Jump to content

ఆటో డ్రైవర్ నుంచి మేయర్ వరకు.. ఓ సామాన్యుడి రాజకీయ ప్రస్థానం


JANASENA

Recommended Posts

021122BREAK103-AUTO.JPG

పుణె: చేసే పని ఏదైనా దాని మీద శ్రద్ధ, కాస్త నైపుణ్యం ఉంటే చాలు గుర్తింపు, పదోన్నతులు వాటికవే తలుపు తడతాయన్న దానికి ప్రస్తుతం మేయర్‌గా ఎంపికైన రాహుల్ జాదవ్‌ ఓ ఉదాహరణ. ఒకప్పుడు ఆటో డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు అదే నగరానికి మేయర్‌గా ఎంపికయ్యాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయంగా ఎలా ఎదిగాడో తెలుసుకుందామా!

పుణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎన్సీపీ)‌ పార్టీదే హవా. ఇతర పార్టీలు ఆ ప్రాంతంలో గెలుపు గురించి ధీమా వ్యక్తం చేయవు. అంతలా ఆ పార్టీకి అక్కడ బలం ఉంది. ఈ క్రమంలో 2006లో రాజ్‌ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్‌)ను స్థాపించారు. ఆ సమయంలోనే రాహుల్ జాదవ్ అనే ఆటోడ్రైవర్‌ ఆ పార్టీలో చేరారు. అంతకుముందు అతను ఓ పది సంవత్సరాల పాటు ఆటో డ్రైవర్‌గా పనిచేశారు. వ్యవసాయం చేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో చేరిన దగ్గరి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
2012లో ఎంఎన్‌ఎస్‌ టికెట్ మీద కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. అయితే మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో 2017లో రాహుల్ ఎంఎన్‌ఎస్‌ను వదిలి భాజపాలో చేరిపోయాడు. భాజపా టికెట్‌పై రెండో సారి కూడా విజయం సాధించాడు. ఆ ఎన్నికల్లో ఎన్సీపీ ఓటమిపాలైంది. భాజపా విజయం సాధించి మేయర్‌ పదవిని దక్కించుకుంది. అయితే ఇటీవలే పింప్రి మేయర్ నితిన్ కాల్జే పదవీకాలం ముగిసింది. రాహుల్ మీద మంచి గురి ఉన్న భాజపా అతడినే మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. 
శనివారం మేయర్‌ పదవికి ఎన్నికలు నిర్వహించారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని జాదవ్ 80 ఓట్లతో మేయర్‌గా గెలుపొందాడు. అతడి ప్రత్యర్థి నాథేకు కేవలం 33 ఓట్లు మాత్రమే దక్కాయి. తన రాజకీయ చతురతతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోన్న రాహుల్ చదివింది కేవలం పదో తరగతి మాత్రమే. అతడి గెలుపుతో పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లలో సంతోషం వెల్లివిరిసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...