Jump to content

HAPPY BIRTHDAY BHANU PRIYA

Kool_SRG

Recommended Posts

Happy Birthday Bhanupriya | భానుప్రియ ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, హిందీ సినీ ప్రేక్షకులను తన నటన,గ్లామర్‌తో అలరించిన తార. జనవరి 15న ఈమె పుట్టినరోజు ఈ సందర్భంగా భానుప్రియ సినీ జైత్రయాత్ర గురించి తెలుసుకుందాం..

విశాలనేత్రి... భానుప్రియ

విశాలనేత్రి... భానుప్రియ

అభినేత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం విశాలనేత్రి భానుప్రియ... నటనతోనూ, నర్తనంతోనూ తెలుగువారికి నయనానందం కలిగించిన అభినయ ప్రియ ఆమె... భానుప్రియ అన్న నాలుగక్షరాలు ఆ రోజుల్లో ఎందరో కుర్రాళ్ళకు నిత్యం జపించే మంత్రం... భానుప్రియ అందాల అభినయం రసిక హృదయాల్లో ఓ ఆకర్షణ యంత్రం... కనులు మూసినా, తెరచినా ఈ విశాలాక్షి రూపాన్నే స్మరిస్తూ సాగినవారెందరో... అందరికీ ఈ నాటికీ ఆమె పేరు వినగానే మదిలో మధురమైన బాధ మొదలు కాక మానదు...

మయూరానికే మెలకువలు
భానుప్రియ ఆకర్షణా రూపం ఓ ఎత్తు... ఆమె అందాల అభినయం మరో ఎత్తు... క్షణాల్లో కనులతో కోటీభావాలు పలికించే ఈ అభినేత్రిని ఆరాధించిన వారు ఇప్పటికీ ఆ సుందర స్వప్నాన్ని మదిలో పదిలపరచుకొనే ఉన్నారు... నాట్యమయూరీ అంటూ ఎందరో పల్లవించారు... నిజానికి మయూరి నాట్యం చేయదు... మయూరమే అంటే మగ నెమలి మొయిలిని చూడగానే పరవశించి నృత్యం చేస్తుంది... అయితే భానుప్రియ నాట్యాన్ని ఒక్కసారి వీక్షిస్తే చాలు మయూరాలు కూడా కొన్ని మెలకువలు నేర్చుకోక మానవు... ఆమె నృత్యంలో అంతటి అద్భుతం దాగుంది... ఆ అద్భుతాన్ని కనుల నిండా నింపుకోవడానికే అభిమానులు పరుగులు తీసేవారు... 

ముందు అక్కడ... తరువాత ఇక్కడ... 
భానుప్రియ అసలు పేరు మంగభాను. స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రంగంపేట. అక్కడే భానుప్రియ 1967 జనవరి 15న  కన్నుతెరచింది. భానుప్రియకు  కన్నెవయసు రాకముందే ఆమె కన్నవారు చెన్నపట్టణం చేరారు. అక్కడే భానుప్రియలోని అభినయంపై అభిలాష చలనచిత్రాలవైపు పరుగు తీసింది. భారతీ-వాసు తెరకెక్కించిన 'మెల్ల పేసుంగల్'లో తొలిసారి తెరపై తళుక్కుమంది భాను అందం... ఈ నల్లపొన్ను తమిళ జనాన్ని కట్టిపడేసింది... 
ప్రతిభ ఉన్నవారందరూ ప్రకాశించలేరు. అదృష్టం ఉన్నవారి చెంతకే ప్రతిభావంతులూ చేరతారు. ప్రతిభకు పట్టం కడతారు. అప్పటికే 'మంచుపల్లకి' తీసి, 'సితార' రూపకల్పనలో ఉన్నారు దర్శకుడు వంశీ. భానుప్రియలోని నాట్యం ఆయనను ఆకర్షించింది. తన 'సితార'కు కావలసిన తారను ఆయన భానుప్రియలో చూసుకున్నారు. తొలి చిత్రం 'సితార'తోనే ప్రేక్షకుల మనసులు గెలచుకుంది భానుప్రియ. వంశీ చిత్రాల్లో భానుప్రియకు అందం, అభినయం రెండింటికి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. ఆ పాత్రలతో జనానికి మరింత చేరువయ్యారామె.

భానుప్రియకు 'స్వర్ణకమలం'
నాటి టాప్ స్టార్స్  అందరి సరసన భానుప్రియ అందం చిందేసింది. ఏ హీరోతో జోడీ కట్టినా భానుప్రియ తన డాన్స్ తో  మత్తెక్కించింది... ఆ మత్తునే జనం కోరుకున్నారు... చిత్తవుతూనే మళ్ళీ మళ్ళీ  భాను డాన్స్  చూసి తామూ చిందేశారు...భానుప్రియకు ఆమె కళ్ళు ఎంత పెద్ద ఆకర్షణో, నాట్యం అంతకంటే మిన్న అని చెప్పవచ్చు... కళాతపస్వి కె.విశ్వనాథ్ ఆమె నాట్యం చుట్టూ కథను అల్లుతూ 'స్వర్ణకమలం' రూపొందించారు. దీనిని బట్టే భానుప్రియ నర్తనానికి ఎంతటి కీర్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. 'స్వర్ణకమలం' అప్పట్లో ఎందుకనో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఇప్పటికీ ఆ సినిమా వస్తోందంటే చాలు నవతరం ప్రేక్షకులు సైతం కళ్ళప్పగించి చూస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా భానుప్రియ అభినయానికి అసలైన అవార్డు 'స్వర్ణకమలం' అని చెప్పవచ్చు. 

ఉత్తరాదిన... 
భానుప్రియ అందం ఉత్తరాదిన సైతం చిందులు వేసింది... అనేక హిందీ చిత్రాలలో నాటి మేటి హిందీ నటుల సరసన నటించి ఆకట్టుకున్నారామె. సదరు చిత్రాలతో కొంత గుర్తింపు లభించగానే మన తెలుగు తార శ్రీదేవిలాగా ముక్కును సన్నం చేసుకుంది.. కానీ, అది భానుప్రియకు కలసి రాలేదు... కలిసొచ్చిన కాలంలో భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు కనకవర్షం కురిపించాయి... తరువాత బాలీవుడ్ పై భానుప్రియ ఫోకస్ ఎక్కువయింది...ఇక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి... దాంతో తమిళ, హిందీ చిత్రాలతోనే భానుప్రియ కొంతకాలం సాగారు.. ఆ పై అమెరికా వెళ్ళి  అక్కడే పెళ్ళి చేసుకున్నారు... కొంతకాలం భాను కాపురం సవ్యంగా సాగింది. ఆ తరువాత విడాకులు తీసుకొని మళ్ళీ  కెమెరా ముందుకు వచ్చి  తన వయసుకు తగ్గ పాత్రలు ధరించారు... ఆ చిత్రాలతోనూ అలరించారు... 'ఛత్రపతి'లో ప్రభాస్ తల్లిగా భానుప్రియ మళ్ళీ  జనాదరణ చూరగొన్నారు. 
భానుప్రియ విశాల నేత్రాలు ఇప్పటికీ ఎందరినో ఆకర్షిస్తూనే ఉన్నాయి... ఇక నాటి నర్తనం చూసి నవతరం ప్రేక్షకులు సైతం భానుప్రియ అభిమానులుగా మారిపోతున్నారు... వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది అనుకొనేవారు సైతం నాటి భానుప్రియ చిత్రాలు చూసి ఆనందిస్తున్నారు...

  • Upvote 2
Link to comment
Share on other sites

5 minutes ago, Kool_SRG said:

very clean and awesome actress except one mallu sex movie I guess....%$#$

Link to comment
Share on other sites

Bhanupriya Birthday: ఒకప్పటి గ్లామర్ క్వీన్ భానుప్రియ గురించి ఈ నిజాలు తెలుసా..

భానుప్రియ ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, హిందీ సినీ ప్రేక్షకులను తన నటన,గ్లామర్‌తో అలరించిన తార. జనవరి 15న ఈమె పుట్టినరోజు ఈ సందర్భంగా భానుప్రియ సినీ జైత్రయాత్ర గురించి తెలుసుకుందాం.. (Facebook/Photos)

భానుప్రియ ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, హిందీ సినీ ప్రేక్షకులను తన నటన,గ్లామర్‌తో అలరించిన తార. జనవరి 15న ఈమె పుట్టినరోజు ఈ సందర్భంగా భానుప్రియ సినీ జైత్రయాత్ర గురించి తెలుసుకుందాం.. 

ఆల్చిప్పల్లాంటి కన్నులు.. వాలు జడ.. మొత్తంగా బాపూ బొమ్మలా వుంటారు భాను ప్రియ. మరో శ్రీదేవిగా పేరున్న భాను ప్రియ అప్పట్లో ఓ డాన్సింగ్ సెన్సేషన్.

అందెల రవళిది పదముల దా అంటూ ఆమె చేసిన నాట్య విన్యాసాలు చూసి మురిసిపోయారు ప్రేక్షకులు. సినిమా డాన్సులేగా? అన్నట్టుండేవి ఆమె నాట్యం చేస్తే. మేల్ యాక్టర్స్ లో బెస్ట్ డాన్సర్ చిరంజీవి అయితే ఫిమేల్ యాక్టర్స్ లో అంత మంచి డాన్సర్ భానుప్రియ అన్న టాకుండేది ఇండస్ట్రీలో.. (Twitter/Photo)

అందెల రవళిది పదముల దా అంటూ ఆమె చేసిన నాట్య విన్యాసాలు చూసి మురిసిపోయారు ప్రేక్షకులు. సినిమా డాన్సులేగా? అన్నట్టుండేవి ఆమె నాట్యం చేస్తే. మేల్ యాక్టర్స్ లో బెస్ట్ డాన్సర్ చిరంజీవి అయితే ఫిమేల్ యాక్టర్స్ లో అంత మంచి డాన్సర్ భానుప్రియ అన్న టాకుండేది ఇండస్ట్రీలో.. 

భానుప్రియ మొదటి సినిమా తమిళంలో వచ్చింది. తెలుగులో సితారతో తెరంగెట్రం చేశారామె. వంశీ- భాను ప్రియ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ గా వుంటుంది. మహల్లో కోకిల అనే వంశీ నవలకు తెర రూపం సితార. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టడంతో భానుప్రియ వెనుదిరిగి చూసుకోలేదు.

1967, జనవరి 15న జన్మించిన భాను ప్రియ అసలు పేరు మంగభాను.

భానుప్రియ తన సినీ కెరీరర్‌లో దాదాపు 110 సినిమాలు చేశారు. వీటిలో అనేక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలున్నాయి. ముఖ్యంగా నృత్య ప్రధానమైన చిత్రాలంటే దర్శకనిర్మాతలకు ముందుగా ఆమే గుర్తుకు వచ్చేవారు.

సితార హిట్టవడంతో వంశీ- భానుప్రియ కాంబినేషన్ కు సపరేట్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రేమించు పెళ్లాడు, ఆలాపన, అన్వేషణ వంటి మంచి చిత్రాలొచ్చాయి. ప్రేమించు పెళ్లాడు పెద్ద హిట్ కాలేదు కానీ పాటలు ఇప్పటికీ వినసొంపుగా వుంటాయి. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, వయ్యారీ గోదారమ్మ పాటలు అప్పట్లో ప్రతి ఒక్కరూ హమ్ చేసేవారు. (Facebook/Photo)

సితార హిట్టవడంతో వంశీ- భానుప్రియ కాంబినేషన్ కు సపరేట్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రేమించు పెళ్లాడు, ఆలాపన, అన్వేషణ వంటి మంచి చిత్రాలొచ్చాయి. ప్రేమించు పెళ్లాడు పెద్ద హిట్ కాలేదు కానీ పాటలు ఇప్పటికీ వినసొంపుగా వుంటాయి. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, వయ్యారీ గోదారమ్మ పాటలు అప్పట్లో ప్రతి ఒక్కరూ హమ్ చేసేవారు.

అన్వేషణ పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కను చంపిన హంతకులను పసి గట్టేందుకు పక్షులరాగాలపై పరిశోధన చేసే పాత్రలో కనిపిస్తుందీ సినిమాలో భానుప్రియ. కీరవాణి, కిలకిల, ఏకాంత వేళ.. ఇలా అన్వేషణ పాటలన్నీ హిట్లే..

మంచి పాటలకు సూటయ్యే హీరోయిన్ ఎవరంటే భాను ప్రియ బెస్ట్ ఆప్షన్. అందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణ గా నిలుస్తాయి. శ్రీనివాసకళ్యాణం సినిమానే తీసుకుంటే అందులోని తుమ్మెద ఓ తుమ్మెదా ఆ కోవలోకేవస్తుంది.. 

ఇక కే. విశ్వనాథ్ స్వర్ణకమలం భానుప్రియ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫామెన్స్ కు నిలువెత్తు రూపం. ఈ సినిమాలో ఆమె కేరెక్టర్ స్పెషల్ గా వుంటుంది. టాలెంట్ వుండీ దానిపై దృష్టి పెట్టని అమ్మాయిగా నటించి అదుర్స్ అనిపించింది. ఈ సినిమా పాటలు.. వాటికి భానుప్రియ మాత్రమే చేయగల డాన్సులూ అబ్బో.. చెప్పడం కంటే చూడ్డం బెటర్ అన్నారు ప్రేక్షకులు.. (Youtube/Credit)

ఇక కే. విశ్వనాథ్ స్వర్ణకమలం భానుప్రియ ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫామెన్స్ కు నిలువెత్తు రూపం. ఈ సినిమాలో ఆమె కేరెక్టర్ స్పెషల్ గా వుంటుంది. టాలెంట్ వుండీ దానిపై దృష్టి పెట్టని అమ్మాయిగా నటించి అదుర్స్ అనిపించింది. ఈ సినిమా పాటలు.. వాటికి భానుప్రియ మాత్రమే చేయగల డాన్సులూ అబ్బో.. చెప్పడం కంటే చూడ్డం బెటర్ అన్నారు ప్రేక్షకులు.. 

డాన్సింగ్ క్వీన్ కావడంతో బ్రేక్ డాన్సర్ అయిన చిరంజీవితో అనేక సినిమాలు చేసారు భాను ప్రియ. చిరంజీవి, జ్వాల, విజేత, చక్రవర్తి, దొంగమొగుడు, జేబుదొంగ, స్టేట్ రౌడీ, త్రినేత్రుడు.. ఇలా పలు చిత్రాల్లో మెగాస్టార్ తో కలిసి నటించారామె. చిరంజీవితో భాను ప్రియ చేసిన చిత్రాలన్నిటిలోకీ బిగ్గెస్ట్ హిట్ ఖైదీ నెంబర్ 786. ఈ సినిమాలోని పాటలు వేటికవే హిట్.

బాక్సాఫీస్ బోనాంజా నందమూరి నటసింహం బాలకృష్ణతోనూ అనేక చిత్రాల్లో నటించారు భానుప్రియ. అల్లరి కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, భారతంలో బాలచంద్రుడు.. ఇలా బాలయ్యతో వరుస చిత్రాలో నటించారామె.

భానుప్రియ బాలీవుడ్ డెబ్యూ ఫిలిం.. దోస్తీ దుష్మనీ..

ఆ తర్వాత ఇన్సాఫ్ కీ పుకార్, ఖుదాగర్జ్, మర్ మితెంగే, తంచా, సూర్య యాన్ అవేకింగ్.. హిందీలో నాన్ స్టాప్ గా చేస్తూనే వచ్చారు.. కానీ, అవేవీ పెద్దగా హిట్ కాలేదు.

ఏడుకొండలస్వామి, అన్నమయ్య వంటి భక్తిరస చిత్రాల్లోనూ చేశారు భానుప్రియ.

ఇటు తెలుగులో చేస్తూనే అటు తమిళ, మలయాళ చిత్రాలను అనేకం చేశారు భాను ప్రియ. ఆరారో ఆరారియో, పొండాట్టి సొన్నా కేట్టుకునం, అలగణ్, పొరంద వీడా- పుగంద వీడా.. హైవే, అళగియ రావణన్.. ఇలా ఎన్నో తమిళ, మలయాళ మూవీస్ లో యాక్ట్ చేశారు భానుప్రియ.

ఆ తర్వాత పెదరాయుడు వంటిచిత్రాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రలు చేశారు.వదిన, అక్కయ్య, అమ్మ పాత్రల్లో అద్భుతంగా నటించారు. గౌతమ్ ఎస్సెసీ, ఛత్రపతి సినిమాలను చూస్తే భానుప్రియ నటన ఇప్పటి జనరేషన్ కి బాగా తెలుస్తుంది.

అమెరికాలో స్థిరపడ్డ ఆదర్శ్ కౌషల్ అనే ఫోటోగ్రాఫర్ ని మేరేజ్ చేసుకున్నారు భానుప్రియ. వారిద్దరికీ అభినయ అనే పాప కూడా వుంది. ప్రస్తుతం భర్తతో విడిపోయారీ డాన్సింగ్ క్వీన్. కూచిపూడి, భరతనాట్యం శిక్షణ ఇస్తూ మధ్య మధ్య.. తగిన పాత్రలు దొరికినప్పుడు టీవీ సినిమాల్లో చేస్తూ.. గడుపుతున్నారు.

2018లో భానుప్రియ భర్త అనారోగ్యంతో కన్నుమూసారు. (Twitter/Photo)

2018లో భానుప్రియ భర్త అనారోగ్యంతో కన్నుమూసారు. 

పద్ధతి గల పాత్రలకు పెట్టింది పేరు భానుప్రియ. భాను ప్రియ యాక్టర్ కాకుండా ఏ డాక్టర్ అయి వుంటే కొన్ని మంచి నృత్యాలను చూడక పోయి వుండేవాళ్లేమో తెలుగు ప్రేక్షకులు.

బిగ్‌ స్క్రీన్ తో పాటు స్మాల్ స్క్రీన్ లో పలు పాత్రలను పోషించింది. తెలుగులో ‘నాతిచరామి’ అనే టెలి సీరియల్లో నటించింది. 

భానుప్రియ నటనకు పలు అవార్డులు కూడా వరించాయి. ఉత్తమ నటిగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మూడు నంది అవార్డులు అందుకున్నారు భానుప్రియ.

భానుప్రియ భారతీయుడులో ఊర్మిళకు, కాజల్, రంభ, నివేదిత జైన్, మనీషా కొయిరాల వంటి హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్పి భళా అనిపించారు.

తెలుగులో చివరగా ‘మహానటి’లో కీర్తి సురేష్ తల్లి పాత్రలో నటించింది భానుప్రియ

Link to comment
Share on other sites

8 minutes ago, Kool_SRG said:

Mahanati lo Keerthi Suresh Mother Divyavani kada??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...