Jump to content

సెలవుపెట్టి పో లేదా సంతకం పెడతావా!


UncleSam

Recommended Posts

  • సెలవుపై వెళ్లిన శేషగిరి బాబు
  • ఆపై ఐదు రోజులకే అర్ధరాత్రి బదిలీ
  • కావలి భూ తతంగమే కారణమా!?
  • రూ.12 లక్షల భూమికి 55 లక్షలు ‘ఫిక్స్‌’
  • 115 ఎకరాల్లో 40 ఎకరాలు నేతలవే!
  • మిగిలిన రైతులతోనూ ‘కమీషన్‌’ ఒప్పందం
  • అవకతవకలున్నాయని గుర్తించిన కలెక్టర్‌
  • సంతకం చేస్తే ఇరుక్కుపోతామని ఆందోళన
  • పిలిపించి హెచ్చరించిన వైసీపీ నేతలు!
  • నెల్లూరు కలెక్టర్‌ బదిలీ వెనుక కొత్త కోణం

పేదల గూడు పేరుతో పెద్దలు కోట్లు కూడబెట్టుకునేందుకు స్కెచ్‌ గీశారు. ఇందుకు సహకరించాల్సిందిగా కలెక్టర్‌పై ఒత్తిళ్లు తెచ్చారు. ససేమిరా అనడంతో, ‘సంతకం పెడతావా... సెలవుపై వెళ్లిపోతావా!’ అని సూటిగా అడిగారు. చేయకూడని పని చేసేందుకు మనసొప్పక, ఈ ఒత్తిళ్లు భరించలేక... ఆ ఐఏఎస్‌ అధికారి సెలవుపై వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే... అర్ధరాత్రి ఆయన బదిలీ జరిగిపోయింది! నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరి బాబు బదిలీ వెనుక అధికార పార్టీ నేతల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెరవెనుక జరిగిందేమిటో మీరే చదవండి...

07182020024020n98.png

పేదల ఇళ్ల స్థలాల కోసం నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని బుడంగుంట వద్ద 35 ఎకరాలు కొనాలని అధికారులు భావించారు. ఇవన్నీ సామూహిక వ్యవసాయానికి చెందిన భూములు. ఎకరం ధర రూ.13 లక్షలుగా నిర్ణయించారు. పెద్దగా సాగుకాని భూములు కావడంతో ఇందుకు రైతులు అంగీకరించారు. ఈ భూముల పక్కనే మరో 37 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.  ఎకరం 27 లక్షలకు ఇవ్వడానికి రైతులు సమ్మతిపత్రాలు ఇచ్చారు. ఈ భూముల కొనుగోలుకు దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. ఇంతలో అధికార పార్టీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఇవి టీడీపీ సానుభూతిపరుల భూములని... వాటిని కొనడానికి వీలు లేదని అడ్డుపడ్డారు. దీనికి బదులుగా కావలి రైల్వే లైనుకు అవతలివైపు పామిడి కాలేజీ వెనుక వైపున... తిప్ప పరిధిలోని 115 ఎకరాలను ఇంటి స్థలాల కోసం ఎంపిక చేశారు. రిజిస్ర్టార్‌ ఆఫీసు రికార్డుల ప్రకారం ఈ భూమి విలువ ఎకరం రూ. 12లక్షలు మాత్రమే. అయితే... ఈ భూమిలో కొంత విస్తీర్ణానికి గతంలో ఎప్పుడో కన్వర్షన్‌ (భూ వినియోగ మార్పిడి)కు అనుమతించారు.

 

దీంతో ఆ సర్వే నంబరులో మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.24 లక్షలకు పెరిగింది. నిజానికి... వ్యవసాయానికి ఏ మాత్రం అనువుగాని ఎగుడు దిగుడు భూములవి. రిజిస్ర్టార్‌ ఆఫీసు రికార్డుల ధర ప్రకారం అమ్మాలన్నా కొనేవారు లేరు. అయినా సరే... మొత్తం 115 ఎకరాలకు ‘కన్వర్షన్‌’ భూమి ధరే ఉన్నట్లుగా చూపారు. పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించేందుకు ఎకరం ధర రూ.60 లక్షలుగా నిర్ణయించి... ఆ తర్వాత ఐదు లక్షలు తగ్గించినట్లు చెబుతూ, ఎకరం 55 లక్షలకు ఫిక్స్‌ చేశారు. ఈ 115 ఎకరాల్లో 40 ఎకరాలు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులవే అని తెలుస్తోంది. మిగిలిన 75 ఎకరాలకు సంబంధించి... రైతుకు రూ.40 లక్షలు, తమకు ‘కమీషన్‌’ రూ.15 లక్షలు వచ్చేలా కొందరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. అందుకు సమ్మతించిన రైతుల భూములనే సేకరించారని.. అంగీకరించని రైతులకు చెందిన 30 ఎకరాలను వదిలేశారని ప్రచారం జరుగుతోంది.

ససేమిరా అన్న శేషగిరి

కావలి భూముల్లో భారీ ఎత్తున కుంభకోణం జరుగుతోందని ప్రచారం జరగడం, ఫిర్యాదులు రావడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు దీనిపై దృష్టి సారించారు. సంతకం చేస్తే ఇరుక్కుపోవడం ఖాయమనే ఉద్దేశంతో ఫైలును పక్కన పెట్టారు. ఇది అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారిం ది. కొద్ది రోజుల కిందట కావలి స్థానిక నేత మరో జిల్లా ముఖ్య నాయకుడి సమక్షంలోనే కలెక్టర్‌ను అవమానించేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘ ఫైలు మీద సంతకం పెడితే పెట్టు! లేదంటే సెలవుపై వెళ్లిపో’’ అని తీవ్ర పదజాలంతో హెచ్చరించినట్లు సమాచారం. కలెక్టర్‌గా ఉన్న శేషగిరిరావు ఈనెల 8వ తేదీన సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నారు. 10వ తేదీన ఆయనకు సెలవు మంజూరైంది. ఆ తర్వాత... ఆయనను జిల్లా నుంచి పూర్తిగా పంపించేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. ఈనెల 15వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో... కలెక్టర్‌ను పంపించాలని సీఎంను కోరడం, రాత్రి పొద్దుపోయాక సంబంధిత ఉత్తర్వులు వెలువడటం జరిగిపోయింది!

రూ.50 లక్షలకు ఖరారు!

శేషగిరి బాబు సెలవుపై వెళ్లిన వెంటనే కావలి భూ బాగోతానికి సంబంధించిన ఫైలు చకచకా నడిచినట్లు తెలిసింది. ఎకరం భూమికి రూ.50 లక్షలు సిఫారసు చేస్తూ జిల్లా కేంద్రం నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. కొత్త కలెక్టర్‌ రాకముందే... మరో అధికారి ద్వారా అధికార పార్టీ నేతలు తమకు కావలసిన పని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Yes win win for raithulu and our nethas ekkuva rate ki govt tho konipinchi aa dabbulu raithulu ki raavali antey intha commission ivvali, samaanya raithulu ki kuda biryani panchuthunna Jagan anna bl@st 

Link to comment
Share on other sites

2 hours ago, tom bhayya said:

Yes win win for raithulu and our nethas ekkuva rate ki govt tho konipinchi aa dabbulu raithulu ki raavali antey intha commission ivvali, samaanya raithulu ki kuda biryani panchuthunna Jagan anna bl@st 

Exactly this is win-win situation bhayya, edi open scam edi andaru chestharu , for example edanna govt. complex lu vasthe free ga lands isthunatlu build kodatharu kondaru cut chesthe real estate boom perigi pakkana unna vallaki sambandinchina vere lands value peruguddi, etuvanti vatillo eka paksham ga velithe debba tintadu jagan, Amaravati lo inchu minchu ede scam jarigindi, YSR atuvanti pani cheyaledu opposition lo unna TDP constituency MLA's ki kuda max funds release cheyipinchevadu, really appreciate the guts of the collector

TDP sympathizers bhoomulu ayithe addukuntara, edi pakka court lo case veyachu, also court lo evaru padithe valu veyakudadu akkada unna raithulu vesthe chala strong ga untadi

edi only Andhra ke parimitham kadu, TG , TN, KA almost all states lo ituvanti scams chestharu

Link to comment
Share on other sites

31 minutes ago, bhaigan said:

edi open scam bhayya edi andaru chestharu , for example edanna govt. complex lu vasthe free ga lands isthunatlu build kodatharu kondaru cut chesthe real estate boom perigi pakkana unna vallaki sambandinchina vere lands value peruguddi, etuvanti vatillo eka paksham ga velithe debba tintadu jagan, Amaravati lo inchu minchu ede scam jarigindi, YSR atuvanti pani cheyaledu opposition lo unna TDP constituency MLA's ki kuda max funds release cheyipinchevadu, really appreciate the guts of the collector

TDP sympathizers bhoomulu ayithe addukuntara, edi pakka court lo case veyachu

edi only Andhra ke parimitham kadu, TG , TN, KA almost all states lo ituvanti scams chestharu

Em cheppalanukunnav? Okay antav? Yeddi kaadu kaabatti support antav?

Link to comment
Share on other sites

Just now, LikeShareComment said:

Em cheppalanukunnav? Okay antav? Yeddi kaadu kaabatti support antav?

cheppanu kada  "etuvanti vatillo eka paksham ga velithe debba tintadu jagan"

and also casette topics and threads lo nanu laga kandi

Link to comment
Share on other sites

26 minutes ago, bhaigan said:

cheppanu kada  "etuvanti vatillo eka paksham ga velithe debba tintadu jagan"

and also casette topics and threads lo nanu laga kandi

Okay bro

Link to comment
Share on other sites

10 minutes ago, LikeShareComment said:

Okay bro

deentlo oka twist undi eedi kani scam ani prove chesthe Amaravati lo TDP valu chesindi scam ani TDP valle oppukovalsi vasthundi

so ikkada kuda jaggu ne gelichadu correct ga kottindu

Link to comment
Share on other sites

55 minutes ago, dasari4kntr said:

maa nellore...lo intha jarugutundha....

రిజిస్ర్టార్ ఆఫీసు రికార్డుల ప్రకారం ఈ భూమి విలువ ఎకరం రూ. 12లక్షలు మాత్రమే

 

desham lo ekkada iana registration records prakaram market value unda kaka ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...