Jump to content

Hyderabad Metro


mahesh1

Recommended Posts

8 hours ago, mettastar said:

Rs.10 to 60 unayi tickets.. RTC avi etla untayo.. 

శ్లాబుల్లోనే మతలబు 
దిల్లీ, బెంగళూరు మెట్రోలతో పోల్చితే ఎక్కువే 
  తక్కువ దూరాలకే ఎక్కువ ఛార్జీ 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 
25story3a.jpg

దిల్లీ, బెంగళూరు మెట్రోలతో పోల్చితే హైదరాబాద్‌ మెట్రో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. దిల్లీ మెట్రోలో ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.15 టికెట్‌ కొనాలి. హైదరాబాద్‌ మెట్రోలో రూ.25 టికెట్‌ తీసుకోవాలి. అంటే రూ.10 అదనంగా చెల్లించాలన్న మాట. దిల్లీ మెట్రోలో 12 కి.మీ. ప్రయాణానికి రూ.20, హైదరాబాద్‌లో రూ.40. దిల్లీలో 21 కి.మీ.కి రూ.30 కాగా హైదరాబాద్‌లో రూ.50 ఖర్చు చేయాలి. బెంగళూరు మెట్రోతో పోల్చినా హైదరాబాద్‌ మెట్రో రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. బెంగళూరు మెట్రోలో కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.48. ఇక్కడ 42 కి.మీ. దూరంలో మెట్రో తిరుగుతోంది. హైదరాబాద్‌లో 26 కి.మీ. దాటితే రూ.60 పెట్టాల్సిందే. తెలంగాణ ఆర్టీసీ ఏసీ బస్సులతో పోల్చితే మాత్రం రేట్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. మియాపూర్‌ నుంచి ఆర్టీసీ ఏసీ బస్సులో అమీర్‌పేట వరకు ప్రయాణిస్తే రూ.48 ఛార్జీ. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట మీదుగా ఉప్పల్‌ వరకు ఏసీ బస్సులు లేవు. ఒకవేళ నడిపితే ఛార్జీ రూ.96 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మెట్రోలో ప్రయాణానికి రూ.60 చెల్లిస్తే సరిపోతుంది.

ఇదీ ఆర్టీసీ అధికారుల విశ్లేషణ 
మియాపూర్‌ నుంచి నాగోల్‌ వరకు మెట్రోలో వెళ్లి తిరిగి రావాలంటే రూ.120 అవుతుంది. మెట్రో స్టేషన్‌ నుంచి ఆరేడు కి.మీ.దూరంలో ఉండేవారు స్టేషన్‌కు ద్విచక్రవాహనంపై వచ్చి పార్కింగ్‌ చేస్తే పార్కింగ్‌ ఛార్జి రూ.30. మియాపూర్‌ నుంచి నాగోలులో మెట్రో దిగి మరో రెండు, మూడు కి.మీ.పని మీద వెళ్లి రావాలంటే ఆటోకు రూ.30. ఇలా మెట్రోలో మియాపూర్‌వాసి నాగోలు వెళ్లి రావడానికి మొత్తం రూ.180 అవుతుందని తమ అంతర్గత విశ్లేషణలో తేలిందని ఆర్టీసీ అధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ఒక కుటుంబంలో ఇద్దరు మెట్రోలో వెళ్లి వస్తే రూ.400 ఖర్చవుతుందన్నారు. తమ నాన్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఇదే దూరం ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.35 ఛార్జి అని, అంటే ఒక్కో ప్రయాణికుడికి రూ.145 ఆదా అవుతుందని చెప్పారు. దీన్నిబట్టి ఈ రూట్‌లో తమ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు ఆదరణ తగ్గదని ధీమా వ్యక్తం చేశారు.

దిల్లీలో రేట్లు పెరిగాక తగ్గిన ప్రయాణికులు 
దిల్లీ మెట్రోలో ఇటీవల రేట్లు పెంచడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీవాసులకు మెట్రో ఎంతో సౌకర్యవంతంగా ఉంది. అయినా కూడా రేట్లు పెంచిన తర్వాత మూడు లక్షల మందికిపైగా ప్రయాణికులు తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దిల్లీలో పెరిగిన రేట్ల కంటే కూడా హైదరాబాద్‌ మెట్రోలో కొన్ని స్లాబుల్లో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. 
మరింత పెంచాలనుకున్నా వద్దన్న కేటీఆర్‌: హైదరాబాద్‌ మెట్రో నిర్మాణానికి రూ.5 వేల కోట్లు అదనంగా ఖర్చయిందని, అందువల్ల టికెట్‌ రేట్లు ఇతర మెట్రోలతో పోల్చితే కాస్త అధికంగానే ఉండాలని ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దిల్లీ మెట్రోలో టికెట్‌ రేట్లు పెరిగితే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో రేట్లు తక్కువగానే ఉండాలని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. మొదటిసారి సమర్పించిన రేట్లలో ఆయన ఒత్తిడి మేరకు కొంత తగ్గించి ఎట్టకేలకు శనివారం రాత్రి విడుదల చేశారు.

Link to comment
Share on other sites

Quote

దిల్లీలో పెరిగిన రేట్ల కంటే కూడా హైదరాబాద్‌ మెట్రోలో కొన్ని స్లాబుల్లో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. 

No Parking at stations and cost is also not cheap. Getting doubts on kind of acceptance it will get.

Link to comment
Share on other sites

3 hours ago, boeing747 said:

adenti, parking undi anukunna...anni stations lo ide scene aa or konni stations ki parking unda?

Anni chotla ready avvalenattundi it will take time to get settled...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...