Jump to content

‘ఇంద్ర' లాంటి బ్లాక్‌బస్టరిస్తే భోజనం కూడా పెట్టలేదు


vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tmovienews/32342/-

‘ఇంద్ర' లాంటి బ్లాక్‌బస్టరిస్తే భోజనం కూడా పెట్టలేదు

‘నరసింహా'.. ‘నరసింహనాయుడు'.. ‘ఇంద్ర'.. లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించిన రచయిత చిన్నికృష్ణ. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న చిన్నికృష్ణ కొన్ని నెలల కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తెగ పొగిడేస్తూ వ్యాఖ్యలు చేయడం గుర్తుండే ఉంటుంది. పవన్‌కు కులం అంటే పట్టింపే లేదని.. ఆయన చాలా మంచి ఉద్దేశాలతో రాజకీయాల్లోకి వచ్చాడని.. సమాజానికి ఏదో చేయాలని పవన్ తపిస్తాడని అన్నాడు చిన్నికృష్ణ. 

ఐతే ఇప్పుడాయన స్వరం మారిపోయింది. పవన్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు చిన్నికృష్ణ. పనిలో పనిగా చిరంజీవిని సైతం చిన్నికృష్ణ విమర్శించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ వైపు మళ్లిన చిన్నికృష్ణ.. మే 23న జగన్ చారిత్రక విజయం సాధించబోతున్నాడని.. అది చూసి ఆయన ప్రత్యర్థులందరి గుండెలు పగిలిపోతాయని చిన్నికృష్ణ అన్నాడు. 

ఇటీవల భీమవరం ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యల్ని చిన్నికృష్ణ తప్పుబట్టాడు. 70 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నో రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నాడు. ఇన్నేళ్లలో తన కులం ఏంటో ఎవరికీ చెప్పాల్సి అవసరం రాలేదన్న చిన్ని కృష్ణ.. తాను కూడా కాపునే అని చెప్పాడు. 

కాపు కులస్థులకు మెగా ఫ్యామిలీ ఒక్కటే రిప్రజెంటేషన్‌ కాదు.. కాపులు అంటే రంగా, ముద్రగడ లాంటి నాయకులు ఉన్నారన్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్లో ఆల్‌ టైం హిట్ అయిన ‘ఇంద్ర' సినిమాకు కథ అందిస్తే ఏ రోజూ కనీసం భోజనం కూడా పెట్టలేదని చిన్నికృష్ణ అన్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్‌‌‌ను హీరోగా పరిచయం చేసేందుకు ‘గంగోత్రి' కథ తయారు చేయడం కోసం ఎన్నో అవకాశలు వదులుకున్నట్లు తెలిపాుడ. పవన్‌ కల్యాణ్‌కు సినిమాల పట్ల ఫోకస్‌ లేదన్న చిన్ని కృష్ణ.. ఇండస్ట్రీలో తెలుగు వారిని అతి తక్కువ గౌరవించే వ్యక్తి పవన్‌ అని విమర్శించాడు.

Link to comment
Share on other sites

19 minutes ago, caesar said:

paapam vayya Dora and Jagan.....chivariki veediki kooda baab baab baab ani paata paadi paapam thitinchaaru....but no use...

 

Avani ok maa balayya bul bul eppudu coming for canvass 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...