Jump to content

రాహుల్ అపాయింట్ మెంటు కోసం బాబు ఎదురుచూపులు


kaushalarmy

Recommended Posts

రాహుల్ అపాయింట్ మెంటు కోసం బాబు ఎదురుచూపులు

 

TDP | Chandrababu awaits Rahul’s appointment

చంద్రబాబు నాయుడు మళ్లీ ఢిల్లీ వెళ్లారు. అక్టోబరు 27న ఆయన ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లడం రెండోసారి. మొన్నసారి మోడీపైన దుమ్మెత్తి పోయడానికి పరిమితం కాగా, ఈ సారి రాహుల్ గాంధీని కలిసేందుకు వెళుతున్నారు. ప్రస్తుతం ఆయన రాహుల్ గాంధీ అపాయింట్ మెంటు కోసం అసహనంగా ఎదురుచూస్తున్నారు. మొన్న వెళ్లినపుడు చంద్రబాబు…. అనుకున్నట్లు రాహుల్ గాంధీని కలవలేకపోయారు. ఈ సారి ఎలాగైనా కలవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. బయటకు మాత్రం భాజాకి గట్టి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని, అందుకే ఈ ప్రయత్నాలన్నీ ఆయన ఎలాగూ విలేకరులకు చెబుతారు. అది వేరే సంగతి. భాజాపాకి ప్రత్యామ్నాయం అన్నది ఒక మిథ్య అన్నది తెలిసిందే.  ఇప్పటికే సీనియర్ నేతలు శరద్ పవార్, ఫారూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ వంటి వారిని కలిసేందుకు అపాయింట్ మెంట్లు తీసుకున్నారు. అయితే… రాహుల్ గాంధీని కలిసే విషయంపై చంద్రబాబుకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఏఐసీసీ అధిష్ఠానం మాత్రం చంద్రబాబు ప్రతిపాదనపై ఇంకా నోరు విప్పలేదని అధికార తెలుగుదేశం నేతలే చెబుతున్నారు.

రాహుల్ ను కలిస్తే… ఎక్కడ కలవాలి అన్నదీ బాబు తేల్చకోలేకుండా ఉన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాయంలో కలవాలా లేక రాహుల్ గాంధీ ఇంటి వద్దనే ఆయన్ను కలవాలా అన్న మీమాంస కొనసాగుతున్నది. లేదంటే… రాహుల్ గాంధీని ఆంధ్ర ప్రదేశ్ భవన్ కు ఆహ్వానించాలా అన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. అయితే… చంద్రబాబు చెప్పిన దానికి రాహుల్ తలవూపే అవకాశం లేదు. ఎంతైనా… రాహుల్ గాంధీ ఇపుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మరి. మీరే నా దగ్గరకు రండి అని రాహుల్ నిర్మొహమాటంగా చెప్పడానికే అవకాశం ఎక్కువగా ఉన్నది.

అయితే… ఏపీ భవన్ అధికారులు మాత్రం రాహుల్ గాంధీతో సన్నిహింతంగా ఉండే కాంగ్రెస్ లో ఉన్న మాజీ సీనియర్ ప్రభుత్వ అధికారితో టచ్ లో ఉన్నారట. ఇద్దరి నేతలూ… ఎక్కడ కలవాలి అన్నదానిపై వారు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్సులోని ఎస్సీ సెల్ చూస్తున్న ఈ మాజీ ప్రభుత్వ అధికారి పరిస్థితి అడకత్తెరలో పోక చక్కలా ఉందని తెలుస్తోంది. రాహుల్ గాంధీని ఏపీ భవన్ కు రమ్మని చెప్పలేరు…. అలాగని చంద్రబాబును రాహుల్ గాంధీ దగ్గరకు రమ్మని చెప్పలేరు.

సరే, పరిస్థితి ఎలాగున్నా…. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ను కలిసేందుకు అసహనంగా ఎదరుచూస్తున్నారు. జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు రాహుల్ మద్దతు సంపాదించడమే ఈ సమావేశం ఉద్దేశంగా కనిపిస్తోంది. తనకు చుక్కలు చూపిస్తున్న నరేంద్ర మోడీని ఇంటికి పంపేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నాల్లో… ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశం కీలకమని చంద్రాబాబు భావిస్తున్నారు.

కాంగ్రెస్ సాయం లేకుండా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా … మోడీని ఒంటరి చేయడం చంద్రబాబుకు అసాధ్యం. అందుకని కాంగ్రెస్సుతో సహా అన్ని పార్టీలనూ ఒక తాటిపైకి తెచ్చే బాధ్యతను చంద్రబాబే భుజానిక ఎత్తుకున్నారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడు కొన్ని త్యాగాలను చేయకతప్పదు.

Link to comment
Share on other sites

Kaboye PM e kada...dantlo tappem undi....Rahul special stuatus AP ki ivvaka poyina parledu....kutralu kutantralu aithe cheyyadu. AP ki package istadu RaGa. Jail Jagan.

 

 

Link to comment
Share on other sites

7 hours ago, ringaringa said:

erri pushpam Rahul appointment kosamu aa ne bondaa....Third front form ayyithe andulo congress vastundaa ledaa ani

addu grafics nuvu daniki bofix titleee

BJ try cheyyi

 

7 hours ago, LuciferMorningStar said:

Kaboye PM e kada...dantlo tappem undi....Rahul special stuatus AP ki ivvaka poyina parledu....kutralu kutantralu aithe cheyyadu. AP ki package istadu RaGa. Jail Jagan.

 

 

LoL.1q

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...