Jump to content

రియల్‌ బేజారు

snoww

Recommended Posts

రియల్‌ బేజారు

07172020020728n60.jpg

  • రియల్‌ ఎస్టేట్‌పై కరోనా పంజా..
  • బాగా తగ్గిన క్రయవిక్రయాలు
  • దిగివస్తున్న శివారు భూముల ధరలు
  • కార్యాలయ స్థల గిరాకీలో 43% క్షీణత
  • రిజిస్ట్రేషన్ల రాబడి సగానికి పతనం
  • తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన వివాదాలు

2019తో పోలిస్తే 2020 ప్రథమార్ధానికి హైదరాబాద్‌లో గృహ విక్రయాలు 43 శాతం క్షీణించి 4,782కు పరిమితమయ్యాయి. ఇంత తక్కువ ఇళ్లను విక్రయించడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోవడం, వలస కార్మికులు, రుణ లభ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల కొత్తగా అందుబాటులోకి వచ్చిన గృహాలు కూడా తగ్గాయి.

దిగి వస్తున్న ధరలు

హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలు ఫాంహౌ్‌సలకు ప్రత్యేకం. మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి నుంచి అరగంటలో చేరుకునే అజీజ్‌నగర్‌, నాగిరెడ్డిగూడ, హిమాయత్‌సాగర్‌, జొన్నాడ, కొల్లూరు, మహారాజ్‌పేట వంటి ప్రాంతాల్లో మొన్నటి వరకు ఎకరం రూ.కోట్లలో ఉండేది. అజీజ్‌నగర్‌లో అయితే ఎకరం భూమి రూ.5-7 కోట్లు చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఆ ధర పడిపోయింది. 3 కోట్లకు ఎకరం ఇస్తామని, అదికూడా బేరం ఆడవచ్చంటూ మార్కెట్‌లో ఉంచారు. ఇక అప్పా నుంచి 20 నిమిషాల్లో చేరుకునే మరికొన్ని గ్రామాల్లో ఎకరం భూమి రూ.కోటికి విక్రయించగా.. ఇప్పుడు 60-70 లక్షలకే ఇస్తామని అంటున్నారు. మరో నెల, రెండు నెలలు ఆగితే ఈ ధరలు మరింత దిగి వస్తాయని చెబుతున్నారు. వ్యవసాయ భూములను అమ్మే పరిస్థితి లేదు.

హైదరాబాద్‌/నార్సింగ్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ రంగంపైనా పడింది. జోరుగా పరుగులు తీస్తున్న హైదరాబాద్‌ స్థిరాస్తి వ్యాపారంపై కొవిడ్‌-19, లాక్‌డౌన్‌లు నీళ్లు చల్లాయి. కార్యాలయ స్థలం లభ్యత, గిరాకీ భారీగా మందగించగా.. ఇళ్ల విక్రయాలు పదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కరోనా కారణంగా నగరాల నుంచి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లిపోయారు.  కొత్త ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక కరోనా కారణంగా ‘వర్క్‌ఫ్రం హోం’ పెరిగింది. దీనివల్ల ఆఫీస్‌ స్పేస్‌కి డిమాండ్‌ తగ్గిపోయింది. ప్రస్తుతం మూడు, నాలుగు ఫ్లోర్‌లు ఉన్న సంస్థలు కూడా ఒక ఫ్లోర్‌తో సరిపెట్టుకోవాలని చూస్తున్నాయి. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలో ఉన్నాయి. భూములు, ఇళ్లు అమ్మేవారు, కొనేవారు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. డబ్బులు అత్యవసరం ఉన్నవాళ్లు మాత్రమే ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఉదాహరణకు ఆదిభట్ల ప్రాంతంలో ఓ వ్యక్తి తన భూమిని గజం రూ.10 వేల చొప్పున విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. కొంత మొత్తం బయానా తీసుకున్నారు. ఆలోపే కరోనా వచ్చింది. ఒప్పందం చేసుకున్న వ్యక్తి వెనక్కి తగ్గారు. ఆ భూమిని ఎవరికైనా అమ్ముకొని, తన సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరారు. భూ యజమానికీ డబ్బులు బాగా అవసరమవడంతో గత్యంతరం లేక గజం రూ.7 వేలకు అమ్మేసుకున్నారు. వాస్తవానికి అక్కడ గజం రూ.10 వేల కంటే తక్కువ ధరకు ఎవరూ అమ్మడం లేదు. ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఇక కొత్త వెంచర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 20 ఫ్లాట్లతో ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌ నిర్మించాడనుకుంటే 4,5 ఫ్లాట్లు అమ్ముడవగానే కరోనా వచ్చింది. ఫలితంగా 16 ఫ్లాట్లు అలాగే ఉండిపోయాయి. అవి అమ్ముడైతే నిర్మాణదారుడు మరో చోట వెంచర్‌ను ప్రారంభించేవాడు. కానీ, చాలా ఫ్లాట్లు అమ్ముడవకపోవడంతో డబ్బుల్లేక కొత్త ప్రాజెక్టు ప్రారంభించలేని పరిస్థితి.   

కార్యాలయ స్థల గిరాకీ కూడా..

గత ఏడాది ప్రథమార్థంతో పోలిస్తే 2020 జనవరి-జూన్‌ నెలల్లో కార్యాలయ స్థలానికి హైదరాబాదులో గిరాకీ గణనీయంగా తగ్గింది. 43 శాతం క్షీణించి 38.5 లక్షల చదరపు అడుగుల (చ.అ)నుంచి 21.8 లక్షల చ.అ.లకు తగ్గిందని. రియల్‌ ఎస్టేట్‌పై నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ శాఖ డైరెక్టర్‌ శామ్‌సన్‌ తెలిపారు.  

ఐటీ రంగం ఓకే..

గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ప్రథమార్ధానికి తయారీ రంగ కార్యాలయ స్థల గిరాకీ 63 శాతం క్షీణిస్తే.. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగంలో 47 శాతం క్షీణత నమోదైంది. కో-వర్కింగ్‌ విభాగంలో 74 శాతం తగ్గింది. ఒక్క ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలోనే కార్యాలయ స్థలం గిరాకీ 11 శాతం పెరిగింది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలం సైతం ఏడాది క్రితంతో పోలిస్తే 2020 ప్రథమార్థంలో  32 శాతం క్షీణించింది. 39.7 లక్షల చ.అ నుంచి 27 లక్షల చ.అలకు పరిమితమైంది. 

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌ జిల్లాలో 2019 ఫిబ్రవరి నుంచి జూలై 16 వరకు 30,321 రిజిస్ట్రేషన్లు జరగగా తద్వారా రూ.404.6 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది ఇదే సమయంలో 17,740 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. తద్వారా కేవలం రూ.227.22 కోట్ల ఆదాయం లభించింది.

తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన వివాదాలు

లాక్‌డౌన్‌కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లే ఇపుడు అధికంగా జరుగుతున్నాయి. కొత్తగా హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో స్థిరాస్తుల క్రయవిక్రయాలు పెద్దగా జరగడం లేదు. గతంలో స్ధిరాస్తుల క్రమవిక్రయాలకు సంబంధించి జరిగిన ఒప్పందాల్లో అనేకం ఇపుడు వివాదాలుగా మారాయి. చేతిలో డబ్బులేక కొందరు అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటున్నారు. అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చే విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల రాబడిపైనా ఈ ప్రభావం పడింది. ఉదాహరణకు రంగారెడ్డిజిల్లాలో 2019 ఫిబ్రవరి నుంచి జూలై 16 వరకు రిజిస్ట్రేషన్లశాఖకు స్థిరాస్తుల క్రయవిక్రయాల ద్వారా రూ.1208 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది ఇదే సమయంలో కేవలం రూ.656 కోట్లు మాత్రమే వచ్చింది. రంగారెడ్డిజిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరిలో 29,074 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా రూ.223 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.41 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. అలాగే మార్చిలో 22వ తేదీ నాటికి 21,469 రిజిస్ట్రేషన్లు జరగగా.. రూ.166 కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాత లాక్‌డౌన్‌ మొదలవడంతో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. ఏప్రిల్‌లో జిల్లాలో 570 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. తద్వారా రూ.4 కోట్ల ఆదాయమే లభించింది. మేలో 9,530 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక జూన్‌లో 19,980 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.136 కోట్ల ఆదాయం వచ్చింది. దీనికి కారణం లాక్‌డౌన్‌కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరగడమే. ఈ నెల 1

Link to comment
Share on other sites

Media la aithe bagane vastunayi kani realistic ga aithe peddaga tagginattu aithe ledu..

May be inkoka 4-6 months itlane financial crunch nadusthe desperation ki taggutayemo chudali

  • Upvote 2
Link to comment
Share on other sites

Commercial real estate world wide will be down for some years . TCS cheppi natu 75% work from home antey india lo commercial growth undadhu . 

Residential areas , especially speculative places will stay low for 3,4 years but old places next year ki stable avuthayi .

Best time to buy is next six months but only if the seller is desperate to get money 

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Media la aithe bagane vastunayi kani realistic ga aithe peddaga tagginattu aithe ledu..

May be inkoka 4-6 months itlane financial crunch nadusthe desperation ki taggutayemo chudali

Money avasaram unte takkuva ki ammukuntaru 

Ippudu em avasaram 

Studies levu

Pelli lu levu

Health issues unte no major operations 

Inga deniki dabbulu bulk lo ?

Ledhu ba ,chaala mandhiki money tight ga undhi , many people are trying to sell to keep business running .  Outskirts lo maree darunam ga aduguthunaru brokers 

2008 kooda same to same . Owners with no immediate need of money will hold indefinitely , only desperate people will sell 

Link to comment
Share on other sites

8 minutes ago, Hydrockers said:

Money avasaram unte takkuva ki ammukuntaru 

Ippudu em avasaram 

Studies levu

Pelli lu levu

Health issues unte no major operations 

Inga deniki dabbulu bulk lo ?

Businessmen are in desperation , especially hotel , travel , function hall owners , builders ,malls , clothes shops, cinema industry ,etc.

anthacredit and rotation meedha run avuthayi 

Banks kooda baaga tight chesayi , only option is unload assets to save business .

Link to comment
Share on other sites

6 minutes ago, Ryzen_renoir said:

Ledhu ba ,chaala mandhiki money tight ga undhi , many people are trying to sell to keep business running .  Outskirts lo maree darunam ga aduguthunaru brokers 

2008 kooda same to same . Owners with no immediate need of money will hold indefinitely , only desperate people will sell 

ekada?

Link to comment
Share on other sites

9 minutes ago, Ryzen_renoir said:

Businessmen are in desperation , especially hotel , travel , function hall owners , builders ,malls , clothes shops, cinema industry ,etc.

anthacredit and rotation meedha run avuthayi 

Banks kooda baaga tight chesayi , only option is unload assets to save business .

All these people live and earn on rotation money doing multiple businesses. Ippudu adi kashtam. 

Link to comment
Share on other sites

49 minutes ago, Ryzen_renoir said:

Ledhu ba ,chaala mandhiki money tight ga undhi , many people are trying to sell to keep business running .  Outskirts lo maree darunam ga aduguthunaru brokers 

2008 kooda same to same . Owners with no immediate need of money will hold indefinitely , only desperate people will sell 

Yeah, that's why I said waiting for the financial crunch to get tough..

Except bunch of high profile builders, migita developers antha rotation mida nadipiyalsinde...debts and interests form major component and itla delay aithe financial crunch inka severe avutundi...

2008 was kind of different..business was down but not dead infact most sectors were performing much better...but this time, almost all sectors are hit hard..

cash rotation, chittilu, mithila dandha, etc anni unorganised ae...vaatiki big hole ipudu.

Link to comment
Share on other sites

50 minutes ago, Ryzen_renoir said:

Businessmen are in desperation , especially hotel , travel , function hall owners , builders ,malls , clothes shops, cinema industry ,etc.

anthacredit and rotation meedha run avuthayi 

Banks kooda baaga tight chesayi , only option is unload assets to save business .

I think, cash crunch is going to get worst in the next 3-4 quarters.

1 rupee today will be worth 1.25 few months down the road...

Link to comment
Share on other sites

7 hours ago, Ryzen_renoir said:

Businessmen are in desperation , especially hotel , travel , function hall owners , builders ,malls , clothes shops, cinema industry ,etc.

anthacredit and rotation meedha run avuthayi 

Banks kooda baaga tight chesayi , only option is unload assets to save business .

yes true maa second cousin 

1.50 cheppina apartment ni 1.00 ki konnadu gachhibowli area lo 

5 bed or 4 bed gurtu ledu anukunta 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...