Jump to content

Ayyipaye...RaJa KaJa


johnydanylee

Recommended Posts

నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 35 ఏళ్ల వయసు నిండిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో వాలంటీర్లకు పెద్ద షాక్ తగిలింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వాలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. 50 ఇళ్లకు ఒక వాలంటీరు లెక్కన రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వీరిలో ఎక్కువ మంది అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే.

ఇప్పటికే 35 ఏళ్లు నిండి వాలంటీరుగా పనిచేస్తున్న వాలంటీర్లకు సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా అందించే జీతాలు రావడంలేదు. గత కొంతకాలం నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో వాలంటీర్ల నియామకాలు జోరుగా సాగాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...