Jump to content

రూ.150కి కక్కుర్తి పడితే.. 800 కోట్లు పోయాయ్‌!


kakatiya

Recommended Posts

రూ.150కి కక్కుర్తి పడితే.. 800 కోట్లు పోయాయ్‌!

05243623BRK158.JPG

బెంగళూరు: రూ. కోట్ల అక్రమ సంపద ఉన్న ఒక వ్యక్తి నెలకు రూ.150 చెల్లించేందుకు లోభించాడు. దీంతో అతని బండారం మొత్తం బయటపడి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చేరింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో 150ఏళ్ల చరిత్ర ఉన్న ది బౌరింగ్‌ క్లబ్‌లోని‌ బ్యాడ్మింటన్‌ రూమ్‌ లాకర్లలో రూ.800 కోట్లకుపైగా సంపద బయటపడింది. ఇదీ బెంగళూరులోని బౌరింగ్‌ క్లబ్‌లో బయటపడిన సంపద వెనుక అసలు కథ..

బౌరింగ్‌‌ క్లబ్‌లో బ్యాడ్మింటన్‌ రూమ్‌లో సభ్యుల కోసం పెద్దసంఖ్యలో లాకర్లను ఏర్పాటు చేశారు. వీటికి నెలకు ఒక్కో లాకర్‌కు రూ.5 వసూలు చేసేవారు. ఇటీవల దానిని నెలకు రూ.50కు పెంచారు. ఇక్కడ అవినాష్‌ అమర్‌లాల్‌ కుఖ్రేజా పేరుతో మూడు లాకర్లు ఉన్నాయి. ఆయన గత కొన్ని నెలలుగా లాకర్ల రుసుం చెల్లించడంలేదు. పలుమార్లు క్లబ్‌ సిబ్బంది ఆయన్ను డబ్బు అడిగినా స్పందించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిబ్బంది శుక్రవారం నాడు ఆ మూడు లాకర్ల వేరొకరికి కేటాయించేందుకు తాళాలను బద్దలుకొట్టారు. లాకర్లు తెరిచిన సిబ్బంది అందులోని డబ్బు, వజ్రాలు, బంగారం, ఆస్తి పత్రాలను చూసి బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులు , ఐటీ శాఖ అధికారులకు వాటిని అప్పగించారు. రూ.3.96 కోట్ల నగదు, రూ.8కోట్లు విలువైన వజ్రాలు, రూ.800 కోట్లు విలువైన ఆస్తిపత్రాలు, బ్లాంక్‌ చెక్కులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఒక్క పత్రానికి రూ.5 కోట్ల ఆఫర్‌..

ఈ విషయం తెలుసుకున్న అవినాష్‌ హుటాహుటిన అక్కడకు చేరుకొన్నాడు. కావాలంటే ఆ నగదును ఉంచుకొని ఆస్తిపత్రాలను తనకు అప్పజెప్పమని భద్రతా సిబ్బంది కాళ్లపై పడ్డాడు. అవినాష్‌ వచ్చిన కొద్ది సేపటికి మరో వ్యక్తి అక్కడకు చేరుకొని ఒక పత్రం ఇస్తే రూ.5కోట్లు ఇస్తానని భద్రతా సిబ్బందికి ఆఫర్‌ చేశాడు. కానీ వారు పోలీసులను పిలుస్తామని హెచ్చరించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అవిషనాష్‌ వెళ్లే మరో క్లబ్‌కు ఐటీ సిబ్బంది వెళ్లారు. అక్కడ కూడా తనిఖీలు చేపట్టి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.

అప్రమత్తమైన బెంగళూరులోని క్లబ్‌లు..

ఈ ఘటన తర్వాత బెంగళూరులోని మరికొన్ని క్లబ్‌లు కూడా తమ వద్ద ఎంతోకాలంగా తాళాలు వేసిఉన్న లాకర్లను తెరవాలని నిర్ణయించాయి. మరోపక్క బోయిగ్‌ క్లబ్‌ కార్యదర్శి హెచ్‌ఎస్‌.శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ మా వద్ద లాకర్ల వ్యవస్థను పునః‌ సమీక్షించాలని నిర్ణయించాం’’ అని పేర్కొన్నారు.

రాజకీయ నేతలకు బినామీ..

సింధి ప్రాంతానికి చెందిన అవినాష్‌ ఒక వ్యాపారవేత్త. అతనికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది. అతను బినామీ సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అవినాష్‌ వెనుక రాజకీయ నాయకులు, బడా అధికారులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అతనిపై మనీ లాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Link to comment
Share on other sites

3 minutes ago, Kool_SRG said:

Adendi Rs.135 ki kakurthi padinattuga think_ww

not responding from past 3 months... 150.

Link to comment
Share on other sites

1 minute ago, Biskot said:

not responding from past 3 months... 150.

Avunanuko 5 unte kattevaadu , ippudu 50 ayindi ani lite teesukunnadu ante 135 ke kakkurthi padinattu @3$%

Link to comment
Share on other sites

10 minutes ago, boeing747 said:

Dexxmma ikkada US lo undebadulu desam lo evadikanna binami ga unte chalu.. luxury life bathakochu

Ndhuku ba lockers Ni badhalu kodithe happy kada

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

Avunanuko 5 unte kattevaadu , ippudu 50 ayindi ani lite teesukunnadu ante 135 ke kakkurthi padinattu @3$%

locker lo pettali ni ane idea super undhi..............  but vadu weekly once vachi ayna update undalsinde...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...