Jump to content

CRDA Commissioner Sridhar Face To Face Over High Court Construction Works


tacobell fan

Recommended Posts

52 minutes ago, snoww said:

Supreme Court ki December kalla finish chestham ani enduku fekaaro adagaleda reporter ?

Supreme courtki high court diff teliyanollu ela aina edustarle ani biscut esadanta

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

Supreme Court ki December kalla finish chestham ani enduku fekaaro adagaleda reporter ?

Chandrababu comments about High Court Division - Sakshi

సమయం ఇవ్వకుండా వెళ్లిపొమ్మంటే ఎలా?

మానవ వనరుల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: హైకోర్టు విభజన తీరు సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయం ఇవ్వకుండా జనవరి ఒకటినే వెళ్లిపోవాలనడంతో న్యాయవాదులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. డిసెంబర్‌ 15 కల్లా కోర్టు భవనం పూర్తవుతుందని తాము చెప్పిన మాట నిజమేనని అయినా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తే అన్నింటినీ తరలించడం కష్టమవుతుందన్నారు. సమయం ఇవ్వకుండా నాలుగు రోజుల్లోనే అంతా వెళ్లిపోవాలని చెప్పారని, ఉద్యోగులు వెళ్లడానికి మానసికంగా సిద్ధం కావాలి కదా అని ప్రశ్నించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో శుక్రవారం విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సాంస్కృతిక శాఖలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయవాడ క్యాంపు కార్యాలయం, సమీపంలోనే ఆర్‌అండ్‌బీ భవనంలో ఫైళ్లు, ఇతర కార్యాలయాలకు వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జడ్జిలు, న్యాయాధికారులకు హోటళ్లు, అపార్టుమెంట్లు, విల్లాల్లో వసతి చూస్తున్నామని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విచారణలో జాప్యం చేసేందుకే హైకోర్టు విభజన జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్టు విభజన వల్ల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. సీబీఐ కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని అప్పుడు విచారణ ప్రక్రియ మొదటికొస్తుందని చెప్పారు. ఏపీని దేశంలో భాగంగా కేంద్రం చూడటం లేదని, రాష్ట్రాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్‌ షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. కేంద్రం ఇప్పుడు రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటేనని ఆరోపించారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సమాచారం పలు ప్రెస్‌మీట్లు, ఇతర సమావేశాల్లో అన్ని విషయాలు కేంద్రానికి చెప్పామన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై వైఎస్‌ జగన్‌ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. 

జనాభా పెరగాల్సిన అవసరం ఉంది
పదేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని, ఈ రేటు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముగ్గురు పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే నిబంధనను మారుస్తామని, పంచాయతీ ఎన్నికల్లో ఈ నిబంధనను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఇంజనీరింగ్‌ కాలేజీలు, విద్యాసంస్థలు ఏర్పాటుచేయడం వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గించామని, మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, హైస్కూళ్లలో వంద శాతం ఫర్నిచర్, టాయిలెట్ల నిర్వహణకు రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. 11 ప్రైవేట్‌ యూనివర్సిటీలు రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. నాలుగున్నరేళ్లలో విద్యా రంగంలో 1.31 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అందులో స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు రూ.79.50 వేల కోట్లు, ఉన్నత విద్యకు రూ. 15 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. 

 

వైద్య రంగంలో పలు పథకాలు తెచ్చాం..
వైద్యరంగంలో 24 పథకాలను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్‌ వైద్య పరీక్ష, ముఖ్యమంత్రి బాల సురక్ష, ఈ–ఔషధి, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, మహాప్రస్థానం, ఎన్టీఆర్‌ బేబీ కిట్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఈ–ఐ కేంద్రాలు, 108 బైక్‌ అంబులెన్సులు కొత్తగా ప్రవేశపెట్టామన్నారు. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్‌ చేయడమే కాకుండా, నెలకు రూ. 2,500 పింఛన్‌ ఇస్తున్నామన్నారు. 108 సర్వీసును సంస్కరించామన్నారు. మలేరియా కేసులను తగ్గించామని, విశాఖలో మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేసి ఒకేచోట అన్ని వైద్యపరికరాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని, ఇది ప్రపంచానికే మోడల్‌ అని చెప్పారు. భవిష్యత్‌లో మరింతగా మానవ వనరులపై శ్రద్ధ పెడతామన్నారు. సేవల రంగంలో రాష్ట్రం వెనుకబడిందని, దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీలో సేవల రంగం వాటా తక్కువుగా ఉందని చెప్పారు. 

హైకోర్టు ఏర్పాటుపై చంద్రబాబు సమీక్ష 
హైకోర్టు ఏర్పాటుపై సీఎం చంద్రబాబు శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఎనిమిది కోర్టు హాళ్లు ఏర్పాటుకు అవకాశం ఉందని జీఏడీ అధికారులు చెప్పగా వెంటనే వాటిని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ బంగ్లాలో న్యాయాధికారులు, ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జడ్జిలు, న్యాయాధికారులు, ఇతర ముఖ్యులకు బస కోసం అనువైన అన్నింటినీ పరిశీలించి వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పారు. మరోవైపు రాజధానిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనంపై కాంట్రాక్టు సంస్థ, సీఆర్‌డీఏ అధికారులతో సంప్రదింపులు జరిపారు. జనవరి 22 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో అడ్వొకేట్‌ జనరల్, సీఆర్డీఏ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Link to comment
Share on other sites

15 minutes ago, Paidithalli said:

CBN ni troll chestham kani .. maree time lekunda move avvadam kashtame kadha 🤔 

December 15th ki motham anni ready ani supreme court ki cheppindi AP government October lone. 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

December 15th ki motham anni ready ani supreme court ki cheppindi AP government October lone. 

Pethai ni aape panilo undi leader ki theeraledhu bro ... lekapothe inko vijayam dhakkedhi

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

December 15th ki motham anni ready ani supreme court ki cheppindi AP government October lone. 

So dec 15th ready avtadi an septe sare 1st nunchi move avandi ani dec 26th order istara..irrespective of when it completes employeeski before hand cheppara?

Link to comment
Share on other sites

18 minutes ago, idibezwada said:

So dec 15th ready avtadi an septe sare 1st nunchi move avandi ani dec 26th order istara..irrespective of when it completes employeeski before hand cheppara?

Ask that question to AP government . why didn't they prepared employees ani

Date of this video November 5th . Where it clearly says Supreme court expects the high court to start from Jan 1st . It also asked AP government to make all the preparations for temporary housing for judges and lawyers etc

 

Link to comment
Share on other sites

15కల్లా సిద్ధం అంటూ హామీ ఇచ్చి.. 
ఎన్నికలు సమీపించిన సమయంలో జస్టిస్‌ సిటీ అంటూ ఊదరగొట్టిన శాశ్వత హైకోర్టును పక్కన పెట్టేసి తాత్కాలిక హైకోర్టును చంద్రబాబు తెరపైకి తెచ్చారు. నేలపాడులో తాత్కాలిక భవనం పనులు ప్రారంభించారు. అటు తరువాత హైకోర్టు ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టులో రాతపూర్వకంగా అఫిడవిట్‌ దాఖలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం డిసెంబర్‌ 15కల్లా నేలపాడులో తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తి అవుతుందంటూ అక్టోబర్‌ 30న హామీ ఇచ్చింది. న్యాయమూర్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ చెప్పింది. తమ హైకోర్టులో తాము పనిచేసుకుంటామని, మరో రాష్ట్ర భూ భాగంపై ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

వాస్తవాలు చెబితే మరోలా పరిస్థితి... 
చంద్రబాబు ప్రభుత్వ హామీని విశ్వాసంలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. డిసెంబర్‌ 15కల్లా ఏపీ హైకోర్టుతాత్కాలిక భవనం పూర్తయిపోతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 2019 జనవరి 1కల్లా హైకోర్టు విభజనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సిద్ధం చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 15కల్లా భవనం సిద్ధమవుతుందంటూ తప్పుడు హామీ ఇవ్వకుండా, మార్చికల్లా పూర్తి చేస్తామని వాస్తవం చెప్పి ఉంటే నేడు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులకు ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఇదే సమయంలో ఏపీ తాత్కాలిక హైకోర్టు అద్భుతస్థాయిలో నిర్మాణం జరుగుతోందని నమ్మించేందుకు ఢిల్లీలో ఏకంగా హైకోర్టు భవన నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సైతం చూపారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులను కూడా నేలపాడుకు తీసుకెళ్లారు. అందరూ ఉపయోగించే రోడ్ల ద్వారా కాకుండా ప్రత్యేక రహదారుల వెంట తీసుకెళ్లి అక్కడ ఉన్న సమస్యలేవీ వారి దృష్టికి రాకుండా జాగ్రత్త పడ్డారు. 

న్యాయమూర్తులను రోడ్డుపైకి తెచ్చిన బాబు.. 
స్వీయ, రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ అదే పంథాను అనుసరించారు. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి ఏ మాత్రం లేకపోయినా, డిసెంబర్‌ 15కల్లా సిద్ధం అవుతుందని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి ఇప్పుడు అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులను రోడ్డుపైకి తీసుకొచ్చారు. చివరకు ఎలాంటి సౌకర్యాలు లేని కోర్టులో పని చేయాల్సిన పరిస్థితిని వారికి కల్పించారు.    

Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

Nijalu chepukoleru...phekakunda vundaleru...papam employees ni balipasuvu chestunadu CBN

edo youtube and internet lo old articles vundabatti saripoyindi.

Only yellow media vundi vunte vallu cheppinde nijam anukune vallam inko source lekunda. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...