Jump to content

సురేఖకు చర్య తప్పదా?


goldflake

Recommended Posts

ముఖ్యమంత్రి కె.రోశయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి కేంద్ర బిందువుగా మారిన మాజీ మంత్రి కొండా సురేఖపై చర్య తీసుకునే దిశగా కాంగ్రెస్ అధిష్టానం యోచన చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. పార్టీలో ఉంటూ ప్రభుత్వ పథకాలను సురేఖ ఎలా విమర్శిస్తారని మంత్రులు కొంత మంది ప్రశ్నించినట్లు సమాచారం. కొండా సురేఖ తీరు పట్ల ముఖ్యమంత్రి రోశయ్య కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కాగా, పార్టీ నాయకులు చాలా మంది ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం కూడా సురేఖ తీరుపై మండిపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఆమెకు రేపోమాపో షోకాజ్ నోటీసు జారీ కావచ్చుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గట్టు రామచందర్ రావుపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో సురేఖపై కూడా చర్యలకు దిగవచ్చునని అంటున్నారు. తాను పార్టీ బాగు కోసమే మాట్లాడానని ఆమె చెప్పారు. తాను సోనియాపై విమర్శలు చేయలేదని ఆమె చెప్పారు. సురేఖ వ్యవహారంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సమీక్షించినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

×
×
  • Create New...