Jump to content

స్థానికతపై వస్తున్న విమర్శలపై వైఎస్ షర్మిల స్పష్టత - కేసీఆర్‌, విజయశాంతి ఎక్కడ పుట్టారు..?


Somedude

Recommended Posts

02242021203647n30.jpg

హైదరాబాద్: తన స్థానికతపై వస్తున్న విమర్శలపై వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. మీడియాతో ఆమె బుధవారం చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే పిల్లలను కన్నాను. సీఎం కేసీఆర్‌, బీజేపీ నేత విజయశాంతి ఎక్కడ పుట్టారు?’’ అని ప్రశ్నించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టడం సీఎం జగన్‌కు ఇష్టం లేదని వెల్లడించారు. జగన్‌తో తనకు పార్టీ పరమైన విభేదాలు మాత్రమేనని చెప్పారు. తనకు ఎందుకు వైసీపీలో ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్‌ను అడగాలని, తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని మరోసారి షర్మిల స్పష్టం చేశారు. ఉద్యమం అంటూ ఒకరు.. మతం అంటూ మరొకరు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధిలేదని ఆక్షేపించారు. అతిత్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌ను ఎదురించడానికైనా సిద్ధమని స్పష్టత ఇచ్చారు. పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు దాకా తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. తెలంగాణలో రాజన్న పథకాలనే కాపీ కొట్టారని షర్మిల ఆరోపించారు. 

 

‘‘తెలంగాణలో వైసీపీ ఎక్కడుంది..?. గొర్రెలు, బర్రెలు ఇవ్వడంకన్నా ఉద్యోగాలపై దృష్టిపెట్టలేదు. రాజకీయ పార్టీపై భర్త అనిల్‌ పూర్తి సహకారం ఉంది. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కోవిడ్‌ విషయంలో ఆస్పత్రులు లక్షలు వసూలు చేశాయి. ఆస్పత్రుల దోపిడీపై కనీసం సీఎం దృష్టిపెట్టలేకపోయారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. అమరవీరుల కుటుంబాలను కలుస్తా. లోటస్‌పాండ్‌లోని నా నివాసం నుంచే పార్టీ ప్రస్థానం మొదలవుతుంది. హైదరాబాద్‌తో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. దివంగత మాజీ సీఎం జయలలిత ఎక్కడ పుట్టి, ఎక్కడ సీఎం అయ్యారో అందరికీ తెలుసు. నాకు విజయమ్మ పూర్తి మద్దతు ఉంది’’ అని షర్మిల తెలిపారు.

Link to comment
Share on other sites

29 minutes ago, Somedude said:

02242021203647n30.jpgతెలంగాణ అభివృద్ధిపై ఎవరికీ చిత్తశుద్ధిలేదని ఆక్షేపించారు. అతిత్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్‌ను ఎదురించడానికైనా సిద్ధమని స్పష్టత ఇచ్చారు.

Tg abhivriddhi ki jalaganna gadini eduristhe emostadhi boodidha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...