Jump to content

రూ.2 లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్‌


snoww

Recommended Posts

పద్దు పెద్దదే 

 

రూ.2 లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్‌ 
సాగునీటికే సింహభాగం 
రైతుబంధు, రుణమాఫీ, ఆసరాకు భారీగా నిధులు 
ఆర్థికశాఖకు చేరిన ప్రతిపాదనలు 
ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై కసరత్తు 
ఈనాడు - హైదరాబాద్‌

20hyd-main3a_1.jpg

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ఈసారి రెండు లక్షల కోట్ల రూపాయల మార్కు దాటనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2019-20కి ప్రవేశపెట్టే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లు దాటుతుందని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషించాయి. సొంత పన్నుల రాబడిలో నవంబరుకే 29% వృద్ధిరేటు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సొంతరాబడులు, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు సహా మొత్తం రాబడి గణనీయంగా ఉంటుందని పేర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం మాదిరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్‌ఆన్‌అకౌంట్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది. అయితే, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రతిపాదనలతోనే దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం. 2019-20 బడ్జెట్‌ ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 
ఆసరాకు రెట్టింపు.. రైతుబంధుకు పెంపు 
ఆసరా పింఛన్ల పెంపు మొత్తం, ఖరీఫ్‌ పెట్టుబడి రాయితీ సహా కీలక అంశాలు రాబోయే బడ్జెట్లో ఉంటాయి. పెట్టుబడి రాయితీని ఎకరాకు రూ.4,000 నుంచి రూ.5,000కు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. పెట్టుబడి రాయితీ పెంపుతో బడ్జెట్‌ కేటాయింపులు 20% పెరగనున్నాయి. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనే ఖరీఫ్‌ సీజన్‌ పెట్టుబడి రాయితీకి నిధులు విడుదల చేయాల్సి ఉంది. దీంతో ఈ బడ్జెట్‌లోనే ఈ నిధులను ప్రతిపాదించనున్నారు. లక్ష రూపాయల వరకూ వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బడ్జెట్‌ ప్రతిపాదనల్లో చేర్చనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల మొత్తం రెట్టింపు కానుండటం, పింఛను పొందే వయో పరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించనుండటం తెలిసిందే. ఆసరా పింఛన్ల నిధుల కేటాయింపు రూ.12 వేలకోట్లకు చేరే అవకాశం ఉందని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పేర్కొన్నారు. గృహనిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం విధానాన్ని సరళతరం చేయడంతోపాటు అర్హత కలిగిన వారికి, స్థలం ఉన్నవారికి రూ.5 నుంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కేటాయింపులపై దృష్టిసారించనున్నారు. ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల మేరకు బడ్జెట్‌ కేటాయింపులపై కసరత్తు జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

సాగునీటికి రూ.25 వేలకోట్లు

రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీరు, రైతు సంక్షేమం, బడుగు బలహీనవర్గాల సంక్షేమం.. నిధుల కేటాయింపులో అగ్ర స్థానాల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పథకాలతో పాటు ఎన్నికల హామీల అమలును పరిగణనలోకి తీసుకుని ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను రూపొందించనున్నారు. ఈ సారి రూ.25 వేల కోట్ల నిధులను నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది. బడ్జెట్‌ కేటాయింపులతో పాటు బ్యాంకుల రుణాలు రూ.10,400 కోట్లు కలిపి నీటిపారుదలశాఖకు రూ.25 వేలకోట్లను కేటాయించనున్నారు.

20hyd-main3b_1.jpg

Link to comment
Share on other sites

చెప్పినవన్నీ చేస్తం 

 

అవసరమైతే కొత్త నిర్ణయాలూ తీసుకుంటాం 
ఏప్రిల్‌ నుంచి ఆసరా సాయం పెంపు 
వచ్చే సీజన్‌ నుంచి రైతుబంధు సాయమూ పెంపుదల 
నిరుద్యోగ భృతికి మరో అయిదారు నెలల సమయం 
కౌలురైతులకు భూ యజమానులే సాయమందించాలి 
ఇప్పటి నుంచే విపక్షాల రాద్ధాంతం వద్దు 
ఈ సారి రూ.24 వేల కోట్ల రుణమాఫీ 
మార్చి నాటికి ఇంటింటికీ ‘మిషన్‌ భగీరథ’ 
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

20hyd-main1a_2.jpg

రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీని అమలుచేస్తాం. గత ప్రభుత్వ కాలంలో రూ.17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాం. ఈసారి రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తాం. దీనిపై విధివిధానాలరూపకల్పన జరుగుతోంది. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకం. మా ప్రభుత్వం దాన్ని యథాతథంగా అమలు చేసింది. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీనే బాగుంది. అందుకే ఆయుష్మాన్‌ భారత్‌లో చేరబోమని ప్రధానికి చెప్పాం.  కారం, పసుపు, నూనె ఆఖరికి పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఈ బెడద పోవాలంటే మంచి బ్రాండ్‌ తీసుకొచ్చేలా పాటుపడతాం. విజయ డెయిరీ, లిజ్జత్‌ పాపడ్‌ కంపెనీల మాదిరి చేస్తాం. పంట కాలనీలు, ఆహారశుద్ధి పరిశ్రమలపై అధ్యయనం జరుగుతోంది.

న్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను నూటికి నూరుశాతం నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. రైతుబంధు సాయం, ఆసరా పింఛన్ల పెంపు వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని.. నిరుద్యోగ భృతి అమలుకు మరో అయిదారు నెలల సమయం పడుతుందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్నికల ప్రణాళికలోలేని 76 పథకాలనూ అమలు చేశామన్నారు. ఈ సారి కూడా హామీలేగాక ప్రజావసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన హామీలపై ఇప్పటి నుంచే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని సూచించారు. ఆదివారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరందిస్తామని.. తొలుత ప్రతి కొత్త పంచాయతీకీ తారు రోడ్లు వేస్తామన్నారు. పోడు, అటవీ భూముల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టంచేశారు. భవిష్యత్‌లో అటవీ ఆక్రణమలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగానే పనులు, సంస్కరణల్లో వేగం పెరుగుతుందని తెలిపారు. 
సాగునీటికి పెద్దపీట 
‘‘తెరాస ప్రభుత్వ పాలన చూసి ప్రజలు తిరిగి అఖండ మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. వారికి కృతజ్ఞతలు. గవర్నర్‌ ప్రసంగం బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగంలా ఉందని కొంతమంది అన్నారు. వారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కేసీఆర్‌ ప్రసంగాన్ని ఆమోదించి.. ఏ పార్టీ ప్రభుత్వాన్నైతే ప్రజలు గెలిపించారో, ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక, అదే విధానం గవర్నర్‌ ప్రసంగంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం నీటిపారుదలే. రానున్న మూడేళ్లలో కోటి 25 లక్షల ఎకరాలకు నీరందించబోతున్నాం. సాగునీటి ప్రాజెక్టులపై ఇప్పటి వరకు రూ.99 వేల కోట్లు ఖర్చు పెట్టాం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.లక్షా 17 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మనకు కేటాయించిన నీటి వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. మార్చినాటికి మిషన్‌ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికీ చేరుతాయి. 
రుణమాఫీ 
రాష్ట్రంలో చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా రూ. లక్ష వరకు వ్యవసాయ రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తాం. రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని మేం చెప్పాం. కాంగ్రెస్‌ ఏకమొత్తంలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పింది. అయినా ప్రజలు మాపైనే విశ్వాసం ఉంచారు. ఏకమొత్తంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పంజాబ్‌లోనూ చెప్పింది. ఈ రోజుకు కూడా అక్కడ అమలు కాలేదు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు ఉత్త సంతకాలు మాత్రమే చేశాయి తప్ప ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గతంలో కొన్నిచోట్ల బ్యాంకుల నుంచి వచ్చిన ఇబ్బందులు ఈ సారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. రైతు ఎలా మరణించినా 10 రోజుల్లో పరిహారం చెల్లిస్తున్నాం. ఇప్పటికే 6,062 మంది కుటుంబాలకు రైతు బీమా అందింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరించి 45 వేలకు పైగా ఉన్న మహిళా సంఘాలను పాత్రధారులుగా చేస్తాం. ఆహార శుద్ధి యూనిట్లను ప్రతి నియోజకవర్గంలో నెలకొల్పి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగిస్తాం. 
భూరికార్డుల ప్రక్షాళన 
భూరికార్డుల ప్రక్షాళనను వందశాతం పూర్తి చేసి తీరుతాం. త్వరలో ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. తహసీల్దార్‌ ఆఫీసులోనే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. బ్యాంకులు వెబ్‌సైట్‌ చూసి రుణాలు ఇచ్చే రోజులు వస్తాయి. కౌలు రైతులకు రైతుబంధు సాయం గురించి అడుగుతున్నారు. కానీ, సాయం చేయడం సాధ్యం కాదు. రైతులకు మేం సాయం చేస్తున్నందున కౌలుదార్లసంక్షేమాన్ని వారు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో 12481 గ్రామాలున్నాయి. కొత్తగా గ్రామ పంచాయతీలు వచ్చాయి. తండాలు, గూడేలు కూడా పంచాయతీలయ్యాయి. వీటన్నింటికీ తారు (బీటీ) రోడ్లు వేస్తాం. పాత రోడ్లు అద్దాల్లా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తాం. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వాటి అవసరాలపై సర్పంచులు, కార్యదర్శులతో అధ్యయనం చేయిస్తాం. 
కేంద్రం పైసా ఇవ్వలేదు 
మిషన్‌ కాకతీయ, భగీరథలకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది. కానీ, కేంద్రం మనకు రూ.24 కూడా ఇవ్వలేదు. కేసీఆర్‌ కిట్‌ పథకంలో కేంద్రం వాటా పైసా కూడా లేదు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణ సమకూర్చుకునే ఆదాయం, పెట్టే ఖర్చు రూ.10 లక్షల కోట్లపైనే ఉంటుంది. ఈ ఐదేళ్లలో 2 లక్షల 40 వేల కోట్లు అప్పు చెల్లించాలి. నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లకుపైగా నిధులు అభివృద్ధి పనులకు ఉంటాయి. 
దేశంలోనే అగ్రస్థానం 
ఆర్థిక ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వరుసగా నాలుగేళ్లు 17.17 వృద్ధి రేటు సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 29.93 వృద్ధి రేటు ఉంది. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. చాలా మంచి ఉద్దేశంతో ఎవరూ అడగకుండానే కంటివెలుగు కార్యక్రమం చేపట్టాం. ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి కంటి పరీక్షలు జరిగాయి. కంటివెలుగును సునేత్ర పేరుతో అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు  ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పథకంలో కొందరికి కళ్లు పోయాయని దుష్ప్రచారం చేశారు. అసలు కంటి వెలుగులో ఇంతవరకు శస్త్రచికిత్సలే ప్రారంభించలేదు. త్వరలో చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తాం. రక్త పరీక్షలు చేసి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను తయారు చేస్తాం. 
పోడుకు ముగింపు పలకాలి 
ఇప్పటికే పోడు చేస్తున్న వారినే పరిగణనలోకి తీసుకుంటాం. కొత్తగా పోడు ఉండదు. అడవులను పరిరక్షించే బాధ్యత మనపై ఉంది. దిల్లీ లాంటి చోట్ల డబ్బులు పెట్టి ఆక్సిజన్‌ కొనుక్కునే దుస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితి భావితరాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత మనదే. అందుకే అడవుల పరిరక్షణ కోసం కఠిన చర్యలు అమలు చేస్తున్నాం. అటవీ చట్టాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. అటవీ భూములపై ఆధారపడి బతుకుతున్న గిరిజనులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. 
హామీల అమలు 
కేంద్ర బడ్జెట్‌ తర్వాతే రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుంది. పింఛన్ల పెంపు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తాం. నిరుద్యోగ భృతిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు జరుపుతాం. నిరుద్యోగుల లెక్క తేల్చాలి. దీనిపై శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. శాంతిభద్రతలు అద్భుతంగా అమలు కావడం మాకు గర్వకారణం. అతి త్వరలోనే పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ అన్ని విభాగాలను సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. పేకాట, గుడుంబా స్థావరాలు ఇప్పుడు లేవు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. త్వరలోనే ధూల్‌పేటలో పర్యటించి.. స్థానిక సమస్యలు పరిష్కరిస్తా. లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే పంచాయతీరాజ్‌ చట్టాన్ని వంద శాతం అమల్లోకి తెస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

లాటరీ పద్ధతిలో ఇళ్లు

గత ప్రభుత్వాల పాలనలో గృహనిర్మాణాలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ హయాంలో ఇళ్ల పేరుతో కుంభకోణం జరిగింది. ఒక్క మంథనిలోనే 144 శాతం ఇళ్లను నిర్మించినట్లు లెక్కలు చూపారు. మేం పారదర్శకంగా, పేదలకు మేలు చేసేలా రెండు పడక గదుల ఇళ్ల నిర్మించి ఉచితంగా ఇస్తున్నాం. కొంచెం ఆలస్యమైనా ఇళ్లు నాణ్యంగా నిర్మిస్తాం. రాష్ట్రంలో చేపట్టిన 2.60 లక్షల ఇళ్లకుగాకు హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నాం. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తాం.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...