Jump to content

SP Balu Death Anniversary: పాటగా బతకనా మీ అందరి నోట అంటూ.. దివికేగిన ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి నేడు..


Kool_SRG

Recommended Posts

SP Balasubrahmanyam Death Anniversary: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం  తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు. ఎస్పీ బాలు విషయానికొస్తే.. ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలిచాయి. ఆయన పాట శ్రోతలకు పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుందా గాత్రం. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి.బాలు గొంతులో భక్తి తొణికిస లాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి.

పాటలోని మాటలను ...గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రమణ్యం. ఆయన గొంతకు తరాల అంతరాలు తెలియదు.

SP Bala Subrahmanyam donated his ancestral home in Thipparaju Vari street Nellore to Kanchi Veda Patashaala,S. P. Balasubrahmanyam,sp Balasubrahmanyam own house donated to kanchi kamakoti peetham,sp balu Vijayendra Saraswati,tollywood,telugu cinema,tollywood,telugu cinema,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలు,వేద పాఠశాల,ఎస్పీ బాలు వేద పాఠశాల,కంచి కామకోటి పీఠం,విజయేంద్ర సరస్వతి

బాలసుబ్రహ్మణ్యం.. ,1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్. పి. బీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం.  తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.

sp balasubramaniam, sp balasubramaniam comments on Chennai water crisis, tamilnadu, singer sp balasubramaniam, tamilnadu water crisis, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చెన్నై నీటి కష్టాలపై ఎస్పీ బాలు కామెంట్స్, తమిళనాడు, సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తమిళనాడు నీటి కష్టాలు

గాయకుడిగా కెరీర్ ప్రారంభించాక ఆయనకు పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు. కేవలం అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోలకే పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏన్నార్‌లకు ఘంటసాల తప్ప ఎవరు పాడినా.. ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. అయిన అడపా దడపా ఘంటసాలతో గొంతు కలిపే పాడే అరుదైన అవకాశాలు.. బాలుకు రానే వచ్చాయి. ప్రతిరాత్రి వసంత రాత్రి.. ప్రతిగాలి పైర గాలి.. అంటూ ‘ఏకవీర’ లో అమర గాయకుడు ఘంటసాల తో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హమ్ చేసుకునేలా ఉంటాయి.

Gantasala-SP-Balu-News18.jpg

ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యారు బాల సుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ..సన్నివేశ బలానికి తగినట్టు నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎప్పీ. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నారు.

 

 
SP-Balu-Shankarabharanm-Movie-News18.jpg
పదాల మాధుర్యాన్ని గమనించి.. బాలూ చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకి చేరువ చేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటారు బాలూ. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో..  అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.

SP-Balu-Ek-Duje-Ke-Liye-News18.jpg

‘చెల్లెలి కాపురం’ లో బాలు పాడిన.. చరణ కింకరులు ఘల్లు ఘల్లు మన...కర కంకణములు గల గల లాడగా అంటూ ఎస్పీ తన గొంతులో పలికించిన వేరియేషన్స్ శ్రోతల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఏపాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలు కి తప్పించి మరొకరికి సాధ్యం కాదు. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.

గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించారు బాలు. సంగీత దర్శకుడిగా ‘పడమటి సంధ్యారాగం’, ‘జాకీ’, ‘మగధీరుడు’, ‘జైత్రయాత్ర’ వంటి  యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించారు. నిర్మాతగా ‘కెప్టెన్ కృష్ణ, ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి  చాటుకున్నారు. బాలసుబ్రమణ్యం పాటలు పాడుతుంటే వినేవారికి మాటలు రావు. ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ...బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.

O-Papa-lali-SP-Balu-News18.jpg

నాడు ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాట తెలియని సంగీత రసజ్ఞులు ఉండరు. తన గురువు ఘంటసాల బాటలో ‘భైరవ ద్వీపం’లో బాలూ పాడిన శ్రీ తుంబుర నారద నాదామృతం పాటలో..బాలూ ఆలపించిన గంధర్వ గానం శ్రోతలకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.నాలుగు దశాబ్దాల్లో...11భాషల్లో 40వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పారు బాలు. ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు.

SP-Balu-With-President-Of-India-News18.jpg

చనిపోయే కొన్ని నెలల క్రితమే నెల్లూరిలో ఉన్న సొంత ఇంటిని శంకరాచార్య పీఠానికి ఇచ్చారు.  ఉత్తమ గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డు. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మక  పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. చనిపోయిన తర్వాత కేంద్రం ఈయనకు పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తెలుగులో ఏఎన్నార్ తర్వాత మూడు పద్మ పురస్కారాలు అందుకున్నది దివంగత బాలూ గారే కావడం విశేషం. గతేడాది ఆగష్టు 5న బాలు గారు  కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ గతేడాది 74 ఏళ్ల వయసులో 2020 సెప్టెంబర్ 25న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

బాలు మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసినట్టైయింది. అంతేకాదు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు. అందుకే బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఇప్పటికీ ఎప్పటికీ తరగని నిధి.

  • Like 2
Link to comment
Share on other sites

Telugu industry lo okka program kooda cheyale, okkadu kooda matladale. Ee so called super stars megay stars andaru ala stars avvadam lo eeyana sahakaram chaala undi. 

Ade Tamil industry lo choodandi vayya 3 hours program nirvahincharu Tamilodu kakunna, anduke ee Telugu industry ila tagaladindi. next time manam outsiders ochi sasistunnaru ane mundu mana own backyard choosukodam better. 

Emantavu bedaru @RedThupaki

Link to comment
Share on other sites

33 minutes ago, ShruteSastry said:

What a Song Sir. SPB should have lived some more years.

Yes ...ee song vintuu...baalu sir ni think chesthuntey...heart rending...

Ee song aayaney aayna kosam paadinattu undhi...

Long live spb sir

Link to comment
Share on other sites

39 minutes ago, tennisluvrredux said:

Telugu industry lo okka program kooda cheyale, okkadu kooda matladale. Ee so called super stars megay stars andaru ala stars avvadam lo eeyana sahakaram chaala undi. 

Ade Tamil industry lo choodandi vayya 3 hours program nirvahincharu Tamilodu kakunna, anduke ee Telugu industry ila tagaladindi. next time manam outsiders ochi sasistunnaru ane mundu mana own backyard choosukodam better. 

Emantavu bedaru @RedThupaki

Motham industry kaadhuley bro...old actors andaru industry kosam kastapaddaru...like NTR..aNR...SVR...prabhakar reddyy.ghantasalaa gaadu etc etc...great people....aa tharavtha antha scrap...

 

 

Link to comment
Share on other sites

12 minutes ago, RedThupaki said:

Motham industry kaadhuley bro...old actors andaru industry kosam kastapaddaru...like NTR..aNR...SVR...prabhakar reddyy.ghantasalaa gaadu etc etc...great people....aa tharavtha antha scrap...

 

 

Yeah nenu modern generation gurinche cheptunna bro, veellu entha kampu gallu tayarayyaro latest incidents choose cheppochu. Malli industry ki annayya ani okadosthadu, ilanti incidents ayinappudu pilli la moosukuni koorchuntadu. Atleast Dasari had guts to speak honestly, veediki adi ledu

Link to comment
Share on other sites

1 hour ago, tennisluvrredux said:

Yeah nenu modern generation gurinche cheptunna bro, veellu entha kampu gallu tayarayyaro latest incidents choose cheppochu. Malli industry ki annayya ani okadosthadu, ilanti incidents ayinappudu pilli la moosukuni koorchuntadu. Atleast Dasari had guts to speak honestly, veediki adi ledu

Anniya gurunchi enni books raasina saripovu bro..anniya meGayy paamily telugu states ki chesthunna benefit antha intha kaadhu ...enthoooo undhi

  • Haha 1
Link to comment
Share on other sites

4 hours ago, futureofandhra said:

telugu gonthu moogaboyina roju

Ayana telugodi ga janminchadam mana adrustam, but we don't deserve him. 

Bharat Ratna demand kooda Tamila sodarula nunde vellindi, mana industry kaneesam oka statement kooda ivvale aayana vardhanti rojuna. 

Adi manam mana artists ki iche value, Kota gaaru anna danilo asalu tappe ledu. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...