Jump to content

విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధాని !


r2d2

Recommended Posts

CBSE: విద్యార్థులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధాని

హఠాత్తుగా ఓ ఆన్‌లైన్‌ సమావేశంలో ప్రత్యక్షమై కొంతమంది సీబీఎస్‌ఈ విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆన్‌లైన్‌లో ఓ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై అధికారులు వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈలోగా అనుకోకుండా ప్రధాని మోదీ ఆ సమావేశానికి హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా కొద్దిసేపు మాట్లాడారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేసినందుకు ప్రధానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘అనుకోకుండా మీతో కలిశాను. నావల్ల మీ సరదాకి భంగం వాటిల్లలేదు కదా..! పరీక్షలు రద్దవ్వడంతో మీ ఆనందానికి అవధుల్లేవని అర్థమవుతోంది’’ అంటూ విద్యార్థులతో సరదాగా అన్నారు. పరీక్షల గురించి ఆందోళన చెందారా? అని ప్రధాని విద్యార్థులను ప్రశ్నించగా.. చాలా మంది ‘అవును’ అంటూ సమాధానమిచ్చారు. అలాగైతే నేను పుస్తకం రాయడం వ్యర్థం అంటూ మోదీ వ్యాఖ్యానించారు. తాను రాసిన ‘ ఎక్జాం వారియర్‌’ పుస్తకంలో పరీక్షలంటే ఆందోళన చెందకూడదని రాసినట్లు విద్యార్థులకు వివరించారు. గువాహటికి చెందిన ఓ విద్యార్థి ఆ పుస్తకం తాను చదివానని, అందులోని కొన్ని అంశాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని మోదీకి వివరించింది. 

పంచకులకు చెందిన హితేశ్వర్‌ శర్మ అనే విద్యార్థితో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘ నువ్వు పదోతరగతిలో టాపర్‌వి. పన్నెండో తరగతిలోనూ టాపర్‌గా నిలవాలని అనుకునే ఉంటావు. కానీ, పరీక్షల్లేవు కదా అందువల్ల. నీ కొరిక నెరవేరదు’’ అని అన్నారు. దానికి శర్మ స్పందిస్తూ.. ‘మనం చేసిన ఏ ప్రయత్నమూ వృథాగా పోదు కదా’ అని సమాధానమిచ్చాడు. ‘‘ జ్ఞానం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. జ్ఞానసముపార్జన చేసిన వాడు ఎక్కడికి వెళ్లినా టాపర్‌గానే ఉంటాడు’’ అని సమాధానమిస్తూ ప్రధానిని ఆకట్టుకున్నాడు. మరోవైపు గత ఏడాది విద్యార్థుల ప్రతిభ ఆధారంగా కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా విద్యార్థులకు మార్కులు కేటాయించాలని విద్యా శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లో అతినమ్మకంతో మాస్కులు ధరించడం మానొద్దని ప్రధాని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తమ చుట్టు పక్కల వారు మాస్కులు ధరించకపోవడం వల్ల వారికి ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ప్రస్తుతం ఎలాగూ పాఠశాలలు, పరీక్షలు లేనందున జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని, చుట్టుపక్కల వారికి కరోనాపై అవగాహన కల్పించాలని ప్రధాని వారికి సూచించారు.

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

7 minutes ago, r2d2 said:

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేసినందుకు ప్రధానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Veediki intha free time undha...

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Chese pani em ledu

Pubg game lo join iathe jaggadu accept cheyatle anta 

maree cheap ga CBSE exams cancel eedu chesudu endho.... ga vaccines sangthi sudra bhai ante sappud ledhu..

Link to comment
Share on other sites

Just now, reality said:

maree cheap ga CBSE exams cancel eedu chesudu endho.... ga vaccines sangthi sudra bhai ante sappud ledhu..

Diversion folitics

  • Upvote 1
Link to comment
Share on other sites

59 minutes ago, Hydrockers said:

Chese pani em ledu

Pubg game lo join iathe jaggadu accept cheyatle anta 

anduke ga, fau-g game anedi edo develop chesaranukunta kada :) 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...