Jump to content

రూ.4.50 లక్షల కోట్లు పంపారు మనోళ్లు


TampaChinnodu

Recommended Posts

రూ.4.50 లక్షల కోట్లు పంపారు మనోళ్లు 
ప్రవాస భారతీయులు 2017లో పంపిన మొత్తమిది 
ప్రపంచంలోనే భారత్‌ది అగ్రస్థానం: ప్రపంచ బ్యాంక్‌ 
వాషింగ్టన్‌/దిల్లీ 
23busi1a.jpg

జీవనోపాధి నిమిత్తం విదేశాల్లో పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తులు, తాము సంపాదించిన దాంట్లో నుంచి తమ కుటుంబాలు, సన్నిహితులకు డబ్బులు పంపుతుంటారు. ఇక్కడి తమ సన్నిహితులు జీవనం సాగించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఈ నిధులు ఉపయోగ పడుతుంటాయి. ఈ రకంగా విదేశాల నుంచి భారత్‌కు గతేడాదిలో తరలివచ్చిన మొత్తం 69 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.50 లక్షల కోట్లు)కు చేరింది. ఇతర దేశాల నుంచి నగదు బదిలీ ఇంత పెద్దఎత్తున జరుగుతున్న దేశాల్లో అగ్రస్థానం మన దేశానికి దక్కింది. 2016లో తరలివచ్చిన మొత్తం 62.7 బి.డాలర్ల (సుమారు రూ.4.08 లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 9.9 శాతం అధికం. అయితే 2014లో అందుకున్న 70.4 బి.డాలర్ల కంటే తక్కువేనని ప్రపంచబ్యాంక్‌ నివేదిక వెల్లడించింది. 2015తో పోలిస్తే, 2016లో భారత్‌కు తరలివచ్చిన నగదు 8.8 శాతం తగ్గింది. ‘వలసలు, అభివృద్ధి’ పేరిట వెలువరించిన నివేదికలోని మరిన్ని అంశాలివీ..

* 2017లో తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలన్నిటికీ కలిపి, విదేశాల నుంచి బదిలీ అయిన నగదు 466 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.30.29 లక్షల కోట్లు). 2016లో బదిలీ అయిన 429 బి.డాలర్ల (సుమారు రూ.27.88 లక్షల కోట్లు) కంటే 8.5 శాతం అధికం.

* అధికాదాయం కలిగిన దేశాలతో సహా, ప్రపంచవ్యాప్తంగా బదిలీ అయిన నగదు 2017లో 613 బి.డాలర్ల (సుమారు రూ.39.84 లక్షల కోట్లు)కు చేరింది. 2016లో బదిలీ అయిన 573 బి.డాలర్ల (సుమారు రూ.37.24 లక్షల కోట్లు) కంటే 7 శాతం ఎక్కువ.

* భారత్‌ తరవాత అత్యధిక మొత్తాలు అందుకున్న దేశాల్లో చైనా (64 బి.డాలర్లు), ఫిలిప్పీన్స్‌ (33 బి.డాలర్లు), మెక్సికో (31 బి.డాలర్లు), నైజీరియా (22 బి.డాలర్లు), ఈజిప్ట్‌ (20 బి.డాలర్లు) ఉన్నాయి.

అంచనాలు మించేందుకు కారణమైన అంశాలు: 2016తో పోలిస్తే 2017లో నగదు బదిలీ అంచనాలకు మించి పెరిగేందుకు ఐరోపా, రష్యా, అమెరికాల వృద్ధే కారణమైందని నివేదిక తెలిపింది. ఇంధన ధరల పెరుగుదల, యూరో, రూబుల్‌ బలపడటం ఉపకరించాయి.

2018లో వృద్ధి కొనసాగుతుంది: అమెరికా సహా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండటం వల్ల, అంతర్జాతీయంగా నగదు బదిలీ ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. చమురు ధరలు పెరగడం వల్ల గల్ఫ్‌ దేశాలకు సానుకూలంగా పరిణమిస్తుందని పేర్కొంది. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాలకు 2017తో పోలిస్తే 4.1 శాతం అధికంగా 485 బి.డాలర్లు, అంతర్జాతీయంగా 4.6 శాతం ఎక్కువగా 642 బి.డాలర్లు బదిలీ అవుతాయని అంచనా.

బదిలీ ఖర్చు గణనీయం: అంతర్జాతీయంగా 200 డాలర్ల బదిలీకి అవుతున్న సగటు వ్యయం 2018 తొలి త్రైమాసికంలో 7.1 శాతానికి చేరింది. ఇది 3 శాతంగా ఉండాలన్నది లక్ష్యం. ఆఫ్రికా దేశాల్లో మరింత అధికంగా 9.4 శాతంగా ఉంది.

బదిలీ వ్యయం తగ్గింపునకు అవరోధాలివీ 
అధిక నష్టభయం ఉందనే కారణంతో బ్యాంకులు ఒప్పందాలు చేసుకోకపోవడం, కొన్ని ఖాతాలను మూసివేయడం, జతీయ తపాలా కార్యాలయాలు-నగదు బదిలీ సంస్థల మధ్య ప్రత్యేక ఒప్పందాల వల్ల నగదు బదిలీ ఖర్చు పెరుగుతోంది. మరింత సమర్థంగా పనిచేసే సాంకేతిక వ్యవస్థలైన ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌, క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్‌ సాంకేతికతను వినియోగించకుండా నిరోధించడం కూడా ఇందుకు కారణం.

* ఖర్చులు తగ్గితే కనుక, తమవారు పంపే నగదులో అధిక మొత్తాన్ని వారి కుటుంబసభ్యులు అందుకోగలుగుతారు. ఆర్థిక సంస్థలు ప్రత్యేక భాగస్వామ్యాలు వదిలేస్తే, ఈ రంగంలో పోటీ పెరిగి, ఖాతాదార్లకు మేలు జరుగుతుంది. 
* ఓక దేశం నుంచి మరో దేశానికి తాత్కాలిక ప్రాతిపదికన వెళ్లి పనిచేసుకుంటున్న వారు,  స్వదేశానికి నిధులు పంపడం వీలుకాదు. శాశ్వత వలసలే దీనికి పరిష్కారం. అయితే ఈ వంకతో మనుషుల అక్రమ స్మగ్లింగ్‌ పెరిగే అవకాశం ఉంది

Link to comment
Share on other sites

53 minutes ago, LastManStanding said:

Nuvvu manollu ani heading pettaku bro..nenu matter veredi expect chestunna..lol

@3$%@3$%@3$%

Neeku Kammati vaarthalu antey ishtamaa kaka?

Link to comment
Share on other sites

India Gets Its First $100 Billion Company in a Decade

 
  • TCS helped put India on the map for global technology
  • The milestone underscores the importance of tech to India
Link to comment
Share on other sites

On top of it we indians wont pay taxes in our own country

Demonitization manchi concept kani flop ayindi

Black money black money annadu modi emaindi oka rupayi black money kuda recover cheyalekapoyadu

 

Link to comment
Share on other sites

6 minutes ago, bhaigan said:

India Gets Its First $100 Billion Company in a Decade

 
 
  • TCS helped put India on the map for global technology
  • The milestone underscores the importance of tech to India

TCS vadu emo peanuts salaries isthadu

Link to comment
Share on other sites

2 hours ago, LastManStanding said:

Nuvvu manollu ani heading pettaku bro..nenu matter veredi expect chestunna..lol

nenu kuda manolle anukuni vachina ie thread ki...

confusion man...

Link to comment
Share on other sites

8 hours ago, LastManStanding said:

Nuvvu manollu ani heading pettaku bro..nenu matter veredi expect chestunna..lol

dont worry bro.. adi enta generic article ayina andulo manolla % ekkuva untadi , others kanna... manollu rocks... appatlo vachina ekkuva doctors kooda manolle.. ippudu IT la...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...