Jump to content

ప్రపంచానికి విత్తన రాజధానిగా రాష్ట్రాన్ని మారుస్తాం: సీఎం


TampaChinnodu

Recommended Posts

మెగా విత్తన కేంద్రం 
ప్రపంచానికి విత్తన రాజధానిగా రాష్ట్రాన్ని మారుస్తాం: సీఎం 
సీడ్‌ పార్కుకు శంకుస్థాపన 
మూడోవిడత రుణమాఫీ ప్రారంభం 
భూగర్భ విద్యుత్తు వ్యవస్థకు భూమి పూజ 
కర్నూలు, విశాఖల్లో చంద్రబాబు పర్యటన 
9ap-main1a.jpg

కప్పుడు దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రేపటి నుంచి ప్రపంచానికి విత్తన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం కర్నూలు, విశాఖపట్నంలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని తంగడంచ గ్రామంలో మెగా సీడ్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు. అదే సభలో మూడోవిడత రైతు రుణమాఫీని ప్రకటించారు. విశాఖలో భూగర్భ విద్యుత్తు కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటుకు భూమి పూజచేశారు. తంగడంచలోని మెగా సీడ్‌ పార్కుతో 350 రకాల విత్తనాలు, 80 దేశాలతో లావాదేవీలు పెట్టుకుని విత్తన అభివృద్ధిలో నూతన విప్లవానికి శ్రీకారం చుట్టేందుకు ముందుకెళుతున్నామని చెప్పారు. హరిత విప్లవం ఆహారభద్రతనిచ్చిందని, ఇప్పుడు సరైన విత్తనం భవిష్యత్తుకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు.

చరిత్రకు శ్రీకారం చుట్టే రైతు రుణమాఫీ... మెగా సీడ్‌ పార్కు ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘అందరికీ ఆత్మసాక్షి ఉంటుంది. నేను రూ.1.50 లక్షలు రుణమాఫీ చేస్తే ఆ డబ్బులు తీసుకుని నన్ను విమర్శించే వారిని ఏమనాలో అర్థం కావడం లేదు. రైతులు దిగాలు చెందడానికి వీల్లేదని, కష్టం ఉంటే నేనే పడతా అనే ఉద్దేశంతో మూడు విడతలుగా రూ.14,700 కోట్లు ఇచ్చాం. బ్యాంకులు గతంలో సరిగా పనిచేయకపోతే 5.72 లక్షల మంది ఖాతాలను సరిచేశాం. వారికి రూ.545 కోట్లు రుణమాఫీ లబ్ధి చేకూర్చాం. రాష్ట్రంలో మరణించిన అన్నదాతలకు సైతం రూ.52 కోట్లు, కౌలు రైతులకు రూ.123 కోట్లు, గ్రూపు కౌలుదారులకు రూ.224 కోట్లు అందజేశాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఉద్యాన రైతులకు రూ.365 కోట్లు ఇచ్చాం. రుణమాఫీ అందరికీ అందడం లేదని కొంతమంది విమర్శిస్తున్నారు. అలాంటి వారికి సవాలు విసురుతున్నా. అర్హులై ఉండి... మీ రికార్డు సరిగా ఉంటే రాజకీయాలకు, కులమతాలకతీతంగా చివరి రైతు వరకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను...’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జలహారతితో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. ప్రపంచంలో అత్యున్నతమైన, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయోవా యూనివర్సిటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల కోసం వినియోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివి గత 12 సంవత్సరాలుగా అయోవా యూనివర్సిటీలో గ్లోబల్‌ పోగ్రాం లీడర్‌షిప్‌గా వ్యవహరిస్తున్న దిలీప్‌ జన్మనిచ్చిన జన్మభూమికి సేవ చేయాలని వస్తే అతన్ని విమర్శిస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.

9ap-main1b.jpg

1100కు ఫోన్‌ చేస్తే నేను చూసుకుంటా 
రుణ విముక్తి పత్రాలు పొందడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వెంటనే 1100కు ఫోన్‌ చేయాలని, వాళ్ల సంగతి తాను చూసుకుంటానని సీఎం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. ఒకప్పుడు ఐటీ రంగంపై శ్రద్ధ పెట్టానని, ప్రస్తుతం వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టానని వెల్లడించారు. విశాఖ, తిరుపతికి వెళ్లినట్లుగానే తంగడంచకు వస్తుంటానని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో పండ్ల తోటలు, వాణిజ్య పంటలు పండించాలని నిర్ణయించినట్లు చెప్పారు. నవంబరులో బిల్‌గేట్స్‌ విశాఖలో పర్యటించి వ్యవసాయంలో ఎలాంటి సాంకేతికత ఉపయోగించామో పరిశీలిస్తారని చెప్పారు. ఆ నెల 16, 17వ తేదీల్లో రెండు రోజులు ప్రపంచ స్థాయి కార్యశాల పెడతామన్నారు.

రెండు లక్షల కుటుంబాలకు సేవలు.. విశాఖలో భూగర్భ విద్యుత్తు కేబుల్‌ వ్యవస్థకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారు. విశాఖలోని 20 సబ్‌ స్టేషన్ల పరిధిలో 675 కిలోమీటర్ల పొడవున దీన్ని ఏర్పాటు చేస్తున్నారని, రెండు లక్షల కుటుంబాలకు సేవలందనున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో విద్యుత్తు స్తంభాలతో అవసరం ఉండదన్నారు. హుద్‌హుద్‌ పెను తుపానుకు దెబ్బతిన్న నగరాన్ని విశాఖ ప్రజలు తక్కువ కాలంలోనే బ్రహ్మాండంగా మార్చుకున్నారని అభినందించారు. ఈ వ్యవస్థ వల్ల భవిష్యత్తులో విపత్తుల వల్ల విద్యుత్తు సరఫరాకు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆంధ్రపదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ హెచ్‌.వై.దొర చెప్పారు. ప్రపంచ బ్యాంకు రూ. 720 కోట్లను మంజూరు చేసిందని, అందులో రూ. 717 కోట్లతో భూగర్భ విద్యుత్తు వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, రూ. 3 కోట్లతో పాల్ట్‌ లొకేటింగ్‌ వాహనం కొనుగోలు చేస్తామన్నారు. మంత్రులు కళా వెంకటరావు, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

9ap-main1c.jpg

విశాఖ సాగర తీరంలో ఎలాంటి శబ్దాల్లేకుండా.. విద్యుత్తు కాంతుల వెలుగులతో.. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్లో ఆనందం నింపేలా ‘ఆనంద దీపావళి’ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీనిని పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. బాణసంచా కాల్చలేని పేదలు ఆర్కేబీచ్‌కు వచ్చి ఆనంద దీపావళిలో పిల్లా పాపలతో గడిపి వెళ్లవచ్చన్నారు.

పర్యాటకానికి ప్రాధాన్యం.. ప్రపంచంలోనే ఉత్తమమైన ప్రాంతానికి చిరునామాగా విశాఖ మారాలని, ఇక్కడి పర్యాటకానికి అందరూ ప్రచారం ఇవ్వాలని ముఖ్యమంత్రిచెప్పారు. స్థానికంగా మారియట్‌ ఫెయిర్‌ ఫీల్డ్‌ హోటల్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రపంచంలో అన్నిచోట్లా దొరికే ఆహారం ఇక్కడా దొరకాలి.. అన్ని బ్రాండ్ల హోటళ్లూ రావాలని ఆయన అభిలషించారు. ఇతర నగరాల్లో కాలుష్యం, రద్దీ పెరిగిపోవడంతో పర్యావరణహితంగా ఉన్న విశాఖ వైపు అందరూ మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ భవిష్యత్తులో అన్నీ విద్యుత్తు ఆధారిత వాహనాలు తిరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోటల్‌ యజమాని కనుమూరి సుబ్బరాజును ముఖ్యమంత్రి అభినందించారు. హోటల్‌ తాళాన్ని మారియట్‌ హోటల్స్‌ సౌత్‌ ఇండియా మార్కెటింగ్‌ హెడ్‌ విక్రమ్‌ చౌబాల్‌తో కలిసి ఈడీ రమేష్‌రాజుకు అందించారు.

Link to comment
Share on other sites

Quote

‘‘అందరికీ ఆత్మసాక్షి ఉంటుంది. నేను రూ.1.50 లక్షలు రుణమాఫీ చేస్తే ఆ డబ్బులు తీసుకుని నన్ను విమర్శించే వారిని ఏమనాలో అర్థం కావడం లేదు.

Bad Bad AP People. endi man god lanti CBN ni thidathara. mee mohal manda. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...