తగా ప్రాజెక్టులు ఆమోదం పొందడం చాలా కష్టమని మెట్రోమాన్‌ ఇ.శ్రీధరన్‌ పేర్కొన్నారు. ఆచరణలో దీన్ని అమలు చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. మెట్రో రవాణా లాభాలతో కూడుకున్న వ్యాపారం కాదు కాబట్టి ప్రైవేటు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావన్నారు. కొత్త మెట్రోరైల్‌ విధానం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుల భవిష్యత్తుపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ప్రస్తుతం కొత్త విధానం వచ్చినా విజయవాడ మెట్రోప్రాజెక్టును మాత్రం పాత విధానం ప్రకారమే కొనసాగించడానికి అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

* విశాఖపట్నం మెట్రోపై మాత్రం మళ్లీ కొత్తగా అధ్యయనం చేసి, డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేయాల్సి వస్తుంది.. అందుకు కనీసం ఆరేడు నెలల సమయం పడుతుంది.

* కొత్త మెట్రో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో విజయవాడ మెట్రోకూ ప్రైవేటు భాగస్వామిని గుర్తించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది.. ఈ విధానంలో సామాజిక ప్రభావ మధింపు తప్పనిసరి చేసినందున ప్రాజెక్టులు మంజూరు చేయకుండా తప్పించుకోవడానికి ఆ నిబంధన వీలు కల్పిస్తుంది.

* విజయవాడకు మెట్రో స్థానంలో లైట్‌రైల్‌ టెక్నాలజీ విధానాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. లైట్‌రైల్‌ విధానం అంటే ట్రామ్‌ వే లాగా ఉంటుంది., అటువైపు మళ్లడం అవివేకమే. ఇప్పటికే ఆమోదం పొందిన మెట్రోరైల్‌ ప్రాజెక్టుకే ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. విజయవాడ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో ఉండటం, చంద్రబాబుకున్న రాజకీయ పలుకుబడి దృష్ట్యా సాధారణ మెట్రో ప్రాజెక్టు అక్కడ చేపట్టడానికి అవకాశం ఉంది. లైట్‌ రైల్‌ టెక్నాలజీకి మళ్లితే మాత్రం అందుకు చాలా సమయం పడుతుంది.. వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలాంటి నగరాలకు ఈ విధానం సరిపోదు. లైట్‌ రైల్‌ టెక్నాలజీ సామర్థ్యం సాధారణ మెట్రో కంటే 50% తక్కువ ఉంటుంది. పైగా మెట్రోతో పోల్చుకుంటే దాని నిర్మాణానికయ్యే ఖర్చులో తేడా పెద్దగా ఉండదు. ప్రయాణికుల రవాణా సామర్థ్యంలోనూ దాదాపు 50% తేడా ఉంటుంది. మెట్రో ప్రాజెక్టులను వందేళ్లను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తుంటారు. వచ్చే వందేళ్లలో విజయవాడ చాలా పెద్దనగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున సాధారణ మెట్రోప్రాజెక్టు నిర్మాణం చేపట్టడమే ఉత్తమం. ఈ విషయంలో దిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి.

* కొత్త మెట్రో విధానంలో మెట్రోలైన్‌కు అటూ, ఇటూ 5 కి.మీ. దూరం నుంచి అనుసంధాన రవాణా ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా లాభదాయకం కాదు. అందుకు ఏర్పాటుచేసే ఫీడర్‌ బస్సుల కోసం ఎవరు పెట్టుబడి పెట్టాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆ భారాన్ని భరించాల్సి ఉంటుంది. కొత్త విధానంలో చెప్పిన అంశాలు కాగితాలపై బాగా అనిపించినా వాస్తవంగా అమలు సాధ్యం కాదు. మెట్రో లాభదాయక వ్యాపారం కాదు కాబట్టి వీటిని చేపట్టడానికి ప్రైవేటు పార్టీలెవ్వరూ ముందుకురారు. పెట్టుబడిపై కనీసం 12-15% లాభం ఉంటేనే ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తారు. కానీ మెట్రోలో లాభం గరిష్ఠంగా 1.5నుంచి 2శాతం వరకు మాత్రమే ఉంటుంది. కొత్త విధానంలో ఎకనమిక్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 14% ఉండాలన్న నిబంధనను చేరుకోవడం పెద్దకష్టమేమీ కాదు. ఇదివరకు పెట్టిన పెట్టుబడిపై 8% లాభం ఉండాలన్న నిబంధన ఉండేదని, ఇప్పుడు చెప్పిన ఎనమిక్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌ ప్రకారం మొత్తం సమాజానికి చేకూరే ప్రయోజనాన్ని రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ కింద పరిగణిస్తారు. మెట్రోప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత తగ్గే కాలుష్యం, రోడ్డు ప్రమాదాలన్నింటినీ లెక్కించి విలువ కడతారు.

హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే 
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏమాత్రం లాభదాయకం కాబోదు.. దాని ఆపరేషన్‌ మొదలుపెట్టిన నాటి నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో బ్యాంకులకు రుణాల చెల్లింపు మొదలుపెట్టాల్సి ఉంటుంది. అందుకే అది ఆపరేషన్స్‌ ప్రారంభించడానికి జంకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు పలుసార్లు అడ్డంకులు కల్పించిందని అందుకు తగిన నష్టాన్ని చెల్లించాలని ఎల్‌అండ్‌టీ డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. పీపీపీ మోడల్‌ విజయవంతం కాదనడానికి హైదరాబాద్‌ మెట్రో ఒక ఉదాహరణ. అక్కడ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కోసం 300 ఎకరాల భూమి ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆస్తుల విలువలు తగ్గడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ ద్వారా లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే ప్రాజెక్టు ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత కూడా ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోలో కనీసం ఒక సెక్షన్‌ను కూడా ప్రారంభించడానికి సాహసం చేయడంలేదు. భవిష్యత్తులో అది ఆపరేషన్స్‌ మొదలుపెట్టే పరిస్థితి లేకపోతే ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది.

వ్యక్తిగత కారణాలవల్లే రాజీనామా..
ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ సలహాదారు పదవికి నెలక్రితమే తాను రాజీనామా చేశా. వయోభారం కారణంగా దూరప్రాంతాలకు తరచూ ప్రయాణం చేయలేకపోతున్నందునే రాజీనామా సమర్పించా. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఈ రాజీనామా చేశా. ఇతరత్రా కారణాలేమీ లేవు.
Link to comment
Share on other sites

విజయవాడలో లైట్‌మెట్రోకి వెళ్లడం అవివేకం 
విశాఖ మెట్రో మరింత ఆలస్యమయ్యే అవకాశం 
హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే 

bl@stbl@st

Link to comment
Share on other sites

7 minutes ago, JANASENA said:

only Hyd metro will be operational within Next decade. Vij & yzag ki metro will be only on papers and election manifesto LoL.1qLoL.1qLoL.1q

HYD ee, Next decade ante, inka VZA, and VZG metro ani ads easisn comedy ga vuntadi 

Link to comment
Share on other sites

14 minutes ago, JANASENA said:

only Hyd metro will be operational within Next decade. Vij & yzag ki metro will be only on papers and election manifesto LoL.1qLoL.1qLoL.1q

apatlo edo annaru ga...fast trainu...doosukelle trainu...ochestundi mana bezawada ki ani...inka metro endku? 

Link to comment
Share on other sites

39 minutes ago, TampaChinnodu said:
కొత్త ‘మెట్రో’ అమలు చాలా కష్టం 
ప్రైవేటు భాగస్వాములు ముందుకురారు 
విజయవాడలో లైట్‌మెట్రోకి వెళ్లడం అవివేకం 
విశాఖ మెట్రో మరింత ఆలస్యమయ్యే అవకాశం 
హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే 
అందుకే ఎల్‌అండ్‌టీ వాయిదా వేస్తూ పోతోంది 
‘ఈనాడు’తో మెట్రోమ్యాన్‌ ఇ.శ్రీధరన్‌ 
ఈనాడు - దిల్లీ

17state2a.jpgకేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త మెట్రో విధానం కింద కొత్తగా ప్రాజెక్టులు ఆమోదం పొందడం చాలా కష్టమని మెట్రోమాన్‌ ఇ.శ్రీధరన్‌ పేర్కొన్నారు. ఆచరణలో దీన్ని అమలు చేయడం కష్టమని వ్యాఖ్యానించారు. మెట్రో రవాణా లాభాలతో కూడుకున్న వ్యాపారం కాదు కాబట్టి ప్రైవేటు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావన్నారు. కొత్త మెట్రోరైల్‌ విధానం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుల భవిష్యత్తుపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ప్రస్తుతం కొత్త విధానం వచ్చినా విజయవాడ మెట్రోప్రాజెక్టును మాత్రం పాత విధానం ప్రకారమే కొనసాగించడానికి అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

* విశాఖపట్నం మెట్రోపై మాత్రం మళ్లీ కొత్తగా అధ్యయనం చేసి, డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేయాల్సి వస్తుంది.. అందుకు కనీసం ఆరేడు నెలల సమయం పడుతుంది.

* కొత్త మెట్రో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో విజయవాడ మెట్రోకూ ప్రైవేటు భాగస్వామిని గుర్తించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది.. ఈ విధానంలో సామాజిక ప్రభావ మధింపు తప్పనిసరి చేసినందున ప్రాజెక్టులు మంజూరు చేయకుండా తప్పించుకోవడానికి ఆ నిబంధన వీలు కల్పిస్తుంది.

* విజయవాడకు మెట్రో స్థానంలో లైట్‌రైల్‌ టెక్నాలజీ విధానాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. లైట్‌రైల్‌ విధానం అంటే ట్రామ్‌ వే లాగా ఉంటుంది., అటువైపు మళ్లడం అవివేకమే. ఇప్పటికే ఆమోదం పొందిన మెట్రోరైల్‌ ప్రాజెక్టుకే ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. విజయవాడ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో ఉండటం, చంద్రబాబుకున్న రాజకీయ పలుకుబడి దృష్ట్యా సాధారణ మెట్రో ప్రాజెక్టు అక్కడ చేపట్టడానికి అవకాశం ఉంది. లైట్‌ రైల్‌ టెక్నాలజీకి మళ్లితే మాత్రం అందుకు చాలా సమయం పడుతుంది.. వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలాంటి నగరాలకు ఈ విధానం సరిపోదు. లైట్‌ రైల్‌ టెక్నాలజీ సామర్థ్యం సాధారణ మెట్రో కంటే 50% తక్కువ ఉంటుంది. పైగా మెట్రోతో పోల్చుకుంటే దాని నిర్మాణానికయ్యే ఖర్చులో తేడా పెద్దగా ఉండదు. ప్రయాణికుల రవాణా సామర్థ్యంలోనూ దాదాపు 50% తేడా ఉంటుంది. మెట్రో ప్రాజెక్టులను వందేళ్లను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తుంటారు. వచ్చే వందేళ్లలో విజయవాడ చాలా పెద్దనగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున సాధారణ మెట్రోప్రాజెక్టు నిర్మాణం చేపట్టడమే ఉత్తమం. ఈ విషయంలో దిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి.

* కొత్త మెట్రో విధానంలో మెట్రోలైన్‌కు అటూ, ఇటూ 5 కి.మీ. దూరం నుంచి అనుసంధాన రవాణా ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా లాభదాయకం కాదు. అందుకు ఏర్పాటుచేసే ఫీడర్‌ బస్సుల కోసం ఎవరు పెట్టుబడి పెట్టాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆ భారాన్ని భరించాల్సి ఉంటుంది. కొత్త విధానంలో చెప్పిన అంశాలు కాగితాలపై బాగా అనిపించినా వాస్తవంగా అమలు సాధ్యం కాదు. మెట్రో లాభదాయక వ్యాపారం కాదు కాబట్టి వీటిని చేపట్టడానికి ప్రైవేటు పార్టీలెవ్వరూ ముందుకురారు. పెట్టుబడిపై కనీసం 12-15% లాభం ఉంటేనే ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తారు. కానీ మెట్రోలో లాభం గరిష్ఠంగా 1.5నుంచి 2శాతం వరకు మాత్రమే ఉంటుంది. కొత్త విధానంలో ఎకనమిక్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ 14% ఉండాలన్న నిబంధనను చేరుకోవడం పెద్దకష్టమేమీ కాదు. ఇదివరకు పెట్టిన పెట్టుబడిపై 8% లాభం ఉండాలన్న నిబంధన ఉండేదని, ఇప్పుడు చెప్పిన ఎనమిక్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్స్‌ ప్రకారం మొత్తం సమాజానికి చేకూరే ప్రయోజనాన్ని రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ కింద పరిగణిస్తారు. మెట్రోప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత తగ్గే కాలుష్యం, రోడ్డు ప్రమాదాలన్నింటినీ లెక్కించి విలువ కడతారు.

హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే 
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏమాత్రం లాభదాయకం కాబోదు.. దాని ఆపరేషన్‌ మొదలుపెట్టిన నాటి నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో బ్యాంకులకు రుణాల చెల్లింపు మొదలుపెట్టాల్సి ఉంటుంది. అందుకే అది ఆపరేషన్స్‌ ప్రారంభించడానికి జంకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు పలుసార్లు అడ్డంకులు కల్పించిందని అందుకు తగిన నష్టాన్ని చెల్లించాలని ఎల్‌అండ్‌టీ డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. పీపీపీ మోడల్‌ విజయవంతం కాదనడానికి హైదరాబాద్‌ మెట్రో ఒక ఉదాహరణ. అక్కడ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కోసం 300 ఎకరాల భూమి ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆస్తుల విలువలు తగ్గడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ ద్వారా లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే ప్రాజెక్టు ప్రారంభించిన ఏడేళ్ల తర్వాత కూడా ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోలో కనీసం ఒక సెక్షన్‌ను కూడా ప్రారంభించడానికి సాహసం చేయడంలేదు. భవిష్యత్తులో అది ఆపరేషన్స్‌ మొదలుపెట్టే పరిస్థితి లేకపోతే ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది.

వ్యక్తిగత కారణాలవల్లే రాజీనామా..
ఆంధ్రప్రదేశ్‌ మెట్రోరైల్‌ సలహాదారు పదవికి నెలక్రితమే తాను రాజీనామా చేశా. వయోభారం కారణంగా దూరప్రాంతాలకు తరచూ ప్రయాణం చేయలేకపోతున్నందునే రాజీనామా సమర్పించా. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఈ రాజీనామా చేశా. ఇతరత్రా కారణాలేమీ లేవు.

Aaaaatcare.... maaku Hyper loop Que lo nilchundi. Maa Lokesham Babu signal kosam waiting akkada

Link to comment
Share on other sites

41 minutes ago, holycow205 said:

apatlo edo annaru ga...fast trainu...doosukelle trainu...ochestundi mana bezawada ki ani...inka metro endku? 

Direct Hyperloop ante...No tumbri metro.

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

Oh...a metro and hyper loop anni kalpitham matrame.::only PPT's varake parimitham

s....jalagannaki tv paper kalpitam inattu iyi kuda kalpitale tumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

విజయవాడలో లైట్‌మెట్రోకి వెళ్లడం అవివేకం 
విశాఖ మెట్రో మరింత ఆలస్యమయ్యే అవకాశం 
హైదరాబాద్‌ మెట్రో మొదలుపెడితే నష్టాలే 

psykoNTR

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...