Jump to content

Arey entraa idi


snoww

Recommended Posts

Love: ముక్కోణపు ప్రేమకథకు లాటరీతో ముగింపు

Love: ముక్కోణపు ప్రేమకథకు లాటరీతో ముగింపు

హాసన, న్యూస్‌టుడే: అది ముక్కోణపు ప్రేమ కథ.. ఎలా పరిష్కరించాలో తలలు పట్టుకున్న గ్రామస్థులు చివరకు లాటరీ ద్వారా ఇద్దరు యువతుల్లో ఒకరిని ఎంపిక చేసి వివాహం జరిపించడంతో కథ సుఖాంతమైంది. ఇదేదో సినిమాలోని సన్నివేశమనుకుంటే తప్పులో కాలేసినట్లే. కర్ణాటకలోని హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని ఓ కుగ్రామం (పేరు రాయొద్దని గ్రామస్థులు)లో జరిగిన వాస్తవ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొన్ని నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ కథ శుక్రవారం సుఖాంతం కాగా, ఆదివారం ఈ విషయాన్ని గ్రామస్థులు బయటపెట్టారు. వివరాల్లోకెళ్తే.. సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు అంతర్జాలం ద్వారా వేర్వేరు ప్రాంతాల్లోని ఇద్దరిని ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు. ఆ ఇద్దరు యువతులకూ అతడంటే చచ్చేంత ప్రేమ. అతడు లేకుండా బతకలేమన్నారు. అతడ్ని వివాహం చేసుకునేందుకు ఇద్దరూ సమ్మతించారు. అయితే ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాలేదు. గ్రామస్థులు ‘పంచాయితీ’ చేసినా ఫలితం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో ఓ యువతి ముందుకొచ్చి ఆ యువకుడు లేని జీవితం తనకు వ్యర్థమని చెప్పి విషం తాగింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆమె కోలుకుని గ్రామానికి తిరిగి వచ్చింది. శుక్రవారం మరోసారి ముక్కోణపు ప్రేమ వ్యవహారం తెరమీదకు వచ్చింది. గ్రామస్థులు చివరికి ఓ మార్గాన్ని కనిపెట్టారు. లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని, ఇందులో విఫలమైన యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా వెనుదిరగాలని షరతు విధించారు. లాటరీ తీయగా అందులో విషం తాగిన యువతి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ యువకుడితో ఆమె వివాహం జరిపించారు. ప్రేమపురాణంలో విఫలమైన యువతి తన పోటీదారుతో మాట్లాడుతూ ‘మీ వివాహ జీవితం సంతోషంగా కొనసాగాల’ని ఆకాంక్షించింది. అయితే తనను మోసగించిన యువకుడిని సులువుగా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించడం గమనార్హం.

 

Love: ముక్కోణపు ప్రేమకథకు లాటరీతో ముగింపు

Link to comment
Share on other sites

22 minutes ago, snoww said:

arey-entra-idhi-shanmukesh.gif

అయితే తనను మోసగించిన యువకుడిని సులువుగా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించడం గమనార్హం.

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...