Jump to content

రూ.24 వేల కోట్ల నష్టం


TampaChinnodu

Recommended Posts

రూ.24 వేల కోట్ల నష్టం 
15వ ఆర్థిక సంఘం ప్రస్తుత విధివిధానాలతో ఎక్కువ కోల్పోయేది ఏపీయే 
2011 జనాభా లెక్కలు మా పాలిట శాపం 
దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో యనమల ఆందోళన 
తదుపరి సమావేశం విశాఖలో నిర్వహించాలని నిర్ణయం 
10ap-main4a.jpg

ఈనాడు, దిల్లీ: 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను యథాతథంగా కొనసాగిస్తే వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రూ.24,340 కోట్లు నష్టపోనుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మరే రాష్ట్రమూ ఈ స్థాయిలో ఆర్థిక వనరులను కోల్పోయే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను మార్చాలని డిమాండు చేస్తూ మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర కూడా హాజరయ్యారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటాకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే 10ap-main4b.jpgఆంధ్రప్రదేశ్‌ వాటా 4.308 శాతం నుంచి 3.692 శాతానికి తగ్గిపోతుందని, దీనివల్ల తాము 0.616 శాతం వనరులను కోల్పోవాల్సి వస్తుందని మంత్రి యనమల వాపోయారు. ఈ నష్టం ఏటా సగటున రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. 1971-81 నుంచి 2001-11 మధ్యకాలంలో రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 20.53శాతం నుంచి 9.21శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. 2011 జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ప్రకటించిన విధి విధానాలన్నీ రద్దు చేసి, వాటి స్థానంలో రాష్ట్రాలతో మాట్లాడి కొత్త వాటిని రూపొందించే అధికారాన్ని పూర్తిగా ఆర్థిక సంఘానికే  వదిలిపెట్టాలని డిమాండు చేశారు. తదుపరి ఆర్థిక మంత్రుల సదస్సును ఈ నెలాఖరులోగానీ, మే నెల మొదటివారంలోగానీ విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించారు. దానిని కేవలం దక్షిణాది ఆర్థిక మంత్రులకే పరిమితం చేయకుండా 15వ ఆర్థిక సంఘం విధివిధానాలతో సమస్యలున్న అన్ని రాష్ట్రాలనూ ఆహ్వానించాలని నిర్ణయించారు. అందులో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారు.

యనమల ఇంకా ఏమన్నారంటే.. 
* రాష్ట్రాలకు రెవెన్యూ లోటు ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై అధ్యయనం చేసే బాధ్యతను 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో చేర్చడం సరికాదు. ఒకవైపు రాజధాని లేమిని, మరోవైపు రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలకు ఇది గొడ్డలిపెట్టు. 
* బహిరంగ మార్కెట్‌ నుంచి తెచ్చే రుణాలన్నింటినీ ఆస్తుల కల్పన కోసమే (మూలధన వ్యయం) ఖర్చు పెట్టాలి. రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఆ మేరకు కేంద్రం చేయూత అందించాలి. 
* దేశ రుణ నిష్పత్తి జీడీపీలో 60% ఉండాలని ఎఫ్‌ఆర్‌బీఎం సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది. ఈ లక్ష్యంలో కేంద్రానికి 40%, రాష్ట్రాలకు 20% పరిమితి విధించింది. ఇలా బహుళ లక్ష్యాలు (రుణం, ఆర్థిక లోటు, ద్రవ్య లోటు) చేరుకోవడం రాష్ట్రాలకు కష్టం. జీఎస్‌డీపీలో రుణాల నిష్పత్తి 20 శాతానికి మించకూడదన్న నిబంధన కారణంగా రాష్ట్రాల ఆర్థిక విస్తరణకు ఎలాంటి వెసులుబాటూ ఉండదు. 
* పనితీరు ఆధారంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించడానికి ఉద్దేశించిన విధి విధానం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు. దాన్ని వెంటనే తొలగించాలి. ఏది ప్రజాకర్షమో చెప్పే స్పష్టమైన భాష్యం రాజ్యాంగంలో లేదు. ప్రజల నుంచి ఎన్నిక కాని ఆర్థిక సంఘం సభ్యులకు దీన్ని నిర్ధారించే అధికారం ఇవ్వడం అప్రజాస్వామికం. 
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులపై జీఎస్‌టీ ప్రభావం గురించి అధ్యయనం చేసే అధికారాన్ని ఆర్థిక సంఘానికి అప్పగించడం తగదు. 
 రాష్ట్రాల రుణాలను జీఎస్‌డీపీలో 1.7 శాతానికే పరిమితం చేయాలన్న ఎఫ్‌ఆర్‌బీఎం సమీక్ష కమిటీ సిఫార్సులు రాష్ట్రాలకు శరాఘాతం. ఈ విషయంలో కేంద్రం వాస్తవ దృక్కోణంతో ఆలోచించాలి.


15వ ఆర్థిక సంఘం విధివిధానాలు వివక్షాపూరితం వాటిని మార్చాలి 
దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు డిమాండ్‌ 
హాజరుకాని తెలంగాణ, తమిళనాడు
తిరువనంతపురం: రాష్ట్రాలకు నిధులు బదలాయించడానికి రూపొందించిన పదిహేనవ ఆర్థిక సంఘం విధివిధానాలు వివక్షాపూరితమని మూడు దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించాయి. వీటిని వెంటనే రద్దు చేసి కొత్త విధివిధానాలు రూపొందించాలని డిమాండ్‌ చేశాయి. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తున్న ఈ రాష్ట్రాలు.. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించడానికి మంగళవారం కేరళలో సమావేశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేరళ ఆర్థిక మంత్రి టి.ఎం.థామస్‌, కర్ణాటక తరఫున ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరె గౌడ హాజరయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమయిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు తమిళనాడు, తెలంగాణ హాజరు కాలేదు. కొన్ని పురోగామి రాష్ట్రాలపై వివక్ష చూపించేలా విధివిధానాలున్నాయని సదస్సు ఆరోపించింది. రాజ్యాంగంలో పొందుపర్చిన సమాఖ్య స్ఫూర్తి సూత్రానికి విరుద్ధమని పేర్కొంది. సదస్సు అనంతరం కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ విలేకర్లతో మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు కేంద్రం వాటాను తగ్గించే ప్రయత్నం జరిగిందని మంత్రులు అభిప్రాయపడ్డారని తెలిపారు. ఇదే కొనసాగనిస్తే రాష్ట్రాలు పెద్ద పురపాలక సంఘాలుగా మారతాయన్నారు. సదస్సును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు.
Link to comment
Share on other sites

5 minutes ago, SonaParv_522 said:

Kastam uncle, inko 5years ee dopidi dongalathone adjust avvali ap

Oooruko bro.. 6 months ki okasari kuda manavadani chudatqniki kuda raatle akkada raastram kosam pani chesthu.. ee dopidi gurunchi alochinche time ledhu bro

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

Oooruko bro.. 6 months ki okasari kuda manavadani chudatqniki kuda raatle akkada raastram kosam pani chesthu.. ee dopidi gurunchi alochinche time ledhu bro

 Avasaram ledu uncle, mothanike leave teesukoni manavadini, kudirithe manavaralini plan cheyyamani cheppi lokesh ki vaallathone settle avvamanu chache daaka. Ap ki pattina daridram vaduluthundi

Link to comment
Share on other sites

aa 24k crores nashtam return vachina em labam , aa money motham Worlds best idly tower Amaravarthi lone vundali ani daani kosam karchu pettesthadu.

Link to comment
Share on other sites

parliament lo NCM raakunda well lo AIADMK vallu TRS vallu racha chesaaru, ippudu ee meet ki kuda aa rendu states vallu raledhu.. Bodigaadu TRS ni grip loki thechukunnadu laa undhi chustha untey 

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

parliament lo NCM raakunda well lo AIADMK vallu TRS vallu racha chesaaru, ippudu ee meet ki kuda aa rendu states vallu raledhu.. Bodigaadu TRS ni grip loki thechukunnadu laa undhi chustha untey 

Ante tdp and ycp vaadi grip lo leva uncle?

Link to comment
Share on other sites

51 minutes ago, SonaParv_522 said:

Kastam uncle, inko 5years ee dopidi dongalathone adjust avvali ap

Akkada Kalyan babu kooda dopidi dongalu tho party nadipistunnadu 

Veedoka waste fellow same like tdp n ycp

Link to comment
Share on other sites

35 minutes ago, tom bhayya said:

parliament lo NCM raakunda well lo AIADMK vallu TRS vallu racha chesaaru, ippudu ee meet ki kuda aa rendu states vallu raledhu.. Bodigaadu TRS ni grip loki thechukunnadu laa undhi chustha untey 

Tg ki loss less than 5k crores.. 

 

Link to comment
Share on other sites

34 minutes ago, SonaParv_522 said:

Ante tdp and ycp vaadi grip lo leva uncle?

Good one... bayatiki edo natakalu thenguthunnaru kaani modi kannera chesthey idharu eda untaro

Link to comment
Share on other sites

3 hours ago, tom bhayya said:

parliament lo NCM raakunda well lo AIADMK vallu TRS vallu racha chesaaru, ippudu ee meet ki kuda aa rendu states vallu raledhu.. Bodigaadu TRS ni grip loki thechukunnadu laa undhi chustha untey 

all rounder uncle tom bhayya

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...