Jump to content

Development without PPT


tom bhayya

Recommended Posts

1 hour ago, tom bhayya said:

వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి

 

వచ్చే మూడేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధి జరగనుందని, ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. త్వరలో రామాయపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెడతామని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలపై ఎక్కువ శ్రద్ధపెట్టామన్నారు. చేపల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతుల కోసం 7 హార్బర్‌లను అధునాతనంగా నిర్మించనున్నామని వెల్లడించారు. మంగళవారం పారిశ్రామికవేత్తలతో జరిగిన ఆన్‌లైన్‌ సమావేశ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘45 వేల ఎకరాలలో శ్రీసిటీ తరహా సకల సదుపాయాలుండే ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లను నిర్మిస్తాం. పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రాష్ట్రంలోని అనువణువు శోధించి పరిశ్రమల ఏర్పాటులో వేగం కోసం రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్‌లుగా విభజించనున్నాం. ( ఐఎస్‌బీ ఒప్పందం చారిత్రాత్మకం : మేకపాటి)

 

ఏ పరిశ్రమ వచ్చినా ఎక్కడ ఏర్పాటు చేయాలో రూట్ మ్యాప్ కోసం క్లస్టర్లుగా విభజన జరుగుతుంది. పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులతో ముందుకెళుతున్నాం. అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్న విశాఖ ఎయిర్ పోర్టును డిసెంబర్లో నిర్మాణ పనులు చేపడతాం. రోడ్లుంటే ఎయిర్ పోర్టులు లేకపోవడం, ఎయిర్ పోర్టులుంటే పోర్టులు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు లేకుండా సమగ్రంగా అన్ని రవాణా సదుపాయాలపై శ్రద్ధ వహించాం. తిరుపతి ఎయిర్ పోర్ట్‌ను ఇంటర్నేషనల్ కార్గో హబ్‌గా, కర్నూలు ఎయిర్ పోర్ట్ త్వరలోనే ఆన్‌లైన్‌లోకి వస్తుంది. కడప విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకురానున్నాం.

విజయవాడ విమానాశ్రామాన్ని విస్తరించనున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేస్తాం. రానున్న 2-3 సంవత్సరాలలో 5 విమానాశ్రాయాలు పూర్తి సదుపాయాలతో అందుబాటులోకి వస్తాయి. ఒక్కో పోర్టుకు రూ.10వేల కోట్లలాగా...3 మేజర్ పోర్టులు, దాదాపు 2వేల కోట్లు వెచ్చించి 7 ఫిషింగ్ హార్బర్లు, 3 రాజధానులు, కారిడార్లు సిద్ధమవుతాయి. 175 నియోజకవర్గాల్లో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మారుమూల ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య లేకుండా రూ.30-40 వేల కోట్లు ఖర్చు చేసి వాటర్ గ్రిడ్ ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 3 పోర్టులు నిర్మించనుంది’’ అని వెల్లడించారు.

Development ante fb lo kajal pics ki likes kottinananta easy anukuntunnadu eedu

images?q=tbn:ANd9GcSb9pOksyGHIrIiRFqrxA4

Link to comment
Share on other sites

Just now, biscuitRAJA000 said:

Development ante fb lo kajal pics ki likes kottinananta easy anukuntunnadu eedu

images?q=tbn:ANd9GcSb9pOksyGHIrIiRFqrxA4

3 years tharavatha nellore airport lo @Aryaa uncle land ayyi kotha port city ki coastal corridor lo velli vlog create chesthaam chudu 

Link to comment
Share on other sites

27 minutes ago, anandam2012 said:

they already paid NO (baboru)?

08182020085219n69.jpg

 

విమానాశ్రయ భూముల్లో సాగు చేపట్టిన రైతులు

అమరావతిలో ప్లాట్లు అందుకోని కొందరి అసహనం

ఉలిక్కిపడిన విమానాశ్రయ అధికారులు

రైతులతో చర్చలు జరిపినా ఫలితం శూన్యం

ఓపిక నశించిందని న్యాయ పోరాటానికి సిద్ధం

 

విజయవాడ(ఆంధ్రజ్యోతి): విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తాము ఇచ్చిన భూముల్లో సాగు చేపట్టి సవాల్ విసిరారు.

 

అమరావతి భవిష్యత్తు ప్రతిష్టంభనలో పడటంతో విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులు తిరుగుబావుటా ఎగురవేశారు. విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో తిరిగి వ్యవసాయం చేయటానికి సిద్ధమయ్యారు. సాగు పనులు కూడా చేపడుతున్నారు. కొందరు రైతులు దమ్ము చేసి నారుమళ్లు కూడా వేశారు. విమానాశ్రయ స్వాధీనంలో ఉన్న ఈ భూముల్లో రైతులు సాగు చేపట్టడంతో ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సైతం ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. రైతులతో చర్చలు జరుపుతున్నా ఫలితం లేదు. 

 

నాటి హామీలన్నీ గాలికి..

రాష్ట్ర విభజనకు ముందు గన్నవరం ప్రాంతం ర్యాపిడ్‌ గ్రోత్‌ ఏరియాగా ఉంది. దీంతో ఇక్కడ రియల్‌ భూమ్‌ ఏర్పడింది. భూముల ధరలు భారీగా ఉండేవి. రిజిస్ర్టేషన్‌ రేట్లు కూడా మార్కెట్‌ విలువకు దగ్గరగా ఉండేవి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర విభజన జరగటం, టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటం జరిగింది. దీంతో విజయవాడ విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ విభజన చట్టంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూముల సమస్యను పరిష్కరించింది.

 

ఎయిర్‌పోర్టు అథారిటీకి 700 ఎకరాల భూములను అప్పగించింది. రైతులు తమ భూములు ఇవ్వటానికి మొదట నిరాకరించినా.. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో చర్చలకు సిద్ధమయ్యారు. అమరావతి రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వటంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములు అప్పగించారు. రైతులకు యాన్యుటీతో పాటు కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ ప్లాట్లు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో తమ స్వాధీనంలోకి తీసుకున్న భూముల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ విస్తరణ పనులు చేపట్టింది. గన్నవరం ప్రాంత రైతుల ప్యాకేజీలో భాగంగా రాజధానిలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ స్థలాలు, యాన్యుటీ వంటివి కల్పించే ప్రక్రియకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల నాటికి మూడొంతుల మంది రైతులకు అమరావతిలో ప్లాట్లు కేటాయించారు. 

 

ఎన్నికల తరువాత మారిన చిత్రం

ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం విమానాశ్రయ రైతుల సమస్యలను పక్కన పెట్టేసింది. మిగిలిపోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు అంశం అపరిష్కృతంగా మారింది. దాదాపు రూ.108 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అంగుళం పురోగతి కూడా లేదు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తేవడంతో అమరావతిలో భూముల ధరలు పడిపోయాయి. అమరావతి నుంచి పరిపాలనా కేంద్రం తరలిపోతే తమ త్యాగానికి విలువ లేకుండా పోతుందని గన్నవరం ప్రాంత రైతులు వాపోతున్నారు. ఖరీదైన భూములను విమానాశ్రయ అభివృద్ధికి ఇచ్చామని, ప్యాకేజీలో భాగంగా అమరావతిలో ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకపోవటం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

భూముల్లో నాట్లు వేస్తున్న రైతులు

రన్‌వేకు సమీపంలో విమానాశ్రయం స్వాధీనంలో ఉన్న తమ భూముల్లో రైతులు సాగు ప్రారంభించారు. దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేస్తున్నారు. నూతన రన్‌వే వెంబడి నేవిగేషన్‌ కంట్రోల్‌ స్టేషన్‌ దగ్గర ఉన్న భూముల్లో సాగు చేపట్టారు. ఈ పరిణామంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉలిక్కి పడ్డారు. రైతులతో చర్చలు సాగిస్తున్నా ఫలితం కనిపించలేదు. ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం లభించకపోవటం వల్ల విమానాశ్రయ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. రైతులు కోర్టును ఆశ్రయిస్తారని, అప్పుడు సమస్య జఠిలమవుతుందని, సామరస్యంగా చర్చలు జరుపుతున్నారు. 

 

న్యాయపోరాటం దిశగా రైతులు

తమకు జరుగుతున్న అన్యాయంపై గన్నవరం ప్రాంత రైతులు న్యాయపోరాటానికి సిద్ధమవ్వాలని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించటానికి ఏడాదికి పైగా సమయం ఇచ్చి ఓపిక వహించామని, ఇక తమ వల్ల కాదంటున్నారు. తమ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాలని కోర్టును ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.

Link to comment
Share on other sites

56 minutes ago, Ryzen_renoir said:

That's the best decision to take, intha pedha coast undi we don't have infra to support medium size boats or processing sea food

These harbours will return 10 times their investment over time if maintained well. 

Remember our fishermen working in Gujarat , Tamil Nadu ?  We can provide lot of employment in here .  Seafood is woefully underutilized , most of Andhra coastlines are used by Tamil boats 

Agreed. Coast line is biggest advantage to AP. Full ga utilize chesukovali to generate the revenue.

Link to comment
Share on other sites

Pandemic time lo , he won't be able to accomplish much but the projects announced are grounded in reality . Monsoon is sucessful this year and it will kick start the economy . 

Central government help chestey , konchem progress otherwise kastam 

Link to comment
Share on other sites

6 minutes ago, Ryzen_renoir said:

Pandemic time lo , he won't be able to accomplish much but the projects announced are grounded in reality . Monsoon is sucessful this year and it will kick start the economy . 

Central government help chestey , konchem progress otherwise kastam 

Reality cheptha. Ippudu central govt entha funds realise chesina freebees ki divert avuthayi chaala.

Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

Reality cheptha. Ippudu central govt entha funds realise chesina freebees ki divert avuthayi chaala.

Inkenta kalam le dobbidayi just inko 3 months govt ki dula teripoddi 

panta konali central daggara kuda dabbulu petrol meeda vesi dobbutunadu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...