Jump to content

రిజర్వేషన్‌ అర్హతల్లో గుజరాత్‌ మార్పులు


snoww

Recommended Posts

ఆస్తి ఎంతున్నా ఫర్వాలేదు

ఆదాయం రూ.8 లక్షలు దాటకూడదు
రిజర్వేషన్‌ అర్హతల్లో గుజరాత్‌ మార్పులు

02501brk-gujrata.jpg

ఈనాడు, దిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వారికి జనరల్‌ కేటగిరీలో విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల్లో గుజరాత్‌ ప్రభుత్వం మార్పులు చేసింది. ఆస్తితో సంబంధం లేకుండా కేవలం ఆదాయాన్ని మాత్రమే అర్హతగా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దీనివల్ల ఆస్తి ఎంత ఉన్నా వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉంటే గుజరాత్‌ విద్య, ఉద్యోగాల్లో ఈ కోటా కింద రిజర్వేషన్‌ పొందడానికి అర్హులవుతారు. కేంద్రం విధించిన అర్హతలను కేవలం కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు 1978కి ముందు గుజరాత్‌కు వచ్చి స్థిరపడిన కుటుంబాల్లోని సభ్యులకు మాత్రమే స్థానిక రిజర్వేషన్లు వర్తించేలా షరతు విధించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్టు మార్పులు చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని గుజరాత్‌ ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. 1978కి ముందే గుజరాత్‌లో స్థిరపడిన వారికే రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని విపక్ష కాంగ్రెస్‌, రాష్ట్రేతరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీని ప్రభావం గుజరాత్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వేలమంది యువతపై పడనుంది.4దశాబ్దాలుగా గుజరాత్‌లో నివసిస్తున్న వారిని మినహాయించడం అన్యాయమని ఉత్తర్‌ భారతీయ వికాస్‌ పరిషత్‌ అధ్యక్షుడు మహేష్‌సింగ్‌ కుశ్వాహ పేర్కొన్నారు. కేంద్రం ఆమోదించిన కోటా చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదని గుజరాత్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ దోషి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

10 minutes ago, snoww said:

Looks like all the states are going to manipulate this reservation % to their political benefit. 

So unfortunate. Hope some one challenges this in court.

Ayye pani kaadhu ani thelisi kuda Mukku and nakka promise chesi adhikaram loki raledha ivi anthey

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...