Jump to content

రాష్ట్రానికి నాలుగేళ్లలో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు


TampaChinnodu

Recommended Posts

మా అభివృద్ధి చూడండి 
పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండి 
  అమరావతిలో మీకు విస్తృతావకాశాలు 
  సింగపూర్‌ వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు 
  జాతీయ రాజకీయాలపై ఆసక్తిలేదని పునరుద్ఘాటన 
  రాష్ట్రానికి నాలుగేళ్లలో 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 
  ఏపీలో పెట్టుబడులకు టాటా సన్స్‌ సంస్థ ఆసక్తి 
ఈనాడు - అమరావతి 
13ap-main1a.jpg
ప్రధాని మోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. అమరావతికి  రూ.1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో ఆశలతో భాజపాతో స్నేహంగా మెలిగితే ఆశలన్నీ ఆడియాశలు చేశారు. 
- సింగపూర్‌లో చంద్రబాబు
13ap-main1b.jpg

అమరావతికి ప్రభుత్వ అతిథులుగా వచ్చి ఇక్కడ అభివృద్ధిని చూడాలని సింగపూర్‌లోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు. అభివృద్ధిని చూసి పెట్టుబడులు పెడితే అది మీకూ, మాకూ ఉభయతారకంగా ఉంటుందన్నారు. మీకు లాభాలు, మాకు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ, హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, ఆగ్రోప్రాసెసింగ్‌ వంటి రంగాల్లోను, ఓడరేవులు, విమానాశ్రయాలు, అంతర్గత జల రవాణా వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లోను పెట్టుబడులకు విశేషమైన అవకాశాలున్నాయని వివరించారు. జాతీయ రాజకీయాలపై ఆసక్తిగానీ, ఆకాంక్షగానీ తనకు లేదని, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 53 శాతం పూర్తయ్యాయని 2019 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకీ కొంత మేర జలాలు సరఫరా చేయగలమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం సింగపూర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి... ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాల్లో తీరికలేకుండా గడిపి వివిధ వేదికలపై మాట్లాడారు. ఉదయం 5.30 నుంచే కార్యక్రమాలు మొదలయ్యాయి. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌, టాటా సన్స్‌ బోర్డు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌, మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, సింగపూర్‌ రాయబారి గోపీనాథ్‌ పిళ్లైలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హిందుస్థాన్‌ టైమ్స్‌ (హెచ్‌టీ) సంస్థ నిర్వహించిన ‘హెచ్‌టీ-మింట్‌ ఆసియా లీడర్‌షిప్‌ సమ్మిట్‌’లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుతో హెచ్‌టీ ఎడిటర్‌ ఆర్‌.సుకుమార్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో సింగపూర్‌ ఉప ప్రధాని థర్మన్‌ షణ్ముగరత్నం తదితరులు పాల్గొన్నారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టుల పురోగతి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, తాజా రాజకీయాలు... ఇలా పలు అంశాలపై సుకుమార్‌, సభికులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందా? అన్న ప్రశ్నకు... ‘‘అది చర్చించడానికి ఇది వేదిక కాదు. దానిపై భారత్‌లో మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం చెప్పాలి. పురోగామి రాష్ట్రాల్ని ప్రోత్సహించాలే తప్ప శిక్షించకూడదు. దాని వల్ల వాటి సామర్థ్యం దెబ్బతింటుంది’’ అని బదులిచ్చారు. ఈ సదస్సులో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.

13ap-main1c.jpg

నేను ఓడిపోతానని ఎవరూ అనుకోలేదు 
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నేను ఓడిపోతానని ఎవరూ అనుకోలేదు. నా ఓటమిని ప్రజలూ జీర్ణించుకోలేకపోయారు. సంస్కరణల విషయంలో కాలం కంటే ముందుకి వెళ్లి ఆలోచించడం, ఉద్యోగులపై ఒత్తిడి పెంచడం, కరవు వంటివి అప్పట్లో నా ఓటమికి ముఖ్య కారణాలు. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. సంక్షేమం, అభివృద్ధి, మనోభావాల్ని (సెంటిమెంట్‌) సమన్వయం చేస్తున్నాను.

ఒక్క ఆటోమొబైల్‌ రంగాలోనే 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 
రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నాం. గత నాలుగేళ్లలోనే 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఆటోమొబైల్‌ రంగంలోనే 4 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. కియా, హీరో, ఇసుజి, అశోక్‌లేలాండ్‌, భారత్‌ ఫోర్జ్‌, అపోలో టైర్స్‌ వంటి సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తయ్యే సెల్‌ఫోన్లలో 20 శాతం మా దగ్గరే తయారవుతున్నాయి. దీన్ని 50 శాతానికి తీసుకెళ్లాలన్నది లక్ష్యం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

13ap-main1d.jpg

ఏపీతో కలసి పనిచేస్తాం: టోనీ బ్లెయిర్‌ 
ప్రపంచవ్యాప్తంగా పాలనా వ్యవస్థల్లో ఉత్తమ విధానాల అమలుపై కృషి చేస్తున్న బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సారథ్యంలోని ‘టోనీ బ్లెయిర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఛేంజ్‌’ ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. భారత్‌లో తమ సంస్థ ఇప్పటికే 200 విద్యాలయాలతో కలసి పనిచేస్తోందని, త్వరలో ఒక బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామని బ్లెయిర్‌ తెలిపారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఒక గ్రామాన్ని పరిశీలించిన జ్ఞాపకాల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయనతో సమావేశానికి ముందు సచిన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లాలో సచిన్‌ దత్తత తీసుకున్న గ్రామం అభివృద్ధిపై వారిద్దరు కాసేపు చర్చించుకున్నారు.

అవినీతి మకిలి అంటిన పార్టీలు, నేతలు మాత్రమే వారి నియంత్రణలో ఉంటారని భాజపా భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని చూసి వాళ్లు అసూయకు, అసంతృప్తికి, ఈర్ష్యకు గురయ్యారు.
- సింగపూర్‌లో చంద్రబాబు

ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో టాటా పెట్టుబడులు 
అమరావతిలో ఎలక్ట్రిక్‌ బస్సులు, కార్ల వంటి ఆధునిక రవాణా వ్యవస్థలో భాగస్వాములవుతామని టాటా సన్స్‌ బోర్డు ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ముఖ్యమంత్రితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామన్నారు.

దక్షిణాసియా డయాస్ఫోరా సదస్సుకు ఆహ్వానం 
సింగపూర్‌లో జులై, నవంబరు మాసాల్లో జరిగే రెండు అతి ముఖ్యమైన సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా చంద్రబాబుని సింగపూర్‌ ప్రభుత్వ రాయబారి (అంబాసిడర్‌-ఎట్‌-లార్జ్‌) గోపీనాథ్‌ పిళ్లై కోరారు. నవంబరులో జరిగే దక్షిణాసియా డయాస్ఫోరా సదస్సుకి తప్పనిసరిగా రావాలని ఆయన ఆహ్వానించారు. 
* ప్రాజెక్టులకు ఆర్థిక వనరులు సమకూర్చే సింగపూర్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ (ఎస్‌బీఎఫ్‌), బార్ల్కేస్‌ సంస్థలు వేరు వేరుగా నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సదస్సుల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించడానికి, లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి విస్తృత అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం సభ్యులు, ప్రతినిధులు సుమారు 200 మంది చంద్రబాబుతో సమావేశమయ్యారు. సింగపూర్‌లో తెలుగుదేశం ఫోరం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.

Link to comment
Share on other sites

Quote

ప్రధాని మోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. అమరావతికి  రూ.1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు.

40 years industry , senior most leader in India . sesedi ilanti half knowledge statements _%~

Link to comment
Share on other sites

33 minutes ago, TampaChinnodu said:

40 years industry , senior most leader in India . sesedi ilanti half knowledge statements _%~

  Quote

ప్రధాని మోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. అమరావతికి  రూ.1,500 కోట్లు మాత్రమే ఇచ్చారు.

@psycopk come here man

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

20 billion dollars ante lacha muppai vela kotlu

 

 

Mari mana pappu Gary psyco thata 18 lacha LA kotlu vachai annaru? 

Dollars lo annonce seddam anna confusion lo every PPT lo add sesthunna 'extra zero' marsipoyi vuntaaru. 

Link to comment
Share on other sites

6 minutes ago, Hydrockers said:

20 billion dollars ante lacha muppai vela kotlu

 

 

Mari mana pappu Gary psyco thata 18 lacha LA kotlu vachai annaru? 

calling @psycopk and @ariel to cross check in worlds greatest real time governance dash board on asia's biggest digital wall and confirm. 

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

calling @psycopk and @ariel to cross check in worlds greatest real time governance dash board on asia's biggest digital wall and confirm. 

eenadu lo vasthe kani vallaki kuda teliyadu....

asale ivala paper kuda raledu...

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

40 years industry , senior most leader in India . sesedi ilanti half knowledge statements _%~

Valid point ee kada bro ...modi gadu vigrahaniki 2500 cr pettadam entha varaku correct?

Link to comment
Share on other sites

2 minutes ago, nizambadnarsingyadav said:

Valid point ee kada bro ...modi gadu vigrahaniki 2500 cr pettadam entha varaku correct?

Finance[edit]

The monument is being built on a PPP model, with most of the money raised by Gujarat Government.[19] The Government of Gujarat has allotted Rs 100 crore for the project in the budget for 2012-13[20] and Rs 500 crore in 2014-15.[21] In the 2014-15 Union Budget announced on 10 July 2014, 2 billion (US$31 million) have been allocated for the construction of the statue.[22][23][24]

Link to comment
Share on other sites

11 minutes ago, nizambadnarsingyadav said:

Valid point ee kada bro ...modi gadu vigrahaniki 2500 cr pettadam entha varaku correct?

gujarat govt is spending most of the money for this project...pulkas don't know the meaning of such things keeps blabbering and compare themselves to all other things on earth and link it to special status

Link to comment
Share on other sites

9 minutes ago, TampaChinnodu said:

Finance[edit]

The monument is being built on a PPP model, with most of the money raised by Gujarat Government.[19] The Government of Gujarat has allotted Rs 100 crore for the project in the budget for 2012-13[20] and Rs 500 crore in 2014-15.[21] In the 2014-15 Union Budget announced on 10 July 2014, 2 billion (US$31 million) have been allocated for the construction of the statue.[22][23][24]

and, this is PPP model...ante consortium odu paisal vasool chestadu...anuga, kattadaniki aina motham karchu variiety of services thorugh recover sestadu...like tickets, infra leasing, tourism etc...

 

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

and, this is PPP model...ante consortium odu paisal vasool chestadu...anuga, kattadaniki aina motham karchu variiety of services thorugh recover sestadu...like tickets, infra leasing, tourism etc...

 

Exactly similar to what he is doing with farmers lands in Amaravathi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...